Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే ఆదివిష్ణు.., పైగా జంధ్యాల… ఇంకేం.? నవ్వులే నవ్వులు..!

November 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… సుత్తి వీరభద్రరావుగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కలకాలం స్థానాన్ని సంపాదించుకున్న మామిడిపల్లి వీరభద్రరావు నటించిన ఆఖరి సినిమా 1988 లో వచ్చిన ఈ చూపులు కలిసిన శుభవేళ .

1947 లో జన్మించిన వీరభద్రరావు 1981 లో జాతర సినిమా ద్వారా తెరంగ్రేటం చేసినా 1982 లో జంధ్యాల గారి నాలుగు స్థంభాలాట ద్వారానే సుత్తి వీరభద్రరావుగా జగత్పరిచితులు అయ్యారు .

Ads

1988 లో స్వర్గస్థులయిన ఆయన ఈ ఏడేళ్ళలో సుమారు 200 పైచిలుకు సినిమాల్లో నటించారు . విజయవాడ SRR & CVR కాలేజీలో జంధ్యాల క్లాస్ మేటుగా కలిసి నాటకాలు ఆడి , తర్వాత సినిమా రంగంలో గొప్ప హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయనకే ఈ సినిమాను అంకితం చేసారు . డబ్బింగ్ జంధ్యాలే చెప్పవలసి వచ్చింది .

sutti

మాయాబజార్ వందేళ్ళ సినిమాయో వెయ్యేళ్ళ సినిమాయో కాలం నిర్ణయిస్తుంది . ఆ సినిమాలో పాటలు మరో నాలుగు సినిమాలకు టైటిల్స్ కావడం గొప్ప విషయం . అహ నా పెళ్ళంట , ఈ చూపులు కలిసిన శుభవేళ , వివాహ భోజనంబు , లాహిరి లాహిరి లాహిరిలో . ఈ సినిమా టైటిల్స్ కూడా చూపులు కలిసిన శుభవేళ పాటతో రన్ అవుతాయి .

ఈ సినిమా కధను ఆదివిష్ణు నేస్తే జంధ్యాల వారు స్క్రీన్ ప్లేని , మాటల్ని , దర్శకత్వాన్ని అందించారు . ఇద్దరు హాస్యేశ్వరులు కలిస్తే కావలసినంత వినోదం , అల్లరి గోల . వీళ్ళ సినిమాల్లో పాత్రలు చిత్రవిచిత్రంగా మలచబడతాయి . ఈ సినిమానే తీసుకోండి .

నూతన్ ప్రసాద్ చిత్రవిచిత్ర వేషాలు వేస్తుంటాడు . కోట శ్రీనివాసరావు నిఖార్సయిన గ్రాంధిక తెలుగు మాట్లాడుతుంటాడు . సుత్తి వీరభద్రరావు తనతో పనుండి ఎవరయినా వస్తే వాళ్ళను ముప్పై , నలభై కి.మీ.లు నడిపించి వాళ్ళను అక్కడే వదిలేసి తాను మాత్రం కార్లో బుర్రుమని వెనక్కు వచ్చేస్తుంటాడు .

బ్రహ్మానందానికి , శ్రీలక్ష్మికి తిండి యావ . జనం చస్తున్నా , ఏడుస్తున్నా తిండి గోలే . ఇలాంటి చిత్రవిచిత్ర పాత్రలతో రెండు ప్రేమ జంటల ప్రేమ , పెళ్లి గోల ఈ చూపులు కలిసిన శుభవేళ . నరేష్ , కొత్త నటి సుధ ఒక జంట ; మోహన్ , అశ్విని మరో జంట . నవ్వుల విన్యాసాలతో సినిమా శుభాంతం అవుతుంది . ఈ సుధ మరే ఇతర సినిమాల్లో తళుక్కుమన్నట్లు లేదు .

రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ప్రేమా గర్జించవే , నిన్న మొన్న నీది , నీ చూపే నీలాంబరి నీ రూపే కాదంబరి , సిరిమల్లి శుభలేఖ డ్యూయెట్లు బాగుంటాయి . సుత్తి వీరభద్రరావు , నరేషుల మీద చూపులు కలిసిన శుభవేళ పాట చిత్రీకరణ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది . పాట మధ్యలో నరేష్ ఆడ వేషంలో కూడా దర్శనమిస్తాడు .

naresh

సి నారాయణరెడ్డి , జొన్నవిత్తుల , ముళ్ళపూడి శాస్త్రి , మల్లెమాల పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , మాధవపెద్ది రమేష్ , చిత్రలు గాత్రించారు . ఇతర పాత్రల్లో సుత్తి వేలు , రాధాకుమారి , అశోక్ కుమార్ , చాలామంది ఔత్సాహికులు నటించారు .

It’s a hilarious , romantic comedy . సరదాగా ఉంటుంది . యూట్యూబులో ఉంది . చూడబులే .
నేను పరిచయం చేస్తున్న 1164 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘తాజా నిమ్మ సోడా’ గిరిజ ఓక్..! రాత్రికి రాత్రే సోషల్ మీడియా సంచలనం..!!
  • శ్రావ్యమైన ఈ గొంతు… 3800 పసి గుండెల శృ‌తి సరిచేసింది..!
  • అసలే ఆదివిష్ణు.., పైగా జంధ్యాల… ఇంకేం.? నవ్వులే నవ్వులు..!
  • …. అందుకే రేవంత్ రెడ్డి తన వ్యతిరేకులకూ నచ్చుతాడు కొన్నిసార్లు..!!
  • బిడ్డని వదిలేసి వెళ్లిన తల్లి మీద కోపం వస్తుంది మొదట… కానీ..?
  • రేణుకా షహానీ..! నెలవారీ చెల్లింపుతో సహజీవనం ఆఫర్ ఇచ్చాడు..!!
  • విశ్రాంతీ ఒక కళ – సరైన రిలాక్స్ ఆరోగ్యకరం… లేదంటే ఒళ్లు గుల్ల…
  • దాదాపు మాయం తెలుగు మీడియం..! అంకెలు చెబుతున్న సత్యం..!!
  • అనన్య బిర్లా… వారసత్వం కాదు సొంత వ్యాపారం ప్లస్ సంగీత కెరటం…
  • బ్రెయిన్ స్ట్రోక్స్..! రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతున్నయ్ బహుపరాక్..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions