.
మిగతా విషయాలు చెప్పుకునేముందు ఏబీఎన్ రాధాకృష్ణను ఒక విషయంలో అభినందిద్దాం… కోర్టులు, న్యాయవ్యవస్థ సంబంధిత అంశాలపై ఏం రాయడానికైనా, అభిప్రాయం చెప్పడానికైనా కలాలు గజగజ వణుకుతాయి… తప్పో ఒప్పో రాధాకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి భయపడడు…
ఐతే ఇక్కడ ట్రాజెడీ ఏమిటంటే..? తను ఇష్యూ లోతుల్లోకి, జాతి హిత సూచనల జోలికి వెళ్లడు… తను తోచిందేదో రాస్తాడు… అది మరీ ఎంత సంకుచితంగా ఉంటుందీ అంటే… రాష్ట్రపతికి గడువు పెట్టొచ్చా లేదా అనే గంభీర అంశంలోనూ జగన్‌ను లాగి… ఇంకెప్పుడు శిక్షిస్తారు తనను..? ఈ విచారణలకు గడువు వద్దా..? అసలు ఇదేం విచారణ తీరు అని ప్రశ్నిస్తుంటాడు…
Ads
అర్జెంటుగా జగన్‌ను జైలులో వేసేసి, అసలు ఎన్నికల్లో పోటీకే అనర్హుడిగా మారిస్తే తప్ప మన న్యాయవ్యవస్థపై రాధాకృష్ణకు నమ్మకం కుదిరేట్టు లేదు… మొన్న వ్యక్తిగతంగా జగన్ హాజరయ్యాడు కదా కోర్టుకు… ఏవో కుశల ప్రశ్నలు వేసి పంపించేశారు అనేది రాధాకృష్ణ అభ్యంతరం… హబ్బా, అక్కడి నుంచి అటే జైలుకు పంపిస్తే బాగుండు అన్నట్టు రాసుకొచ్చాడు తను…
నిందితులు నిలబడే స్థానంలో గాకుండా సాక్షులుండే స్థానంలో కూర్చున్నాడట జగన్…? అంతటి పీవీ నరసింహారావు, ఆయనకు దీటైన చంద్రబాబులు కూడా వినయంగా న్యాయమూర్తుల ఎదుట నిలబడితే జగన్ మాత్రం ఇంత అగౌరవం ప్రదర్శిస్తాడా..? పైగా తన జనాన్ని పోగేసి బలప్రదర్శన చేస్తాడా..? వాటీజ్ దిస్ అంటాడు రాధాకృష్ణ… తను కూర్చుంటాడో, నిలబడతాడో న్యాయమూర్తికి లేని అభ్యంతరం రాధాకృష్ణకు దేనికట..? దేనికీ అంటే, అక్కడ ఉన్నది జగన్ కాబట్టి… రాధాకృష్ణ ప్రతి రక్తపుచుక్కలోనూ యాంటీ జగన్ వీనమ్ నిండిపోయి ఉంది కాబట్టి…!
ప్రజాప్రతినిధుల అక్రమాలకు సంబంధించి విచారణకు, తీర్పులకు గడువు ఉండాలనే వాదన వరకూ కరెక్టు… అది జగన్ అయినా సరే, ఇంకెవరైనా సరే… చంద్రబాబు మీద కేసులకూ వర్తించాలి… కాకపోతే మరో రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ…
పారడాక్స్… ఫిరాయింపుల చట్టం విచారణలకు స్పీకర్‌లకు గడువు పెట్టడం మీదనేమో… ఏం స్పీకర్‌ను జైలుకు పంపిస్తారా అనడుగుతాడు..? కానీ రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు మీద మాత్రం… గడువు ఉండాల్సిందే, అవసరమైతే కేంద్రాన్ని తగు చట్టం చేయాలని సిఫారసు చేసి ఉండాల్సింది అంటాడు…
నిజానికి రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువు పెట్టడం కరెక్టు కాదు… రాధాకృష్ణ తప్పులో కాలేసింది ఇక్కడే… అందుకే తన రాతలు పెరిఫెరల్‌గా ఇష్యూను టచ్ చేస్తాయనేది… ఈ దేశానికి సుప్రీం అథారిటీ సుప్రీంకోర్టు కాదు, పార్లమెంటు… ఆ చట్టాలన్నీ ఆమోదించే సుప్రీం పవర్ కూడా రాష్ట్రపతిదే… తన విచక్షణకు సుప్రీంకోర్టు ప్రశ్నించే పని ఉండకూడదు…
పర్ సపోజ్, ఎప్పుడూ దేశ హితానికి వ్యతిరేక పోకడలతో వెళ్లే మమతా బెనర్జీనే తీసుకుందాం… ఆమె ఈ దేశానికి చేటుచేసే ఏదైనా చట్టాన్ని అసెంబ్లీలోని తన సంఖ్యాబలంతో ఆమోదించిందీ అనుకుందాం… ఆ గవర్నర్ దాన్ని వ్యతిరేకిస్తే, తొక్కిపెడితే తప్పేముంది..? అది ఈ సమాజ వ్యతిరేకం అని భావించినప్పుడు..!!
స్టాలిన్ ఏమంటున్నాడు..? గడువులోపు ఆమోదించకపోతే ఇక ఆ చట్టాలు అమల్లోకి వచ్చేసినట్టే అంటాడు… అదేకదా తను సుప్రీంకోర్టుకు వెళ్లిన రీజన్… మమతకు మేల్ రూపం స్టాలిన్… తను కూడా ఏదో పిచ్చి బిల్లు ఆమోదిస్తే, గవర్నర్ దాన్ని వ్యతిరేకిస్తే తప్పేమిటి..? గవర్నర్ తన విచక్షణను ఉపయోగిస్తాడు… అవసరమైతే కేంద్రం సలహాలు స్వీకరిస్తాడు…
ఎస్, గవర్నర్ అంటే కేంద్రం ప్రతినిధి… కేంద్రం బలంగా ఉంటేనే దేశం సుస్థిరంగా ఉంటుంది… కుటుంబ, అవినీతి, వారసత్వ, అక్రమాలకు పెట్టింది పేరైన ప్రాంతీయ పార్టీలు దేశవ్యతిరేక పోకడలతో వ్యవహరిస్తే.,. తప్పకుండా గవర్నరో, రాష్ట్రపతో అడ్డుపడాలి… ఆ పార్టీల ఆటలు సాగవు కాబట్టే కేంద్రం ఓ మిథ్య అనే ఓ శుష్క, డొల్ల, జాతివ్యతిరేక నినాదాలకు దిగుతాయి…
కరెన్సీ, విదేశీ వ్యవహారాలు, విదేశీ మారకనిల్వలు, సైన్యం, ఇంధనం, ఎగుమతులు, దిగుమతులు, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సయిజ్, జీఎస్టీ వంటి జనరల్ టాక్సేషన్, రక్షణ వంటి కీలక వ్యవహారాలే కాదు… కేంద్ర- రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా ఓ సమీక్ష అవసరం, కొన్నింటిని కేంద్రానికి దఖలుపరచడం అవసరం… రేప్పొద్దున ఖలిస్థానీ అనుకూల ప్రభుత్వం పంజాబ్‌లో ఏర్పడితే… వాళ్లేదైనా చట్టం చేసేస్తే… అడ్డుకోవాల్సింది ఎవరు, ఎలా..? ఆలోచించు రాధాకృష్ణా..!!
చివరగా.... కేంద్రం అంటే అది మనల్ని బయటి నుంచి పాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు, దేశీ శక్తి కాదు... మనం అన్ని రాష్ట్రాల నుంచి ఎన్నుకున్న ప్రతినిధులు కలిసి ఏర్పాటు చేసే మన ప్రభుత్వమే...!!
Share this Article