.
వచ్చే నెల రైజింగ్ తెలంగాణ అని ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో ధూంధాంగా ఓ కార్యక్రమం ప్లాన్ చేశారు కదా… అసలు ఏమిటి దాని ఉద్దేశం..? ఏం చేయాలని..? ఏం చేస్తారు..? కాస్త వివరంగా చెప్పుకుందాం…
అక్కడక్కడా మరీ నీతిఆయోగ్ ప్రజెంటేషన్ బాపతు వార్తలు కనిపిస్తున్నాయి… ముఖ్య నేతల ప్రసంగాల్లోనూ క్లారిటీ రావడం లేదు… నాకు తెలిసిన సమాచారం మేరకు… సరళమైన శైలిలో ఓ క్లారిటీ ఏమిటంటే..?
Ads
- ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో యాక్టివిటీ పెంచాలి… పెట్టుబడులను ఆకర్షించాలి… అక్కడ ఓ విశ్వనగరం నిర్మింపబడాలి… అదే ఫ్యూచర్ సిటీ … హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇక ఫ్యూచర్ సిటీ… (ఫ్యూచరాబాద్…) ఇదొక స్వప్నం… అసాధ్యం మాత్రం కాదు…
మరి పెట్టుబడులు రావాలంటే..? అనుకూల పరిస్థితులు చూపించాలి… భూములు ఇవ్వాలి… రాయితీలు ఇవ్వాలి… అదే చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి… ముందుగా 8, 9 తేదీల్లో ఐటీ కంపెనీలు, ఇతర పెద్ద కంపెనీల ప్రతినిధులు, బ్యాంకర్లు, ఫైనాన్షియల్ ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నారు… బహుశా 2000 వరకూ… అప్ కంట్రీ, లోకల్ మీడియా ఎట్సెట్రా కలిపి ఓ 3 వేల వరకూ గ్యాదరింగ్…
అది ఎందుకు పెట్టుబడులకు అనుకూలమో ఓ ప్రజెంటేషన్ ఉంటుంది… ఎయిర్‌పోర్టుకు దగ్గర, ఓఆర్ఆర్, మంచి నీటి వసతి, రోడ్లు, కనెక్టివిటీ, కాలుష్యరహితం… ఇలాంటివి… రాబోయే స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ వంటివీ ఏకరువు పెడతారు… ప్రధానంగా విజన్- 2047 ప్రదర్శిస్తారు…
- భారత ప్రభుత్వం తనదైన 2047 విజన్ డాక్యుమెంట్‌ను బలంగా ప్రచారంలోకి తీసుకొస్తోంది… 30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం కోసం ఏమేం చేస్తామనేది..! బలమైన పెట్టుబడుల అవకాశాలున్న హైదరాబాద్, తెలంగాణను అందులో పదో వంతు, అంటే 3 ట్రిలియన్ ఎకానమీ వైపు తీసుకువెళ్లాలనేది తెలంగాణ విజన్-2047 ప్రాథమిక లక్ష్యం… కానీ ఎలా..?
అందుకే కొన్ని రంగాలను ఎంపిక చేస్తున్నారు… ముందుగా విజన్-2047ను సైట్లలో పెట్టి జనం నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు… ఉదాహరణకు మెడికల్ టూరిజం… అంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫార్మా సెంటర్లు అవసరం… బాలీవుడ్ ఒకరిద్దరు ప్రముఖులు అత్యంతాధునిక స్టూడియోల నిర్మాణాలకు ముందుకొస్తున్నారు… తద్వారా సినిమా నిర్మాణానికి ఫ్యూచర్ సిటీని ఓ సెంటర్ పాయింటుగా చేయడం…
మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్ వంటి సర్కారీ ఇనీషియేటివ్స్ కూడా ఆహుతులకు వివరిస్తారు… ఇలా… ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫార్మా రంగాలకు సంబంధించి ఏం చేయాలో, ఏం చేస్తామో, ఏమేం చేయగలమో ఈ డిటెయిల్డ్ ప్రజెంటేషన్ ఉంటుంది…
- హ్యూమన్ డెవలప్‌మెంట్, గ్లోబల్ టాలెంట్ హబ్, గ్లోబల్ ఇన్నొవేషన్ న్యూక్లియస్, గ్రీన్ ఎనర్జీ, ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ నడుమ మాన్యుఫాక్చరింగ్ జోన్లు… ఇలాంటి పలు ప్రధాన అంశాల్లో తెలంగాణ విజన్ రూపొందుతోంది… అందుకే 8, 9 తేదీల్లో జరిగే రైజింగ్ తెలంగాణ సమ్మిట్ భవిష్యత్తు హైదరాబాద్‌కు బాట చూపే మార్గదర్శి…
రెండేళ్ల సర్కారు విజయోత్సవం
ఇదంతా ఒకెత్తు… కాంగ్రెస్ రెండేళ్ల ప్రభుత్వ విజయోత్సవాన్ని పార్టీపరంగా, ప్రభుత్వపరంగా నిర్వహించుకోవడం మరో సంకల్పం… జాతీయ పార్టీ ప్రముఖులను ఎవరెవరిని పిలిచి, జనాన్ని సమీకరించి, ఎలా నిర్వహించాలో ఇంకా ఓ క్లియర్ పిక్చర్ రావాల్సి ఉంది… కానీ డిసెంబరు ప్రథమపక్షం అంతా తెలంగాణ ప్రజల దృష్టి, ప్రపంచం దృష్టి ఫ్యూచర్ సిటీలో కేంద్రీకృతం కాబోతోంది…
నిజానికి ఈ కథనం ఆ గ్లోబల్ సమ్మిట్ సంకల్పం, వివరాల మీద ఓ గ్లింప్స్ మాత్రమే… ఇంకా సమగ్ర వివరాలు తెలిసేకొద్దీ… టీజర్లు, ట్రెయిలర్ల దాకా వెళ్దాం… అసలు సినిమా మాత్రం ఫ్యూచర్ సిటీలోనే..!!
- అన్నట్టు… మొన్నామధ్య గిన్నీస్ రికార్డు బతుకమ్మతో ఓ రికార్డు క్రియేట్ చేశారు కదా… ఈ గ్లోబల్ ఫ్యూచర్ సిటీ సందర్భంగా ఇంకో రికార్డు ప్రయత్నం చేయబోతున్నారు… డ్రోన్ షో… ఆమధ్య దుబాయ్‌లో వందల డ్రోన్లతో కొత్త సంవత్సర స్వాగతం ఓ రికార్డు… దాన్ని తెలంగాణ బీట్ చేయబోతోంది…!!
Share this Article