.
అమిత్ షా…. తనకు పర్‌ఫెక్ట్‌గా తెలుసు… మావోయిస్టు కీలక నేతలకు సంబంధించిన సమాచారం ఈజీగా దొరికిపోతోంది… త్వరలో మొత్తం కొట్టేస్తామని ధీమా ప్రకటించింది అందుకే… దానికి కోవర్టులు కావచ్చు, సమాచారం అలవోకగా వస్తున్న సమాచారం మీద నమ్మకం కావచ్చు…
కానీ మొండికేస్తే ఖతం చేయండి, లొంగిపోతే అంగీకరించండి… ఎలాగోలా మావోయిస్టు అనేవాడు మిగలొద్దు అనేది కేంద్రం వైఖరి… ఎస్… మావోయిస్టుల కోటల్లోకి కూడా పోలీసు బలగాలు జొరబడి మరీ కొడుతున్నాయి… సెంట్రల్ కమిటీ నేతల ప్రాణాలకే రక్షణ లేదు, భరోసా లేదు…
Ads
ఈ స్థితిలో… తమ పాత వ్యూహాల తప్పిదాలను అంగీకరించి, ప్రస్తుతానికి జనజీవనంలో కలిసిపోవడమే శరణ్యమనే సోయితో కొందరు సాయుధ పోరాట విరమణ చర్చకు తావిస్తూ… తాము కూడా ఆయుధాలతో లొంగిపోయారు… (సరే, అర్బన్ నక్సల్స్‌కు పోయిందేముంది..? పోయేది వాళ్ల ప్రాణాలు కాదు కదా… దాన్నీ వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా పోరాటాలు చేస్తున్నారు…)
బీజేపీ పాలిత రాష్ట్రాలే అయినా… మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతాలే అయినా… బలగాలను నష్టపోయిన రాష్ట్రాలే అయినా సరే.,.. కక్షతో కాదు, లొంగిపోతాం అన్న మావోయిస్టు కీలక నేతల్నీ సమాజంలోకి ఆహ్వానిస్తున్నాయి…
అంతెందుకు..? మొదటి నుంచీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అఫెన్స్ మానేసి, లొంగుబాట్లకు ఓ సానుకూల వాతావరణం కల్పించింది… పెద్ద నేతలతో సహా దాదాపు 500 మంది లొంగపోయారు… గుడ్ స్ట్రాటజీ, గుడ్ పేషన్స్… తెలంగాణ ఎస్ఐబీ గానీ, ఇంటలిజెన్స్ గానీ చాన్నాళ్లుగా మంచి వర్క్ చేస్తున్నాయి… ఒకరకంగా ఈ వర్క్ ఏపీపోలీస్ క్రెడిట్‌కు ఉపయోగపడుతున్నట్టుంది…
కానీ ఏపీఎస్ఐబీ మీద వస్తున్న విమర్శ ఏమిటి..? చత్తీస్‌గఢ్, తెలంగాణ ఏపీకి వస్తున్నారు, ఖతం చేస్తాం అన్నట్టుగా ఉంది… లొంగుబాట్లకు, అరెస్టులకు అవకాశం ఇవ్వొచ్చు కదా… ఆఫ్టరాల్, మావోయిస్టులు కాల్పుల విరమణలో ఉన్నారు… యుద్ధవిరమణలో ఉన్నారు… పతనావస్థలో ఉన్నారు…
- బస్తర్‌లోని ఒక జర్నలిస్టుకు హిడ్మా లేఖ.. తన ఆలోచనలు, నిర్ణయాలపై నవంబర్ 10న జర్నలిస్టుకు లేఖ రాసిన హిడ్మా.. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్న హిడ్మా.. ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం… ఇదీ ఓ వార్త…
అనాదిగా భారతీయ యుద్ధతంత్రంలో ఉన్నది ఏమిటి..? బలహీనపడిన శత్రువును చంపడం కాదు, క్షమించడం, లొంగిపోవడానికి తావివ్వడం..! తమతో కలిపేసుకోవడం..!
వినవస్తున్న సమాచారం ప్రకారం… హిడ్మా లొంగుబాటుకు రెడీ అయ్యాడుట… ఇక సాయుధపోరాటం కథ ఒడిశిపోయినట్టే అనుకున్నాడు… ఏపీ పోలీసులతో టాక్స్ కూడా ఏాదో ఓ రూటులో స్టార్టయ్యాయట కూడా.., (ఈ విషయాల్లో నిజాలు ఎప్పుడూ బయటికి రావు…) మరెందుకు పొట్టన బెట్టుకున్నట్టు..? అలాగే టెక్ శంకర్ కూడా..!
తిరుపతి అలియాస్ దేవ్‌జీ … అంటే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి, ఆజాద్ కూడా ఎన్‌కౌంటర్ అయ్యారనీ, అరెస్టయ్యారనీ రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ, అవేవీ ధ్రువీకరణ కాలేదు… సరే, ఇప్పుడు ఎవరి ప్రాణాలకూ ఇప్పుడు ఏ భరోసా లేదు గానీ… లొంగుబాట్లకు కాస్త సరైన సేఫ్ రూట్ చూసుకొండి కామ్రేడ్స్..!!
Share this Article