Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘కూడు పెడుతున్న’ ఓటీటీకే టోపీ… ఏమిటీ ఆ స్కామ్..? ఎవరు ఆ నిర్మాత..?

November 10, 2025 by M S R

.

మన వాళ్లు సిద్ధహస్తులు… నాసిరకం సినిమాలతో ప్రేక్షకులనే కాదు… ఇండస్ట్రీలో ఎవరినైనా మోసం చేయగలరు… ఓ తెలుగు నిర్మాత ఓ బడా జాతీయ కార్పొరేట్ ప్రొడక్షన్ కంపెనీనే మోసం చేశాడట… ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

కానీ అందులో పేర్లు లేవు… మోసగించింది ఎవరు..? మోసపోయింది ఎవరు..? ఆ పేర్ల కోసం ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధాలున్నవాళ్లు ఆరాలు తీస్తున్నారు, ఊహాగానాలు చేస్తున్నారు… కాకపోతే ఇప్పటికైతే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్… క్రిమినల్ చర్యలకి కూడా సదరు ముంబయి కార్పొరేట్ నిర్మాణ + ఓటీటీ సంస్థ క్రిమినల్ చర్యలకూ సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నదట…

Ads

విషయం ఏమిటంటే..? ఏ మోసమైనా ఎల్లకాలం సాగదు… ఎక్కడో ఓచోట పసిగట్టబడుతుంది,.. మోసం బట్టబయలు అవుతుంది… తెలిసిందే కదా… ఇది సినిమా కథ కాదు… సినిమా ఇండస్ట్రీలో మోసం కథ…

ఓ తెలుగు నిర్మాత ఓ పెద్ద మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడు… వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఓ తెలుగు నిర్మాత తన మూడు చిత్రాలను 2022–24 మధ్యలో ఈ ప్రముఖ నిర్మాణ- ఓటీటీ సంస్థకు భారీ మొత్తాలకు విక్రయించాడు…

సో వాట్? తప్పేముంది..? ఇప్పుడు ఓటీటీ డబ్బులు లేకపోతే ఎవడూ సినిమాలు తీసే పరిస్థితి లేదు కదా అంటారా..? నిజమే, కానీ పెద్ద బడ్జెట్‌లతో, స్టార్ కాస్టింగు, ప్రముఖ దర్శకులతో తీసిన మధ్యస్థాయి సినిమాలకు కూడా ఈ తెలుగు నిర్మాత అమ్మిన రేటు రాలేదు… అదీ విశేషం…

ఏమో… సినిమాల నాణ్యత నచ్చి అంత పెద్ద రేట్లు పెట్టిందేమో ఆ ఓటీటీ అనుకోవడానికి వీల్లేదు ఇక్కడ… ఆ సినిమాలకు అంత సీన్ లేదు, మరి అంత భారీ రేట్లు ఎలా వచ్చాయి..? అదే అసలు మోసం… అదే అసలు స్కామ్…

సాధారణంగా పెద్ద ఓటీటీ సంస్థలు ఏం చేస్తాయంటే, వాటి బాధ్యులు సినిమాలను చూసి వోకెే చేయరు, రేట్లు ఫైనల్ చేయరు… ప్రాంతీయ భాషలకి ఒక స్థానిక వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటాయి ఈ హక్కుల కొనుగోళ్ల కోసం… ఆ సంస్థలో తెలుగు సినిమాల వ్యవహారాలు చూసే ఓ కీలక పదవిలో ఉన్న వ్యక్తితో ఆ మోస నిర్మాత “గట్టి అనుబంధం “ ఏర్పరుచుకున్నాడుట… ఇండస్ట్రీలో గట్టి అనుబంధం అంటే డబ్బే… తెలుసు కదా…

మా సినిమాల హక్కులను ఎక్కువ రేట్లకు కొనిపిస్తే తగినంత కమిషన్ ఇస్తానని ఆ నిర్మాత సదరు ఓటీటీ ఉద్యోగికి ఆఫర్ ఇచ్చాడు… ఆ కీలక వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు… కథ మొదలైంది… కంపెనీ యాజమాన్యం తమపై ఉంచిన నమ్మకాన్ని వాడుకుని, ఇద్దరూ కలిసి కోట్ల రూపాయలను దోచుకున్నారు… నిర్మాతకు తన కంపెనీ నుంచి అధికంగా డబ్బులు మళ్లించగా, ఆ ఉద్యోగి భారీ కమిషన్లు తీసుకున్నాడు…

ఇదీ జరిగింది… 2025 ప్రారంభంలో ఆ సంస్థ నుంచి తప్పుకున్న ఆ మాజీ ప్రముఖుడు ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు హీరోకి చెందిన సంస్థలో పనిచేస్తున్నట్టు సమాచారం గుప్పుమంది… మరెలా బయటపడినట్టు..?

ఈ మోస నిర్మాత ఆ ఓటీటీ సంస్థను అడ్డగోలుగా దోచుకుంటున్నట్లు అతని క్యాంప్‌లోనే , అతనితో కలిసి వ్యాపారం చేసి ఉన్న వ్యక్తి గమనించి, ఆధారాలతో సహా ఫిర్యాదు పంపించాడట… దీంతో ఆ ఓటీటీ కంపెనీ అంతర్గతంగా ఆడిట్ నిర్వహించింది.., తమ మాజీ కీలక ఉద్యోగి, ఆ నిర్మాత కలిసి భారీగా నిధులు దోచుకున్నారని కనుక్కున్నారు, ఆ మైక్రో ఆడిటింగులో…

మరేం చేశారు..? సదరు కార్పొరేట్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలోనే ఆ వైస్ ప్రెసిడెంట్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది… ప్రస్తుతం దోచుకోబడిన ఆ నిధులను రికవరీ చేసుకోవడంపై దృష్టి సారించింది… నిర్మాత, మాజీ ఉద్యోగి ఇద్దరూ తిరిగి డబ్బులు చెల్లిస్తేనే సరి, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపించింది…

ఈ ఒక్క నిర్మాత, ఒక్క కీలక ఉద్యోగి‌ మాత్రమే కాదు… ఓటీటీ మార్కెట్ విస్తరించిన తర్వాత ఇలాంటి స్కాంలు ఇండస్ట్రీలో పెరిగిపోయాయట… మల్టీనేషనల్ ఓటీటీ కంపెనీల్లో కొంతమంది అధికారులు కావాల్సినంతగా దోచేసుకుంటున్నారన్న గుసగుసలు చాన్నాళ్లుగా వినవస్తున్నవే…  ఏమో, ఈ తాజా స్కామ్ బయటపడినట్టే ఇంకేం బయటపడనున్నాయో చూడాలి…! ఇంతకీ ఆ ఓటీటీ ఏది..? ఆ నిర్మాత ఎవరు..? ప్రస్తుతానికి సస్పెన్స్… పోలీసుల దాకా వ్యవహారం చేరితే అప్పుడు ఉంటుంది అసలు సినిమా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కూడు పెడుతున్న’ ఓటీటీకే టోపీ… ఏమిటీ ఆ స్కామ్..? ఎవరు ఆ నిర్మాత..?
  • రివ్యూ అంటే ఇదీ… క్లైమాక్స్ అంటే ఇదీ… దర్శకత్వం అంటే ఇదీ…
  • ఇది స్మార్ట్ వెలుతురు చీకటి కోణం..! గుండెకే గురిపెడుతోంది..!!
  • ఓ నొటోరియస్ హత్యాచారి..!! వీడింకా బతికే ఉన్నాడు… జైలులో విలాసంగా…!!
  • నాది కవితాగానం కాదు… కాలజ్ఞానం… అందెశ్రీ అంతరంగం ఇదీ…
  • హక్..! దశాబ్దాలనాటి ఆ షాబానో కేసు ఈ సినిమా కథకు నేపథ్యం..!
  • బాడీ షేమింగ్..! ఫిలిమ్ జర్నలిస్టులు ఎక్కడైనా అదే తిక్క ధోరణి..!!
  • అందెశ్రీ..! ప్రజా కవి, సహజ కవి, ప్రకృతి కవి… మాయమైపోయాడు..!!
  • శారద పాత్ర ఉంటే చాలు… పరుచూరి బ్రదర్స్ కలాలకు పదును…
  • వయోలినిస్ట్ సుడిగాలి సుధీర్… ఆసక్తికరంగా ఓ టీవీ షో ప్రోమో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions