Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెలగపండు అందుబాటులోకి..! పర్‌ఫెక్ట్ సూక్ష్మ పోషకాల పండు…!!

November 20, 2025 by M S R

.

&#నాడు అనే ఒకానొక దినపత్రికలో… ఓ వార్త కనిపించింది… అదీ సిటీ పేజీలో కనీకనిపించనట్టు ఓ ఫోటో వార్త… సీతాఫల్‌మండి దగ్గర వెలగపండ్లు అమ్ముతున్నారుట… అత్యంత పూర్ రైటప్… సదరు పత్రిక బాధ్యులు గర్వంగా కాలర్ ఎగరేస్తారేమో ఫాఫం…

సింపుల్… వెలగపండు, పోషకాల పండు అని ఏదో పిచ్చి హెడింగ్ పెట్టి, ఓ సాదాసీదా అత్యంత నాసిరకం రైప్ పెట్టి వదిలారు… నిజానికి మంచి ఫోటో వార్త… ఎందుకంటే..?

Ads

హైదరాబాద్ నుంచి అన్ని వైపులా వెళ్లే ప్రధాన రహదారుల పక్కన చాలా సరుకులు అమ్ముతుంటారు… సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, ఎర్రటి పెద్ద పొడుగు మిర్చి, వేరుశెనక్కాయ, ఉసిరి, మక్క బుట్టలు, సీతాఫలాలు వంటి పళ్లతోపాటు… చెరుకురసం, టిఫిన్లు వాట్ నాట్..?

అలాగే ఇప్పుడు వెలగపండ్లు అమ్ముతున్నారు… వార్త రాయాలంటే దాని పోషక విలువలేమిటో రాయాలి.,, అంతేతప్ప ఓ ఫోటో పాఠకుల మొహాన కొట్టి, పోషకాల పండు అని రాసేస్తే సరిపోదు, నవ్వుకుంటారు…

వెలగ పండు

పోనీ, మనం చెప్పుకుందామా..? bael fruit, wood apple, elephant apple, bengal quince గా పిలవబడే వెలగపండు చాలా పాపులర్… ఏనుగు వెలగపండు మింగితే… గుజ్జు మొత్తం జీర్ణం చేసుకుని, డొల్ల పండును బయటికి విసర్జిస్తుంది… కరి మింగిన వెలగపండు అనే జనవాక్యం అదే…

ఏమిటీ ఆ పండులో గొప్ప..?

Energy 137–140 kcal
Carbohydrates          31–35 g
Protein 1.8–2.6 g
Fat 0.3–0.6 g
Fiber 2.6–4.6 g
Calcium 85 mg
Phosphorus 115 mg
Potassium 600 mg
Iron 1.1–1.8 mg
Vitamin C 8–10 mg
Vitamin A 55–60 mcg

పండిన తీరును బట్టి… కాస్త అటూఇటూ విలువలు మారొచ్చు స్వల్పంగా… కానీ పోషకాలపరంగా వెలగపండు ఎంత రిచో పైన టేబుల్ చెబుతుంది… వాటికితోడు బీ1, బీ2 కూడా పుష్కలంగా..! బీపీ, సుగర్, ఒబెసిటీ, తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవాళ్లకు… ప్రత్యేకించి రక్తహీనత ఉన్నవాళ్లకు కూడా ఈ పండు బెటర్  ఫుడ్డు…

మరీ తెలుగు పత్రికల వింత వంటకాల తరహాలో… దీని గుజ్జును ఎలా ఐస్‌క్రీమ్ చేసుకోవచ్చు, వెరయిటీ కేకులు, స్వీట్లు ఎలా చేసుకోవచ్చు అనే ఉపదేశాల జోలికి వెళ్లడం లేదు గానీ… కాయలు కావు, పండ్ల నుంచి తీసిన గుజ్జును అలాగే తినేయొచ్చు హాయిగా… లేదా బెల్లం పొడి వేసుకుని రా ఫ్లెష్, అంటే ముడి గుజ్జు అలాగే తినేయడమే…

చాలాచోట్ల షర్బత్ చేసుకుని తాగుతారు… పాలతో, కాస్త చక్కెర లేదా బెల్లం, దాల్చిన చెక్క వేసుకుని జ్యూస్ చేసుకునేదే వెలగ షర్బత్… ఎవరెవరి టేస్టు వాళ్లిష్టం..!! దాని పోషక విలువలతో పోలిస్తే రేటు కూడా తక్కువే అనిపిస్తుంది… కాకపోతే కాస్త బేరం ఆడాలి… కొందరైతే ఆ పండులోని గుజ్జును అలాగే గీకి గీకి తింటారు… టేస్టుతోపాటు దాని న్యూట్రిషనల్ వాల్యూ అది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పారడాక్స్..! చమురు మార్కెట్‌లో అమెరికాకు ఇండియా ‘లెసన్’…!!
  • బన్నీ క్రేజ్ మామూలుగా లేదు… పుష్ప-2కు ఏడోసారీ రికార్డు వీక్షణలు…
  • వెలగపండు అందుబాటులోకి..! పర్‌ఫెక్ట్ సూక్ష్మ పోషకాల పండు…!!
  • ఎట్టకేలకు రాష్ట్రపతి సర్వాధికారాల్ని సుప్రీంకోర్టు గుర్తించి వెనక్కి తగ్గింది..!!
  • కేటీయార్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్…! ఏం జరుగుతోంది..?!
  • కృత్రిమం కృత్రిమమే… ఏఐతో జర జాగ్రత్త… గుడ్డిగా నమ్మొద్దు…!!
  • ‘‘రాజమౌళిని మించి తెలుగు హీరోకు ఎలివేషన్ ఇవ్వాలి ఎప్పటికైనా…’’
  • సుదీర్ఘ నక్సలైట్ల ప్రస్థానానికి తెలంగాణ పోలీసుల ఫినిషింగ్ పంచ్..!!
  • నాస్తిక రాజమౌళి వారణాసి సినిమాలో… ఓ తాంత్రిక దేవత..!!
  • అండ పిండ బ్రహ్మాండ జ్ఞానబోధ…! ఉపాసనపై భారీ ట్రోలింగ్ ఎందుకంటే…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions