.
Pardha Saradhi Upadrasta …. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపు దిశలోనా..?
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో తాజా వ్యాఖ్యలు — ట్రంప్ శాంతి ప్రణాళిక వాస్తవానికి చాలా దగ్గరగా ఉందని సూచిస్తున్నాయి.
Ads
అతను స్పష్టం చేసిన మాట:
> “ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపు దిశలో, రెండు పక్షాల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం. కఠినమైన కాంప్రమైజ్‌లు తప్పవు.”
ఈ వ్యాఖ్యలతో రాజనీతిక వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది.
ఇక మరో వైపు…
జెలెన్స్‌కీ ఇప్పటికే అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్‌కు ట్రంప్ శాంతి ప్రతిపాదనపై చర్చలకు సిద్ధమని తెలిపినట్లు మీడియా వర్గాల సమాచారం. త్వరలోనే ట్రంప్‌తో నేరుగా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
రష్యా ప్రస్తుతానికి నిశ్శబ్ధంగావున్నా అసలు ఈ ప్రతిపాదన అంతా రష్యాకు అనుకూలంగా నడుస్తుండటంతో కొన్నాళ్ళు నిశ్శబ్దంగానే వుండి పోతుంది. నిశ్శబ్దంగానే క్షేత్ర స్థాయిలో దాని యుద్ధం అది చేసుకుంటూ పోతోంది.
నవంబర్ 16, నవంబర్ 20 ల మధ్య ఇంకొంత భూభాగాన్ని తన సైనిక చర్య ద్వారా ఆక్రమించుకుంటూ ముందుకు వెళ్ళింది రష్యా… యుద్ద విరమణ ప్రయత్నాల ఫలితంతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది…
ట్రంప్ టీమ్ రూపొందించిన 28 పాయింట్ల శాంతి ప్రతిపాదనలో ముఖ్య పాయింట్లు:
➡️ డోన్బాస్‌లోని భాగాన్ని రష్యాకు లీజ్ ఇవ్వడం – లీజు డబ్బులు రష్యా చెల్లించాల్సి ఉంటుంది… కానీ నిజంగా చెల్లిస్తుందా? కొన్నాళ్ళు చెల్లించి దీన్ని నేను యుద్ధంలో సంపాదించాను, ఇవ్వను పో అనే అవకాశమే ఎక్కువ …
➡️ రష్యాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం – మాస్కోకి ఇది గేమ్‌చేంజర్. ప్రపంచ వాణిజ్యానికి ఒక మంచి స్టెప్. ఆంక్షలు లేని రష్యాతో వాణిజ్యానికి భారత్ లాంటి దేశాలు ఇంకా ఎదురు చూస్తున్నాయి. ఆంక్షలు ఉన్నప్పుడే ఏది ఆపలేదు, ఇక ఆంక్షలు లేకపోతే …. ?
➡️ యుద్ధ నేరాల దర్యాప్తులను నిలిపివేయడం – ఉక్రెయిన్ కోరిన దిశకు వ్యతిరేకం. ఉక్రెయిన్ కు తప్పదు…
➡️ ఉక్రెయిన్ సైన్యాన్ని 50% తగ్గించడం – రష్యా ప్రధాన డిమాండ్. అసలు సమస్య, యుద్ధం మొదలు అయ్యిందే NATO లోకి ఉక్రెయిన్ ప్రవేశం అనే దాని మీద…
➡️ లాంగ్-రేంజ్ ఆయుధాలపై నిషేధం.
➡️ విదేశీ సైనిక దళాలకు ఉక్రెయిన్‌లో ప్రవేశం నిషేదం – NATO ఉనికి పూర్తిగా కట్.
➡️ రష్యా భాష, రష్యన్ చర్చ్‌కు అధికారిక గుర్తింపు.
➡️ ఉక్రెయిన్‌కు అమెరికా + యూరప్ భద్రతా హామీలు.
ఈ ఒప్పందం దాదాపు రష్యాకు అనుకూలంగా ఎందుకు?
ఉక్రెయిన్ యుద్ధంలో ప్రధాన కారణాలు:
వనరులున్న తూర్పు ప్రాంతాలపై ఆధిపత్యం,
NATO ప్రభావం పెరగడం,
ఉక్రెయిన్‌ను NATOలో చేర్చి రష్యా సరిహద్దుల్లో NATO దళాలు మోహరించే అవకాశం.
ఇప్పుడు:
✔️ రష్యా ఆక్రమించిన భూభాగం రష్యాకే అప్పగించే దిశలో ప్రణాళిక. పేరుకు లీజు అన్నా దాదాపు శాశ్వత హక్కు… ఇక్కడ అమెరికాకు దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఇంకొకసారి చర్చించుకుందాం.
✔️ ఉక్రెయిన్ సైన్యం సగానికి తగ్గింపు
✔️ విదేశీ దళాలు నిషేధం
అంటే రష్యా కోరింది పూర్తిగా నెరవేరినట్టే…
ఇక అమెరికా?
ట్రంప్ ఇది “నేను ఆపిన 9వ లేదా 10వ యుద్ధం” అని చెప్పుకునే అవకాశం.
మొత్తం ఫలితం? అందరూ “హ్యాపీ” — కానీ ఒకే ఒక్కరు కాదు: కామెడీ యాక్టర్‌గా మొదలు పెట్టి దేశాధ్యక్షుడైన జెలెన్స్‌కీ.
ప్రపంచ శక్తులు ఇప్పుడు అతన్ని పక్కన బెట్టి, తాత్కాలిక ప్రభుత్వంతో ఎన్నికల దిశగా ఆలోచిస్తున్నాయి. ఏదో ఒకటి తీసుకొని దేశం వదిలి ఎక్కడో ఒక చోట స్థిరపడి పోతాడు. అంతకంటే మార్గం లేదు.
ఈ యుద్ధం మొత్తం — NATO & అమెరికా ఆధిపత్యం కోసం నడిచింది.
అవసరాలు తీరి, బిలియన్లు ఖర్చు అయిపోయాక ఇప్పుడు “శాంతి శాంతి” అని మళ్లీ పునర్నిర్మాణ ప్రాజెక్టులు తెరవబోతున్నారు.
అదే cycle: యుద్ధం → నాశనం → ఆయుధాల వ్యాపారం → మళ్లీ పునరుద్ధరణ → కొత్త పెట్టుబడులు.
గెలుపు-ఓటములు లేవు… నాశనమే నిజం………. — ఉపద్రష్ట పార్ధసారధి
#Geopolitics #InternationalNews #UkraineRussiaWar #Trump #WorldNews #GlobalAffairs #pardhatalks
Share this Article