Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అలా కాజువల్ జీన్స్‌లో వచ్చాడు.., మంత్రిగా ప్రమాణం చేశాడు..!

November 23, 2025 by M S R

.

Pardha Saradhi Upadrasta ….. ఖద్దరు మధ్య జీన్స్‌కి సీటు: బీహార్‌లో టెక్కీ మంత్రి హల్‌చల్ & వారసత్వ రాజకీయాలు
బీహార్ రాజకీయాల్లో అరుదైన దృశ్యం.

నితీశ్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చారిత్రక కార్యక్రమంలో అందరి దృష్టిని దోచుకున్నది…
జీన్స్, షర్ట్ వేసుకుని వచ్చిన ఒక యువ మంత్రి!

Ads

ఇతర మంత్రులు సంప్రదాయ కుర్తాలు, పైజామాలు, ధోతీల్లో హాజరవుతుంటే—
ఒక్కడే పూర్తిగా క్యాజువల్ డ్రెసింగ్‌లో వేదికపైకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో
మంత్రిగా ప్రమాణం చేయడం
పట్నాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఆ యువ మంత్రి —
దీపక్ ప్రకాశ్ (36).

అతను ఎవరు? ఎలా మంత్రి అయ్యాడు?
ఎన్డీయే భాగస్వామ్య పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) అధినేత ఉపేంద్ర కుష్వాహా కుమారుడు.
ఆయన తల్లి స్నేహలతా కుష్వాహా — ససారం నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ మంత్రిపదవి మాత్రం → తల్లికి కాకుండా నేరుగా కుమారుడికి
అది కూడా ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయని వ్యక్తికి.
అత్యంత ఆసక్తికరం?

మొదట్లో ఇతనికి ఇవ్వటం నితీష్ కు, అమిత్ షాకు ఇష్టం లేదని, కానీ కుష్వాహా వత్తిడి ఫలించింది అని చెపుతారు.
దీపక్ స్వయంగా చెప్పాడు:
“ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందే నాకు తెలిపారు.” అని…

టెక్కీ → మంత్రి: ఒకే రోజులో కెరీర్ మార్పు
దీపక్ ప్రకాశ్ బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా టెక్.
Manipal MITలో B.Tech (CSE)
నాలుగేళ్లు ఐటీ రంగంలో ఉద్యోగం
గత అయిదేళ్లుగా పార్టీ పనుల్లో యాక్టివ్
రాజకీయాల్లో ఫుల్-టైమ్ గా కనిపించకపోయినా నేరుగా మంత్రి పదవిలోకి రావడం యువతలో కూడా మిక్స్డ్ రియాక్షన్స్ కు దారితీసింది.

జీన్స్, షర్ట్‌లో ఎందుకు వచ్చాడు?
అతని క్విక్ రిప్లై వైరల్ అయింది:
“రాజకీయాలు ప్రజలకు దగ్గరగా ఉండాలి. కంఫర్ట్‌గా ఉన్న దుస్తులే వేసుకున్నాను.”

వారసత్వ రాజకీయాలు మళ్లీ చర్చల్లో 
ఈ సంఘటనతో బీహార్‌లో మళ్లీ పెద్ద చర్చ మొదలైంది— కూటమిలో చిన్న పార్టీకి వచ్చిన ఒక్క మంత్రి కోటా కూడా ఫ్యామిలీ లోపలే తిరుగుతుందా?

ఎందుకంటే:
✔️ RLM కు వచ్చిన ఒక్క మంత్రిపదవి అర్హత ఉన్న MLAకి కాకుండా → పోటీ చేయని అధినేత కుమారుడికే వెళ్ళింది.
✔️ అదే రోజు HAM అధినేత జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ కూడా మంత్రిగా ప్రమాణం చేశాడు. కాకపోతే అతన MLA గా ఎన్నికయ్యాడు.
ఇలా కూటమిలోని ప్రాంతీయ పార్టీల్లో“మంత్రిపదవి = కుటుంబ వారసత్వం” అన్న విమర్శ మరింత బలపడింది.
✔️ ప్రజల సందేహం స్పష్టంగా ఇదే:
“ఎన్నికల్లో గెలుస్తారు తల్లిదండ్రులు…
పదవులు మాత్రం పిల్లలకు?”
బీహార్‌లో వారసత్వ రాజకీయం అనేది ఎప్పుడూ చర్చే.

రాజ్యాంగ నిబంధన
దీపక్ ప్రస్తుతం MLA కాదు, MLC కూడా కాదు.
కానీ రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోపే ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. దానికి ఆయన పార్టీలోనే ఒక MLA రాజీనామా చేస్తాడో లేక MLC కు ఆ పార్టీ కోటా నుండి ఎన్నిక అవుతాడో చూడాలి.

మొత్తం సంగతేంటంటే…
నితీశ్ 10.0 ప్రభుత్వ ప్రమాణ స్వీకారం
సాధారణ వేడుకగా ఉండాలి.
కానీ అక్కడ ఒక్క జీన్స్, షర్ట్‌తో వచ్చిన టెక్కీ మంత్రి ప్రవేశం
బీహార్ రాజకీయాల్లో రెండు పెద్ద చర్చలకు దారి తీసింది:

1) ప్రజల ముందు కొత్త తరహా నేతల ఎంట్రీ
2) ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాల తిరిగి విజయం, కాకపోతే అది ఆ ప్రాంతీయ పార్టీ కు NDA లో వచ్చిన పదవి. ఎవరికి ఇచ్చుకుంటారో ఆ పార్టీ అధినేత ఇష్టం అని సర్దుకు పోవటమే…… ఉపద్రష్ట పార్ధసారధి
#BiharPolitics #DeepakPrakash #TechieMinister #NitishKumar #DynastyPolitics #RLM #PoliticalNews #pardhatalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రపంచయుద్దం గురించి రాసినా… జగన్‌ను అందులోకి లాగాల్సిందే…
  • అలా కాజువల్ జీన్స్‌లో వచ్చాడు.., మంత్రిగా ప్రమాణం చేశాడు..!
  • ఖర్చు వేల కోట్లు… ఇంపాక్ట్ తక్కువ… డిజిటల్ యాడ్స్ కథాకమామిషు..!
  • పోస్ట్ చేయడానికీ డబ్బుల్లేవ్… ఆమె తన హెయిర్ డ్రయర్ అమ్మేసింది…
  • కాల్పనిక కథను మించి..! జీవితాన్ని మించిన మెలోడ్రామా ఏముంటుంది..?
  • తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో… మంచాలిక దిగండోయ్ కొక్కొరొకో…
  • ఇవేం బంధాలు..? ఇవేం పంచాయితీలురా బిగ్‌బాస్ బాబూ…!!
  • లొట్టపీసు కేసు కాదు..! కేటీయార్ పక్కాగా ఫిక్సవుతున్న పెద్ద కేసు..!!
  • ఇదేమీ పాత్రికేయ ఘన పురస్కారం కాదు… జస్ట్, డబ్బు కక్కుర్తి యాడ్..!!
  • పరువు, పగ వికృతకోణం… కలుక్కుమనిపించే క్లైమాక్స్… ప్రేమ గెలవలేదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions