.
ది గరల్ ఫ్రెండ్ సినిమా చూశాక ఓ యువతి తన చున్నీని తీసిపారేసిందట… దర్శకుడు (చిన్మయి భర్త) రాహుల్ రవీంద్రన్ ఆమెను కౌగిలించుకుని భేష్ అని పొగిడాడట… ఆ వీడియో నిన్న వైరల్…
అంటే… చున్నీని తీసిపడేయడం అనేది స్వేచ్ఛకు ప్రతీకా..? చున్నీ అంటే బంధనమా..? ఇంకా నయం, చున్నీని తగులబెట్టండి అని పిలుపునివ్వలేదు… చున్నీని వదిలేస్తే అది తిరుగుబాటా..? దేనిపైన..? సొంత బాటా..? ఎటువైపు..? ఒక వస్త్రానికి అంత మార్మికార్థం ఉందా..?
Ads
సినిమాలో కూడా పలుసార్లు చున్నీ కొన్ని సీన్లలో కనిపిస్తూనే ఉంటుంది… కాలేజీ చదువుతున్నప్పుడే ప్రియుడితో సంపర్కం, హోటల్‌లో కూడా… అదేమంటే వాళ్లు అడల్ట్స్ అట… అడల్ట్స్ అయితే ఇక అదే పనా..? చివరకు తండ్రి బిడ్డ కోసం తపన పడితే తననూ హీరో తన గంజాయి బ్యాచుతో తన్నడానికి రెడీ అవుతాడట… ఇదేం సినిమార భయ్ అంటూ బోలెడు పోస్టులు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో…
సరే, సినిమా కథను ఎవరెలా స్వీకరిస్తారనేది వాళ్ల పరిణతి, ఆలోచన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది… తన చెప్పదలుచుకున్న స్త్రీ స్వేచ్ఛ (ఇదీ డిబేటబులే) పాయింట్‌ను చెప్పడంలో వైఫల్యం ఉందేమో గానీ రాహుల్ రవీంద్రన్ ఎంచుకున్న కథాంశం ఆలోచించదగిందే…
చిన్న వయస్సులోనే ఆకర్షణను ప్రేమగా భ్రమపడటం, త్వరపడటం, శారీరక సంపర్కానికీ ఆత్రపడటం… పెళ్లాడటం… తల్లీదండ్రుల ప్రేమపూర్వక ఆందోళనల్ని, సందేహాల్ని తోసిపుచ్చడం… చివరకు భాగస్వామి అసలు రూపాలు బయటపడటం, వాడిని సరిగ్గా అంచనా వేయలేక, అన్నీ అర్పించి, చివరకు భంగపడి బజారున పడటం…
సరే, ఇప్పుడు మహిళలు తమ కాళ్ల మీద తాము నిలుచుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులకు భారం కావడం లేదు చాలామంది… కానీ యాసిడ్ దాడులు, నరికివేతలు వంటి హింసాత్మక పరిణామాలెన్నో చదువుతున్నాం, చూస్తున్నాం… వాళ్లెవరికీ ప్రేమ అంటే తెలియకపోవడం… తప్పుటడుగులు… ఉన్మాదులుగా మారుతున్నారు యువకులు.,.

ఇవన్నీ చర్చనీయాంశాలే… కాకపోతే దర్శకుడి మెరిట్ పెద్దగా ఏమీ కనిపించదు సినిమాలో… ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కొంత భాగం శాడిస్టు- బాధితురాలు ఎపిసోడ్సే… చివరలో ఓ పావుగంట మాత్రం రష్మిక బాగా చేసింది… అదే సినిమాకు ప్రాణం…
కథ నచ్చిందా లేదా… ప్రజెంటేషన్ నచ్చిందా లేదా… వీటిని దాటి సమాజానికి ఉపయోగపడే అంశాలపై సినిమాలు వస్తూనే ఉండాలి, సొసైటీలో డిబేట్ జరుగుతూనే ఉండాలి… చివరగా ఓ అంశం చెప్పుకుందాం…
ఈమధ్య సినిమా సెలబ్రటీల తప్పుడు కూతలు వింటూనే ఉన్నాం కదా… బహిరంగ వేదికల మీద కూడా కుసంస్కార వ్యాఖ్యలు… ఈ సినిమా సక్సెస్ మీట్‌లో బన్నీవాసు మాట్లాడుతూ… సినిమాకు తమ పెళ్లాలతోనో, ప్రియురాళ్లతోనో వెళ్లేవాళ్లు తప్పకుండా హెల్మెట్‌తో వెళ్లాలి… అంటూ ఓ పాజ్ ఇచ్చి, తలపై చూపిస్తూ… ఆ హెల్మెట్ కాదు అన్నాడు… (అర్థమైంది కదా)

తరువాత ఏం మాట్లాడాలో తెలియక మొత్తం ప్రసంగం ఆపేశాడు… ఆమధ్య మిత్రమండలి సినిమా ఫంక్షన్‌లో కావచ్చు, నా వెంట్రుక కూడా పీకలేరు అన్నది ఈ మగానుభావుడే… నడమంత్రపు సిరి మెదళ్లకు వైరస్‌గా అంటుకుంటుంది… ఇదేనేమో…!!
Share this Article