.
థియేటర్లలో రికార్డు స్థాయిలో వసూళ్లు… ఓటీటీలకు అదే స్థాయిలో అమ్మకాలు… శాటిలైట్ టీవీ ప్రసారాలకూ అదే స్థాయిలో జియో స్టార్ నుంచి వసూలు చేసినట్టున్నారు… కానీ వర్కవుట్ అయ్యింది… పుష్ప-2 సినిమా టీవీ ప్రసారాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి…
నిజంగా పెద్ద పెద్ద తోపు సూపర్ స్టార్ల సినిమాలో టీవీ ప్రసారాల్లో మంచి టీఆర్పీలు సాధించలేక చతికిలపడుతున్నయ్… అలాంటిది పుష్ప-2 ఏడోసారి ప్రసారం చేస్తే 6.78 టీఆర్పీలు సాధించింది… కొత్త సినిమాల వరల్డ్ ప్రీమియర్ ప్రసారాల టీఆర్పీలు కూడా ఇందులో సగం సాధిస్తే గొప్ప…
Ads
అలాంటిది ఏడోసారి టీవీలో వేసినా అదే స్థాయిలో జనం ఎంజాయ్ చేస్తున్నారంటే విశేషమే… అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప, పుష్ప-2 ఓ మైలురాయి… తనను ఎక్కడికో తీసుకుపోయింది… అఫ్‌కోర్స్, తనపై సంధ్య థియేటర్ తొక్కిసలాట, అరెస్టు, జైలు అనే మరక కూడా ఉంది, అది వేరే సంగతి… (రేసు గుర్రం ఎన్నిసార్లు వేశారో లెక్కలేదు గానీ ఈసారి మళ్లీ వేస్తే 3.65 రేటింగ్ వచ్చింది… బన్నీకి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ అది…)

ఇతర టీవీ షోలకు వస్తే… బిగ్‌బాస్ మొదట్లో బాగా నిరాశపరిచి… దారుణంగా టీఆర్పీలు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా… ఈసారి కూడా సీజన్ ఎత్తిపోయినట్టే, ఆ అగ్నిపరీక్ష పైత్యం, బేకార్ కామనర్స్ ఎంపిక, బాగా నిరాశపరిచిన ఫైర్ స్టార్మ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలే కారణమనే విశ్లేషణలు వచ్చాయి కదా…
ఎనిమిదిన (శనివారం) ప్రసారమైన నాగార్జున వీకెండ్ షో ఏకంగా 7.76 రేటింగ్స్ సాధించడం విశేషమే… అంటే బిగ్‌బాస్ వీక్షణలు పెరుగుతున్నట్టే… తొమ్మిదిన (సండే) వీకెండ్ షో 6.99 రేటింగ్స్ సాధించి, ఇదీ పర్లేదు అనిపించుకుంది… వీక్ డేస్‌లో కూడా 4.50 నుంచి 5 మధ్యలో రేటింగ్స్ వచ్చాయి… శివాజీ ఇంటర్వ్యూ ఎవరికీ నచ్చడం లేదేమో… ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను గ్రిల్ చేసే షోను ఎవరూ పట్టించుకోవడం లేదు…
టీవీ సీరియల్స్ అంటారా..? ఎప్పటిలాగే స్టార్ మా ఫస్ట్… కార్తీకదీపం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడిగంటలు, చిన్ని, నిండు మనసులు టాప్ 6 ప్లేసుల్లో… జీ తెలుగు సీరియల్స్‌లో మేఘ సందేశం, లక్ష్మి నివాసం, జగధాత్రి, చామంతి, జయం, పడమటి సంధ్యారాగం టాప్ 6 ప్లేసులో ఉన్నాయి… ఇక ఈటీవీ, జెమిని సీరియళ్ల గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండదని తెలుసు కదా…
Share this Article