Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అండ పిండ బ్రహ్మాండ జ్ఞానబోధ…! ఉపాసనపై భారీ ట్రోలింగ్ ఎందుకంటే…!!

November 20, 2025 by M S R

.

మెగా చిరం@^జీవి కోడలు, జూనియర్ మెగా రాంచరణ్ భార్య…. అన్నింటికీ మించి అపోలో ప్రతాపుడి అపారమైన ఆస్తిపాస్తులకు వారసురాలు… ఉపాసన..! ఉదారంగా ఓ సలహా పడేసింది మహిళలకు… అదీ ఐఐటీ పిల్లలకు ఏదో బోధిస్తూ..! చాలామంది ట్రోల్ చేస్తున్నట్టు ఆమె అజ్ఞాని కాదు.,. మహాజ్ఞాని… తమ అపోలో చేపట్టిన ఓ కార్యక్రమానికి చాలా తెలివైన ప్రచారం ఇది… దానికోసం అనుచిత జ్ఞానబోధ చేస్తోంది…

ఏమనీ..?  ముందు కెరీర్… స్వయంసమృద్ధి… తరువాతే పెళ్లీపిల్లలు… బాధపడకండి, మీ అండాల్ని లేదా పెళ్లయితే మీ పిండాల్ని ఫ్రీజ్ చేయించేయండి… ఇది సంతాన ప్రాప్తతకు బీమా… ధీమా… ఎప్పుడంటే అప్పుడు పిల్లల్ని కనొచ్చు… అర్థమవుతోందా అని అనుగ్రహ భాషణం చేసింది అమ్మవారు…

Ads

అసలే యువత డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్ (DINK) బాటలోకి మళ్లుతుంటే… దేశవ్యాప్తంగా ఫర్టిలిటీ రేటు మంటగలిసి పోతుంటే… ఇంకా ఈ మహాతల్లి అందులో పెట్రోల్ పోస్తోంది… మీకు తెలుసా..? ఇదుగో ఈమె చెప్పినట్టే 30 దాటేదాకా పెళ్లి కాని మహిళలు తరువాత పిల్లలు పుట్టక, గర్భం నిలబడక ఎన్ని అవస్థలు పడుతున్నారో…

ఇదే సంతాన సాఫల్య దందాకు ఆధారం… ఏటా వేల కోట్ల దందా ఇది… ఐవీఎప్ దగ్గర నుంచి సరోగసీ దాకా… అతి పెద్ద వ్యాపారం ఇది… అపోలో వాళ్లు ఏం చేశారంటే…? ఇది చూడండి…

APOLLO

అపోలో ఫర్టిలిటీ అని ప్రత్యేక విభాగం… వీర్యం, అండం, పిండం ఏదైనా ఫ్రీజ్ చేస్తారు… సో, ఈ వ్యాపారం మూడు అండాలు ఆరు పిండాలుగా అభివృద్ధి చెందాలంటే… పిల్లలు త్వరగా పిల్లల్ని కనొద్దు… ముందు మీ సంతాన సౌభాగ్యాన్ని ఫ్రీజ్ చేయండి, వాటికి మేం కాపలా కాస్తాం, డబ్బు తీసుకుంటాం, వాటితో మళ్లీ సంతానం కావాలన్నా మేమే అదీ చేసిపెడతాం…

ఉపాసన ప్రచారం వెనుక ఇదేనేమో మర్మం… అందుకేనేమో విపరీతంగా ట్రోల్ సాగుతోంది ఆమె మీద… గైనకాలజిస్టులు, ఐవీఎఫ్ నిపుణులు, సంతాన సాఫల్య సహాయకులు కూడా ఆమె మాటల్ని చీల్చి చెండాడుతున్నారు…

upasana

  • నిజం ఏమిటంటే..? మహిళల ఫర్టిలిటీ 20- 25 నడుమ పీక్స్… 30 దాటాక ఇక కష్టాలు… 35 తరువాత మరీనూ… అండాల నిల్వ అనేది ధీమా కాదు, బీమా అసలే కాదు… అది గ్యారంటీయే కాదు… అత్యంత వ్యయం, ఓ జూదం… అంతే… సక్సెస్ రేటూ తక్కువే కాబట్టి…

 

మరొకటి… ఎగ్ నాణ్యత (Egg Quality)… వయస్సు పెరిగే కొద్దీ అండాల నాణ్యత (Quality), సంఖ్య (Quantity) తగ్గిపోతాయి… దీనివల్ల గర్భం ధరించడం కష్టమవడమే కాకుండా, గర్భస్రావం అయ్యే ప్రమాదం, శిశువులలో క్రోమోజోముల సమస్యలు (ఉదాహరణకు, డౌన్ సిండ్రోమ్) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది…

ఖర్చు మాటేమిటి…: ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆమె దీనిని “అతిపెద్ద బీమా” అని చెప్పినా, సాధారణ మధ్యతరగతి లేదా నిరుద్యోగి మహిళ దీనిని సులభంగా భరించడం కష్టం…

విజయ శాతం…: ఎగ్ ఫ్రీజింగ్ అనేది 100% విజయానికి హామీ ఇవ్వదు… వయస్సు పెరిగే కొద్దీ, ఫ్రీజ్ చేసిన అండాలను ఉపయోగించి గర్భం ధరించే విజయావకాశాలు కూడా తగ్గుతాయి…

  • ప్రకృతి నియమం…: మీరు చెప్పినట్లు, గర్భధారణకు అనువైన వయస్సు పరిమితిలో ప్రకృతి ఎవరికీ మినహాయింపు ఇవ్వదు… కెరీర్ లక్ష్యాలు ముఖ్యమే అయినా, జీవసంబంధమైన గడియారం (Biological Clock) పనిచేస్తూనే ఉంటుంది… Biology doesn’t care about your career timeline..

ఇంకొందరు ఆమె వ్యక్తిగతంలోకి వెళ్లి మరీ విమర్శలు చేస్తున్నారు… ‘నువ్వేమో 23 ఏళ్ల వయస్సున్నప్పుడు 27 ఏళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు… ఇప్పుడు లేటు సంతానం అని బోధిస్తున్నావు’… కానీ ఆమె లేటుగానే పిల్లల్ని కంటున్నది…!

upasana

ఒక ART Specialist దృక్కోణం… 

“అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) ద్వారా గర్భం దాల్చిన వందలాది మంది రోగులకు (వీటిలో IVF/ICSI కూడా భాగమే) చికిత్స అందించిన వ్యక్తిగా నేను ఇది చెబుతున్నాను… బ్యాంక్‌లో కోట్లు ఉన్నప్పుడు ‘ఎగ్ ఫ్రీజింగ్’ గురించి సలహా ఇవ్వడం చాలా సులభం…

  • IVF ఖర్చులు…: IVF చికిత్సకు ఒక్కో సైకిల్‌కు లక్షల్లో ఖర్చవుతుంది. ఎగ్ ఫ్రీజింగ్‌కు ముందుగా లక్షల్లో చెల్లించాలి, దానికి అదనంగా ఏటా నిల్వ ఛార్జీలు ఉంటాయి….

  • సామాన్యులకు అందుబాటు కష్టం…: మీకు (సలహా ఇచ్చిన వ్యక్తికి) వినిపించే చాలా మంది యువతులు ఒక్క ప్రయత్నాన్ని కూడా భరించలేరు….

  • వైఫల్యాలు, భావోద్వేగ బాధ…: నేను సంతాన సాఫల్య చికిత్స నిపుణుడిని… నాకు తెలుసు పెయిన్ ఏమిటో… ప్రయోగ వైఫల్యాల కారణంగా విఫలమైన సైకిల్స్, నిరాశలు, పెరిగిపోతున్న బిల్లులు, జీవితాంతం వెంటాడే మానసిక ఆందోళన (PTSD)తో ఏడ్చే జంటలను కూడా నేను చూస్తున్నాను…’’

సో… తప్పకుండా మీ కెరీర్‌ను నిర్మించుకోండి… కానీ యువతులకు టెక్నాలజీ ఒక ‘సేఫ్టీ నెట్’ అనే ఓ అబద్ధాన్ని అమ్మకండి… చాలా మందికి ఇది వారి పొదుపు, వారి మానసిక ఆరోగ్యం, తరచుగా వారు పేరెంట్‌హుడ్  కలలను కోల్పోయాక… చివరకు ఆశ్రయించే చివరి ప్రయత్నం మాత్రమే…! సంతాన ఉపాసకులు ఏదేదో చెబుతారు..!!

  • ఇంతకీ ఈ ట్రోలింగుపై ఈ ఉపాసిని ఏమని రియాక్టయిందో తెలుసా..? ‘‘ఇదంతా ప్రజల్లో ఆరోగ్యకరమైన చర్చకు దారితీసినందుకు సంతోషంగా ఉంది…’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుదీర్ఘ నక్సలైట్ల ప్రస్థానానికి తెలంగాణ పోలీసుల ఫినిషింగ్ పంచ్..!!
  • నాస్తిక రాజమౌళి వారణాసి సినిమాలో… ఓ తాంత్రిక దేవత..!!
  • అండ పిండ బ్రహ్మాండ జ్ఞానబోధ…! ఉపాసనపై భారీ ట్రోలింగ్ ఎందుకంటే…!!
  • తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లు పునర్జన్మల్లోనూ అలాగే పుడతారు..!!
  • నా పేరు ఇందిర… లోపలకు రావచ్చా… తినడానికి ఏమైనా ఉందా..?
  • చెల్లి పెళ్లికూతురు… అక్క ఈ ఇంట్లో బందీ… రక్తికట్టిన ఓ ఎపిసోడ్…
  • సేఫ్ ప్యాసేజ్ చూసుకుని మరీ లొంగిపొండి కామ్రేడ్స్… ఖతమై పోవద్దు..!!
  • హిడ్మా కాదు… ‘టెక్ శంకర్’ మృతితో CPRF క్యాంపుల్లో బాణాసంచా..!!
  • పిట్టల్ని కొట్టడం కాదు… సినిమా నేర్చుకోవల్సిన పాఠం ఏమనగా…
  • కన్నబిడ్డలనైనా నమ్మకూడదు… రోజులస్సలు బాగాలేవు… అదే ఇది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions