.
‘‘టెక్నికల్ గ్లిచ్ వల్ల గ్లింప్స్ రిలీజ్ ఆలస్యమైపోయింది… మా నాన్న చెప్పినట్టు నా వెనుక హనుమంతుడే ఉంటే ఇలా జరిగేదా..?’’
ఇదే కదా రాజమౌళి చెప్పింది… ఈ ఒక్క మాట రాజమౌళి అసలు తత్వాన్ని బట్టబయలు చేసింది… తన అడ్డగోలు వాదనను కూడా..! తన సినిమాల్లో కథలాగే..!
Ads
…. ఈ మాట ఎందుకు అనుకోవడం అంటే, తను పర్‌ఫెక్షనిస్టు అంటుంటారు కదా.., తను అనుకున్నట్టుగానే అన్నీ వర్కవుట్ కావాలనీ, అది సినిమాలో సీన్ గానీ, ప్రమోషన్ వర్క్ గానీ, మార్కెటింగ్ గానీ, వసూళ్లు గానీ జరిగిపోవాలనీ అనుకుంటాడు కదా…
మరి అంతమంది జనం, పెద్ద స్టార్స్, ప్రిస్టేజియస్ ఈవెంట్ కదా… తన ప్లానింగ్ ఏమైపోయినట్టు..? అందుకే ఎవరి పని వాళ్లు చేయాలి… నిజానికి ఫిలిమ్ సిటీ స్టాఫ్ మంచి ప్లానింగు, ఎఫర్ట్ ఉంటాయి… రాజమౌళి ఈ ఈవెంట్ నిర్వహణను సొంతంగా చేసినట్టుగా ఉంది… ప్రొఫెషనల్ ఈవెంట్ ప్లానర్స్, మేనేజర్లకు అప్పగించి ఉండాల్సింది…
అందుకే ఎల్ఈడీ స్క్రీన్ మీద సరైన టైములో కంటెంట్ ప్లే కాలేదు… 13000 అడుగుల ఎల్ఈడీకి వాళ్లు సెట్ చేసిన జనరేటర్లు సరిపడా కరెంటును అందించలేకపోవడమే అసలు కారణమట… నిజానికి ఈవెంట్స్‌లో బేసిక్‌గా ఎల్ఈడీ ఎంత పెద్దగా ఉన్నా సరే, ఎక్కువ హైటులో ఉండకూడదు… ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడి దాకా వెళ్లి రిపేర్ చేయడానికి కుదరదు, కష్టం అవుతుంది…
నిన్నటి సెట్ హైట్ 130 ఫీట్లు అట… అలాగే ప్రపోర్షనేట్‌గా కరెంట్ సప్లై, కంటెంట్ పిక్సెల్, హైట్… అన్నింటికీ ఒక లెక్క ఉంటది.., లేదు, నేను గ్లోబల్ ఈవెంట్ చేస్తున్నాను, ఇక్కడ లోకల్ వాళ్ళకి నా తెలివికి సరిపడా సరుకు లేదనుకుంటే ఇలాగే అవుతుంది…
మొన్న 15 నిముషాలు హాట్ స్టార్ బ్లాంక్ వెళ్ళింది… ఎవరో డ్రోన్‌తో షూట్ చేస్తున్నాడనే సాకుతో టెస్ట్ రన్ చేసుకోకపోవడం పెద్ద బ్లండర్… అసలు అది రీజనే కాదు… ఓవర్ కాన్ఫిడెన్స్… అసలు అక్కడ అనుమతి లేకుండా ఎవరు డ్రోన్ షూట్ చేస్తారు..? ఫిలిమ్ సిటీలో ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటారు స్టాఫ్…
సో, అది సాకు మాత్రమే… పైగా కావాలంటే స్క్రీన్ మీద క్లాత్ కవర్ చేసి కూడా టెస్ట్ రన్ చేసుకోవచ్చు… మహా అయితే ఓ లక్ష రూపాయల ఖర్చు… 5 కోట్ల ఈవెంటులో లక్ష ఎంత..? సరైన ప్లానింగ్ లేకపోవడమే ఇదంతా…
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పిలిపించుకునే రాజమౌళి, ఎక్కడో లెక్క తప్పాడు.., ప్రాబ్లెమ్ ఏంటంటే అన్నీ నేను చూసుకుంటాను అనే ఒక అతి విశ్వాసం… అది అన్నిచోట్లా పనిచేయదు, బహుశా అయన పాయింట్ అఫ్ వ్యూలో అదే కరెక్టేమో కానీ… కనీసం ఎక్స్‌పీరియన్సు ఈవెంట్స్ టీంని అయినా పెట్టుకొని ఉండాల్సింది…
అయినా వాళ్ళు చెప్పినా తను వినేవాడు కాదేమో… తప్పు చేసింది తను… హనుమంతుడికి మీదకి నింద నెట్టేయడం దేనికి..? అసలు హనుమంతుడే వద్దు అనుకుంటే ఆ ఈవెంట్ అలా కూడా సాగి ఉండదు కదా..!!

ఈ పాత ట్వీట్ కూడా వైరల్ అవుతోంది ఇప్పుడు…. అన్నట్టు ఈ వివాదం మీద ఓ మిత్రుడు ఓ ముచ్చట చెప్పాడు… ‘‘నాకు తెలిసిన ఓ మిత్రుడు పక్కా నాస్తికుడు… ప్రముఖ దేవాలయం దగ్గర స్టాల్… అందమైన దేవుళ్ల బొమ్మలు అమ్ముతుంటాడు… రోజూ వాటిని తుడుస్తాడు… దుకాణంలో ఎప్పుడూ అగరబత్తుల పొగ, వాసన పరిమళిస్తూ ఉంటుంది… ఎందుకు..? వాడిది దందా..?’’
Share this Article