.
ఏముంది…? మహా అయితే మరో నాలుగు వారాలు… మధ్యలో ఓ ఫ్యామిలీ వీక్… తరువాత వరుసగా ఒక్కొక్కరిని ఇంటికి పంపించినా చివరకు అయిదుగురు ఫైనలిస్టులు మిగులుతారు… (వీలైతే ఆరుగురు)…
సో, డబుల్ ఎలిమినేషన్ అని మరో ఇద్దరిని తరిమేశారు బిగ్‌బాస్ హౌజు నుంచి… కానీ ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… అదేమిటంటే..?
Ads
ఫైర్ స్టార్మ్స్ గా హౌజులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చింది ఎవరెవరు..?
- రమ్య మోక్ష (“ఆలేఖ్య చిట్టి పచ్చళ్లు” రమ్య).
- శ్రీనివాస్ సాయి (మాజీ బాలనటుడు, నటుడు).
- దువ్వాడ మాధురి (క్లాసికల్ డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్).
- నిఖిల్ నాయర్ (టీవీ సీరియల్ నటుడు).
- ఆయేషా జెనాత్ (తమిళ బిగ్ బాస్ నటి).
- గౌరవ్ గుప్తా (టీవీ సీరియల్ నటుడు).
మొదట రమ్య ఔట్… అసలు ఆమెకు బిగ్‌బాస్ హౌజులో ఆట ఏమిటో తెలియదు, ఫిట్ కాలేకపోయింది… తరువాత దువ్వాడ మాధురి… మొదట్లో అందరి మీదా నోరు పారేసుకుంది, కానీ తరువాత ఆటకు తగినట్టు మారింది… కానీ అప్పటికే లేటైంది… ఔటైంది… సో, బయట వివాదాల్లో పాపులర్ అయినవారు హౌజులో హల్‌చల్ క్రియేట్ చేయగలరు అనే బిగ్‌బాస్ టీమ్ భావన అడ్డంగా బోల్తాకొట్టింది…
కింద పడ్డా నేనే తోపు అనే తత్వం కదా… మావారి బర్త్ డే ఉంది, అందుకే కావాలనే నామినేషన్ చేయించుకుని బయటికి వచ్చాను అన్నది మాధురి… నిజానికి ఆమెకు అనఫిషియల్ వోటింగుల్లోనూ లీస్ట్ వోటింగే… ఈలోపు అనారోగ్య కారణాలతో ఆయేషా కూడా బయటికి వెళ్లి పోవాల్సి వచ్చింది…
తను బిగ్‌బాస్ తమిళంలో పాత కంటెస్టెంటే కాబట్టి ఆమెకు ఈ ఆటతీరు తెలుసు, అలాగే ఉండి ఉంటే కొన్నాళ్లు ఆటలో కొనసాగేది… ఇక సాయి శ్రీనివాస్ మొన్నటి వారం వెళ్లిపోయాడు, లీస్ట్ వోటింగే కారణం… ఈవారం నిఖిల్ (శనివారం), గౌరవ్ (ఆదివారం) డబుల్ ఎలిమినేషన్‌గా వెళ్లిపోయారు… వెరసి ఫైర్ స్టార్మ్స్ అనబడే అగ్ని తుఫాన్లు ఏ మంటలూ రేపకుండా చల్లగా, చప్పగా నిష్క్రమించాయి…
ఇలా ఈసారి బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట చేసిన ప్రయోగం అట్టర్ ఫ్లాప్… ఇదే కాదు, ఈసారి కామనర్స్ పేరిట అగ్నిపరీక్ష అంటూ ఓ పైత్యపు తంతు నిర్వహించి… ఏడుగురిని (ఒకరిని లేటుగా) హౌజులోకి తీసుకొచ్చారు కదా…
- కల్యాణ్ పడాల (Kalyan Padala): మాజీ ఆర్మీ ఉద్యోగి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
- హరిత హరీష్ (Harita Harish): “మాస్క్ మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన యూట్యూబర్.
- డాక్టర్ ప్రియ శెట్టి (Dr. Priya Shetty): డాక్టర్, సోషల్ మీడియా పర్సనాలిటీ.
- మర్యాద మనీష్ (Maryada Manish): వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
- శ్రీజ దమ్ము (Srija Dammu): లైఫ్‌స్టైల్ వ్లాగర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్.
- దివ్య నికిత (Divya Nikita): “వారేవా ఏమి ఫిగరు” పాటతో పాపులర్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
- డెమోన్ పవన్ (Demon pawan)… ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్.
ఇందులో హరిత హరీష్ తెగ విసిగించాడు, తనతోపాటు మర్యాద మనీష్ కూడా త్వరగానే వెళ్లిపోయారు… తరువాత ప్రియ శెట్టి కూడా…! వాళ్లు ఈ ఆటకు అడాప్ట్ కాలేకపోయారు… శ్రీజ దమ్ము కాస్త త్వరగానే ఆటకు అలవాటు పడినా, బయటికి వెళ్లి, మళ్లీ వచ్చి, మళ్లీ వెళ్లిపోయింది… నిలబడలేకపోయింది… నిఖిల్, గౌరవ్, సాయిశ్రీనివాస్‌లకన్నా ఈమెను కొన్నాళ్లు ఉంచాల్సింది…
ఇక మిగిలింది డెమోన్ పవన్, పడాల కల్యాణ్, దివ్య నిఖిత… వీళ్లు ఆటకు సెట్టయ్యారు… దివ్య మీద కొంత వ్యతిరేకత ఉన్నా, వోటింగులో ఎలాగోలా నెట్టుకొస్తోంది… అఫ్‌కోర్స్, రీతూతో లవ్ ట్రాక్ కోసం డెమోన్ కొనసాగించబడుతున్నాడు… పడాల కల్యాణ్ పీఆర్ టీం బాగుంది, మంచి వోటింగు మొన్నటి వారం నుంచీ దంచుతున్నారు…
వెరసి… ఈ తిక్క ప్రయోగాలేవీ లేకుండా ఎంపిక చేసిన సెలబ్రిటీలే నయం… ఆటకు సరిగ్గా ఫిట్టయ్యారు… మిగిలినవాళ్లలో తనూజ ప్రతివారం వోటింగులో టాప్… తరువాత ఇమాన్యుయెల్, సుమన్ శెట్టి… తరువాత రీతూ, పడాల కల్యాణ్, భరణి… వీళ్లలో ఏ ఐదుగురు ఫైనలిస్టులు అవుతారో… ఏమో… Expect the unexpected అంటున్నాడు కదా నాగార్జున… ఎవరైనా రాావచ్చు..!!
Share this Article