.
Rochish Mon …. ——– రాజన్- నాగేంద్ర పాట ————
“మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం…”
(మలయాళంలో “మానస వీణా మధుగీతం మన సంస్కారం సంగీతం…”)
Ads
1978లో వచ్చిన పంతులమ్మ సినిమాలోని పాట “మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం…”. ఈ సినిమా 1982లో మలయాళంలో లేడి టీచర్ పేరుతో డబ్ అయింది. ఈ పాట మలయాళంలో “మానస వీణా మధుగీతం మన సంస్కారం సంగీతం…”
- రాజన్-నాగేంద్ర కన్నడం సినిమా సంగీత దర్శక ముమ్మూర్తుల్లో ఒకటి రాజన్-నాగేంద్ర ద్వయం. తెలుగులోనూ ఎన్నో గొప్ప పాటలు చేశారు రాజన్-నాగేంద్ర. ఒక్క ఎస్. రాజేశ్వరరావు మినహాయింపు కాగా 90వ దశాబ్ది వరకూ తెలుగు సినిమా సంగీత దర్శకులకు లేని sounding sense, orchestration values రాజన్-నాగేంద్రలో ఉండేవి.
ఇళైయరాజా కన్నా ముందే దక్షిణాది సినిమా పాటలో bass guitar ప్రయోగం ఆవశ్యకతను, అందాన్ని అమలు చేశారు రాజన్-నాగేంద్ర. తెలుగు సినిమాలో వచ్చిన గొప్ప పాటల్లో ఒకటి ఈ “మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం…”. చాల గొప్పగా చేశారు పాటను రాజన్-నాగేంద్ర.
గొప్ప బాణి, గొప్ప వాద్య సంగీతం, గొప్ప సంగీతజ్ఞత, గొప్ప సృజనాత్మకత, గొప్ప ప్రౌఢత్వం వీటన్నిటి సమాహారం ఈ పాట. మంచి ఆలాపన మొదలుగా మంచి prelude, rhythm, మంచి interludesతో మూస బాణికి అతీతంగా ప్రత్యేకమైన బాణితో పాట ఒక గొప్ప నిర్మాణం.
‘పెండ్యాల- ఘంటసాల సంగీతానికి అతీతంగా తెలుగు సినిమాలో ఎంతో గొప్ప సంగీతం వచ్చింది’ అన్న వాస్తవాన్ని ఈ పాట మనకు సర్వదా, సర్వథా వినిపిస్తూంటుంది.
వేటూరి సాహిత్యం చాల గొప్పగా ఉంటుంది ఈ పాటలో. అంత కణ్ణదాసన్ కూడా ఈ స్థాయి సాహిత్యం రాయలేదేమో? మలయాళంలో డబ్బింగ్ పాట కనుక సాహిత్యం పరంగా వేటూరిని అధిగమించ లేదు.
- ఈ పాట పాడడానికి 20టేకులు పైగా పట్టిందని పాట సంగీత దర్శకుడు రాజన్, గాయకుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ పాడుతా తీయగా కార్యక్రమంలో తెలియజేశారు. మలయాళంలో పాడాల్సిన ఏసుదాస్ ఈ పాటను విని ఒక రోజు ఇంట్లో సాధన చేసి వచ్చి పాడారు అని రాజన్ తెలియజేశారు.
తెలుగు, మలయాళం భాషల్లో సుశీల పాడారు. చాల గొప్పగా పాడారు సుశీల. మలయాళంలో పాడిన ఏసుదాస్ కన్నా ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్రం చాల గొప్పగా పాడారు. గాత్ర సౌఖ్యం, గాత్ర- రుచి (voice flavuor), expression, mood, modulation, emotion, spirit పరంగా ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం విశేషంగా పాడారు.
ఘంటసాల గాన పరిధికి అతీతమైన గానం ఈ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గానం. ఘంటసాల గాన ఎల్లలను అధిగమించిన తెలుగు సినిమా గాన పురోగమనంలో ఈ పాట గానం ఒక మైలురాయి; సినిమా గాన పరిణామంలో ఈ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గానం కలికితురాయి. ఘంటసాలకు అందని గాన వైఖరి, సౌందర్యం ఈ పాటలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సమర్పించారు.
వినండి… రోచిష్మాన్ 9444012279
మానస వీణా మధు గీతం
https://youtu.be/iUgaKMV7LZA?si=KFSaBOKDbcvTg_hm
మలయాళం పాట
https://youtu.be/85A0vJuDdLM?si=Fupt5GYL_yK_g1Va
Share this Article