.
కాంగ్రెస్ మిత్రులే కాదు, కొందరు బీజేపీ, తటస్ఠ మిత్రుల పోస్టుల్లో కూడా చూశాను… రేవంత్ రెడ్డి మీద ప్రశంసలు.., వేర్వేరు కారణాలతో తనను వ్యతిరేకించేవాళ్లు కూడా ఈ విషయంలో తనను అభినందించారు…
రేవంత్ రెడ్డి నిన్న అస్తమించిన తెలంగాణ మట్టి కవి అందెశ్రీ పాడె మోసిన ఫోటో ఈరోజు వైరల్… ఎందుకు..? ఒక పోలిక… ఒక గూడ అంజన్నను కలవడానికే కేసీయార్ సిద్ధపడలేదు… గద్దర్‌ను సహించలేదు… అందెశ్రీని దగ్గరకే రానివ్వలేదు…
Ads
అలాంటిది గద్దర్ పేరిట అవార్డులే పెట్టాడు రేవంత్ రెడ్డి… అందెశ్రీ రచన జయజయహే తెలంగాణ అనే గీతం తెలంగాణ ఉద్యమంలో ఊరూరా మారుమోగినా కేసీయార్ దాన్ని రాష్ట్రగీతం చేయలేదు… రేవంత్ రెడ్డి దాన్ని రాష్ట్రగీతంగా గుర్తించడమే కాదు… కీరవాణితో స్వరరచన చేయించాడు…
ఇప్పుడు అందెశ్రీ పాడె మోశాడు… ఒక గద్దర్, ఒక అందెశ్రీ ఈ మట్టి కలాలు, గళాలు… చైతన్య కేతనాలు… అనేక మందిని తన పాటతో గద్దర్ అడవుల్లోకి పంపించాడనే విమర్శ ఉంది… కానీ అందెశ్రీ మీద అది కూడా లేదు… నిరక్షరాస్యుడైనా, మట్టి పనితో తన జీవితం కష్టాల్లో మొదలైనా అందెశ్రీ గళానికి, కలానికి అవేమీ అడ్డంకులు కాలేకపోయాయి…
కాకపోతే తన ఆరోగ్యాన్ని తనే నిరక్ష్యం చేశాడనే ప్రేమపూర్వక నింద ఉంది తనపై… చివరకు అదే బలిగొంది… రేవంత్ రెడ్డి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడమే కాదు, పాడె మోసి తను భిన్నమైన ముఖ్యమంత్రిని అని చాటుకున్నాడు…
ఏదో ఓ పూలమాల వేసి, అంజలి ఘటించి వెళ్లిపోలేదు, చివరిదాకా ఉన్నాడు… కుటుంబంలో ఒకరికి కొలువు ఇస్తానన్నాడు… అందెశ్రీ పేరిట ఓ స్మృతి వనం వాగ్దానం చేశాడు… తన ఫేస్ బుక్ ఖాతాలో కనిపించిన పోస్టు ఇదీ…
‘‘కవి, రచయిత, తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీకి అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికాను. బరువెక్కిన గుండెతో పాడి మోసి ఆయనతో నాకున్న అనుబంధపు రుణం తీర్చుకున్నాను.
తన గళంతో, కలంతో జాతిని జాగృత పరిచి, తెలంగాణ సమాజాన్ని నిత్య చైతన్యవంతంగా ఉంచేందుకు శ్రమించిన ఆయన తెలంగాణ గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటారు.
“జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అని పాడే ప్రతి గొంతులో ఆయన ప్రతిధ్వనిస్తారు.
#andesri #TributeToAndesri #Telangana #cmrevanthreddy #JayaJayaheTelangana

Prabhakar Jaini ….. ఒక కవికి ఇంతకన్నా ఏం కావాలి? గండ పెండేరాలు తొడిగేవాళ్లు కాదు, అశ్రునయనాలతో అంతిమ యాత్రలో పాడె మోసేవాడిని చూడు…
నేనైతే, ఒక కవి పాడెను మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వాల అధినేతలు రాజాంతఃపురాలలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ, ఇలా ఒక కవి అంతిమయాత్రలో పాల్గొన్న వారు లేరు.
ఈ విషయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ను పక్కన పడేసి, మట్టిలో కలిసి మాయమైపోతున్న అందెశ్రీ పార్థివ శరీరం పక్కన నిలవడం, చివరిసారిగా, దింపుడు కళ్ళెం దగ్గర చెవిలో పిలవడం, నోట్లో పాలు పోయడం, అతనికి అందెశ్రీ పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకు తార్కాణం.
రాజకీయాలు, ద్వేషాలు వదిలి, సజల నయనాలతో ఈ దృశ్యాన్ని వీక్షించండి.
జోహార్ ప్రకృతికవి అందెశ్రీ!
Gurram Seetaramulu …. కొండగట్టు అంజన్న గుడి దగ్గర 61 మంది పోతే థూ నా బొడ్డు అన్న గొప్ప ఔదార్యం మన దొర గారిది
Rtc కార్మికులు చస్తుంటే అది ఒడిసిన ముచ్చట
గూడ అంజన్న చావు బ్రతుకులో ఉంటే పట్టించుకోని రియల్ స్టేట్స్‌మాన్
ఐదు సార్లు కంటోన్మెంట్ MLA గా పనిచేసిన సాయన్నకు అధికార లాంఛనాలు ఇవ్వని మనిషి
ఆంధ్రా హరికృష్ణకు బుర్రిపాలెం కృష్ణకు అధికార లాంఛనాలతో జరిపిన ఉదార స్వభావం
ఆంధ్రా మాగంటి గోపినాథ్ పోతే వెక్కి వెక్కి ఏడ్చిన సారు, అలగా అందెశ్రీ పోతే అడుగు బయట పెట్టని మహా నటుడు మా సారు….
Share this Article