.
ఈమధ్య ప్రధాని మోడీ ఓ అంతర్జాతీయ వేదికపై నల్లబియ్యాన్ని (Black Rice) “సూపర్ ఫుడ్”గా, ఔషధ గుణాలు కలిగిన వరి రకంగా ప్రశంసించి…. పౌష్టిక, ఔషధ విలువల బియ్యానికి, వరి వంగడాలకు భారతదేశం ఎన్నో తరాలుగా సమృద్ధినీ, ఆ నాణ్యత, ఆ నైపుణ్యాన్ని ప్రపంచానికి అందిస్తామనీ చెప్పాడు…
గుడ్… దిగుబడిలో గానీ, నాణ్యతలో గానీ, తక్కువ పంటకాలంలో గానీ, ఒకసారి నాట్లేస్తే నాలుగైదుసార్లు కోసుకోవడంలో గానీ… చైనా, ఇతర తూర్పు దేశాలు చాలాముందుకు వెళ్లిపోయాయి… గోల్డెన్ రైస్ దాకా… మనమేమో ఇంకాా మశూరి, జైశ్రీరామ్, హెచ్ఎంటీ వంటి హై జీఈ, హై కార్బో రకాల దగ్గరే ఆగిపోయాం…
Ads
సరే, ఆ చర్చను పక్కన బెడితే… మోడీ చెప్పిన నల్ల బియ్యం మాటేమిటి..? నిజమే, మణిపూర్, మేఘాలయ, అస్సాంలోని కొన్ని ఏరియాల్లో పండేదే అసలైన నల్ల బియ్యం… అది నిజంగా ఔషధమే… అందులో ఆంథోసైనిన్స్ ఉంటాయి… పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, హై ఫైబర్, హై ప్రొటీన్, హై ఐరన్, నో గ్లూటెన్… మధుమేహం, రక్తహీనత, జీర్ణ వ్యవస్థ, యాంటీ కేన్సర్ ఉపయోగాలు ఇవి…
డయాబెటిక్ పేషెంట్లకు సూపర్ ఫుడే… గతంలో ఆయా ఏరియాల రాజకుటుంబాలే తినేవి… ఎక్కువ పంటకాలం, తక్కువ దిగుబడి… అందుకని క్రమేపీ రైతులు దాన్ని వదిలేసి హైబ్రీడ్ వరి వైపు మళ్లారు… దాంతో మరీ వందల ఎకరాలకు నల్ల బియ్యం సాగు కుదించుకుపోయింది… మళ్లీ ఈమధ్య కాస్త పెరిగింది… కారణం, అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు చాక్ హావో రకాన్ని డెవలప్ చేశారు… మణిపూర్ నల్ల బియ్యానికి జీఐ గుర్తింపు కూడా ఉంది…
నల్ల బియ్యానికి ‘బుద్ధ బియ్యం’ అని పేరు ఉంది… ఎందుకంటే, కొన్ని చారిత్రక కథనాల ప్రకారం, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత కపిలవస్తు ప్రజలకు ఈ బియ్యాన్ని బహుమతిగా ఇచ్చాడని చెబుతారు…
‘నమక్ రైస్’ (అంటే ‘కాలా నమక్ రైస్’ లేదా ‘కాలా నమక్’) కూడా అదే బియ్యం రకం పేరు… హిందీలో ‘కాలా’ అంటే నలుపు, ‘నమక్’ అంటే ఉప్పు… ఈ బియ్యం పొట్టు నల్లగా ఉంటుంది… దాని రుచిలో కొద్దిగా ఉప్పు రుచి ఉంటుందని అంటారు, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది….
అయితే, భారతదేశంలో సాధారణంగా నల్ల బియ్యం (Black Rice) అంటే ‘ఫర్బిడెన్ రైస్’ (Forbidden Rice) లేదా ‘చక్రవర్తి బియ్యం’ (Emperor’s Rice)….
పోషక విలువల పోలిక (100 గ్రాముల వండిన బియ్యం)
| పోషకం | నల్లబియ్యం | తెల్లబియ్యం |
| ప్రొటీన్ | ~4.5 గ్రాములు | ~2.6 గ్రాములు |
| ఫైబర్ | ~2.8 గ్రాములు | ~0.4 గ్రాములు |
| యాంటీఆక్సిడెంట్లు | అత్యధికం | అతి తక్కువ |
నిజంగానే సూపర్ ఫుడ్ అని స్థోమత ఉన్నవాళ్లు ఈ బియ్యం కోసం ప్రయత్నిస్తే… ఆన్ లైన్‌లోనే లభ్యం… 200 నుంచి 500 రూపాయలకు కిలో… అంటే తెల్ల సన్నబియ్యంతో పోలిస్తే 4 నుంచి 10 రెట్లు ధర… అదైనా సరైన బియ్యం దొరుకుతుందా అంటే అదీ లేదు…
తెల్ల బియ్యానికి ఫుడ్ కలరింగ్ చేసి అమ్మడం… పాతవి, నాణ్యత లేని తక్కువరకం బియ్యం… ఉదాహరణకు తమిళనాడులో కరుప్పు కవుని రకం తక్కువ ధరకే దొరుకుతుంది… దాన్ని మణిపూర్ సేంద్రీయ నల్ల బియ్యం అని అమ్ముతున్నారు చాలామంది… ఈ రకం కూడా పోషక విలువల్లో బెటరే, కానీ మణిపూర్ నల్ల బియ్యం అంత మేలిరకం కాదు…
ప్రధాన పోలికలు, తేడాలు
| పోషక లక్షణం | మణిపూర్ ‘చాక్-హావో’ | తమిళనాడు ‘కరుప్పు కవుని’ |
| యాంటీఆక్సిడెంట్స్ | చాలా ఎక్కువగా ఉంటాయి. | ‘చాక్-హావో’ కంటే కొద్దిగా తక్కువ |
| ఇనుము (Iron) | అధికంగా ఉంటుంది. | అధికంగా ఉంటుంది. |
| పీచు పదార్థం | అధికంగా ఉంటుంది. | అధికంగా ఉంటుంది. |
| (Texture) | వండాక కాస్త జిగురుగా (Sticky) | పొడిపొడిగా, కొద్ది గట్టిగా (Chewy) |
| వాసన | సువాసన ఉంటుంది | దీనికి (Salinity Tolerance) ఎక్కువ |
‘శ్రీ అన్న’…: ప్రజారోగ్యానికి భరోసా
మోడీ ప్రశంసించిన ‘శ్రీ అన్న’ (జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు) నిజమైన ప్రజా ఆహారంగా నిలుస్తున్నాయి… నల్లబియ్యం కేవలం యాంటీఆక్సిడెంట్లలో అగ్రస్థానంలో ఉంటే, చిరుధాన్యాలు ఈ కింది అంశాలలో మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి….
| చిరుధాన్యం | ప్రత్యేకత | ఆరోగ్య ప్రయోజనం |
| రాగులు | అత్యధిక కాల్షియం, Fiber | ఎముకల బలం, మధుమేహం నియంత్రణ. |
| సజ్జలు | అత్యధిక ఐరన్, ప్రొటీన్ | రక్తహీనత నివారణ, శక్తిని పెంచడం. |
| జొన్నలు | అత్యధిక పీచు, లో-జీఐ | జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, బరువు నియంత్రణ. |
ముఖ్యంగా, చిరుధాన్యాలు తక్కువ నీరు అవసరం, తక్కువ ఖర్చుతో పండుతాయి… వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే సామర్థ్యం కారణంగా, ఇవి భారతీయ వ్యవసాయానికి, ఆహార భద్రతకు అత్యంత ఆచరణాత్మకమైన పరిష్కారంగా నిలుస్తున్నాయి…
ఆల్రెడీ వీటి ప్రాముఖ్యత జనానికి బాగానే తెలిసింది… డయాబెటిస్ కారణంగా వేగంగా చిరు ధాన్యాల వైపు మళ్లుతున్నారు మళ్లీ… అవి…
-
జొన్న (Sorghum/Jowar)
-
సజ్జ (Pearl Millet/Bajra)
-
రాగులు (Finger Millet/Ragi)
-
కొర్రలు (Foxtail Millet)
-
అరికలు (Kodo Millet)
-
సామలు (Little Millet)
-
-
రాగులు గోధుమ రంగులో ఉన్నా…. వీటిలో రంగుకు కారణమయ్యే ఫినోలిక్ సమ్మేళనాలు (Phenolic Compounds), ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆంథోసైనిన్స్ వలెనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి…
-
సజ్జ (Bajra)లో కూడా కొన్ని వంగడాలు ముదురు రంగులో ఉంటాయి… వీటిలో ఆంథోసైనిన్స్ తక్కువ స్థాయిలో ఉండవచ్చు లేదా వాటి స్థానంలో ఇతర యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉండవచ్చు…
-
-
Share this Article