.
హఠాత్తుగా ఓ ప్రోమో కనిపించింది… అది జీతెలుగులో వచ్చే సరిగమప లిటిల్ ఛాంప్స్ తాజా ప్రోమో… పేరుకు సినిమా పాటల రియాలిటీ షో… పిల్లల మెరిట్ పరీక్షించే సింగింగ్ షో… కానీ దాన్ని ఫుల్ ఫన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ షో చేసేశారు…
ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారో గానీ వినోదం బాగానే పండుతోంది… శైలజ, అనిల్ రావిపూడి, అనంత శ్రీరాం జడ్జిలు… ఇంకొందరు సింగర్స్ కూడా కనిపిస్తున్నారు… ఈ ప్రోమో బాగానే రక్తికట్టింది… అసలే అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ బాగుంటుంది, తను అందరినీ మిమిక్ చేయగలడు…
Ads
తనకు తగినట్టు ఇక సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా జతకలిశాడు… పాటలు రాయడం మానేసి అనంత శ్రీరాం కూడా ఇలాంటి షోలలో కమెడియన్ అయిపోతున్నాడు… ఇంకేం..? ఫుల్ ఫన్… ఇవన్నీ కాదు గానీ, ప్రోమోలో ఆకట్టుకున్నది సుధీర్ వయోలిన్ జ్ఞానం…

అటు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌కు, ఇటు జీతెలుగు లిటిల్ ఛాంప్స్‌కు సాయి ఆర్కెస్ట్రా టీమ్ పనిచేస్తుంది… అందులో అంబటిపూడి కామాక్షి అనే వయోలినిస్ట్ ప్రధాన ఆకర్షణ… అసలే సుధీర్ కదా… ఆమెను వేదిక మీదకు తీసుకొచ్చాడు… తనకు వయోలిన్ నేర్పించమంటూ… ఫన్ బేస్డ్ స్క్రిప్ట్…

సుధీర్ గురించి తెలిసిందే కదా… కమెడియన్, మెజీషియన్, సినిమా హీరో, ఇప్పుడు హోస్ట్… తెలుగు టీవీపై సూపర్ స్టార్… అంత ఫాలోయింగ్ ఉంటుంది తనకు.,. డాన్సులు, స్టంట్లు చేస్తాడు… రెండుమూడు ఎపిసోడ్లలో పాటలు కూడా పాడినట్టు గుర్తు…
ఇప్పుడు తను వయోలిన్ మీటుతుంటే అచ్చంగా బాగా సాధన చేసినట్టుగా కనిపించింది… ఏమో, ఎఐ క్రియేషన్ కూడా కావచ్చు… తను వయోలిన్ వాయిస్తుంటే అంత మెరిట్ ఉన్న కామాక్షి కూడా మురిపెంగా చూస్తోంది… అనిల్ రావిపూడి చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నాడు… బాగుంది…
వినోదం పంచే వృత్తిలో ఉన్నవాళ్లు ఎప్పుడూ ఒకే మూసలో ఉండిపోకూడదు… భిన్నంగా ప్రయత్నించాలి, సాధన చేయాలి… సుడిగాలి సుధీర్ దగ్గర ఉన్న సుగుణం అదే… ఆ ప్రోమో చూస్తే అనిపించిందీ అదే…
Share this Article