.
Pardha Saradhi Upadrasta …… భారత్ బీఫ్ ఎగుమతుల నిజాలు – రాజకీయాలు, వాస్తవాలు & గణాంకాలు!
భారతదేశం బీఫ్ ఎగుమతులు చేస్తుందని చాలామంది భావిస్తారు.
కానీ అసలు నిజం పూర్తిగా వేరు.
1️⃣ భారత్ ఎగుమతి చేసే “Beef” అంటే అసలు ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్లో Beef అనే పదంలో ఇలా రెండు ఉంటాయి:
Cow Meat (ఆవు మాంసం)
Buffalo Meat (గేదె మాంసం / Carabeef)
Ads
భారతదేశం Cow meat ఎగుమతి చేయదు.
భారతదేశం Carabeef (గేదె మాంసం) మాత్రమే ఎగుమతి చేస్తుంది.
➡️ ఇది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిన అధికారిక పాలసీ.
➡️ Cow slaughter + cow meat export దేశంలో చాలా రాష్ట్రాల్లో నిషేధం.
అంటే—
“India Beef Export” = 100% Buffalo meat మాత్రమే.
2️⃣ మరి ప్రపంచంలో ఎందుకు దీనిని “Beef” అంటారు?
అంతర్జాతీయ ట్రేడ్ కేటగిరీల్లో… Cow beef, Buffalo beef రెండూ “Beef” అనే ఒకే కోడ్‌లో ఉంటాయి. అందుకే భారత ఎగుమతులను కూడా “Beef exports” గా లెక్కిస్తారు.
➡️ రాజకీయ పార్టీలు కావాలి అనే ఈ భ్రాంతిని ఉపయోగించి “బీఫ్ ఎగుమతి” అంటూ ప్రచారం చేస్తాయి.
➡️ కానీ ground reality: ఇది ఆవు మాంసం కాదు.
3️⃣ ఉత్తరప్రదేశ్ — దేశంలో No.1 Beef Exporter (Carabeef)
UP దేశంలో గేదె మాంసం ఎగుమతిలో అగ్రస్థానం.

కీలక గణాంకాలు:
🇮🇳 భారత మొత్తం గేదె మాంసం ఎగుమతుల్లో 43% UP ఒక్కటే
వార్షిక ఎగుమతి విలువ ₹14,000 కోట్లు+
పెద్ద పరిశ్రమలు: Aligarh, Meerut, Saharanpur, Ghaziabad, Kanpur clusters
వేలాది కుటుంబాలు పరోక్ష & ప్రత్యక్ష ఉపాధితో జీవనం.
4️⃣ ఈ రంగం ఎందుకు లాభదాయకం?
✔️ గేదెలు భారతదేశంలో విస్తృతంగా పెంచబడతాయి
✔️ డెయిరీ కోసం ఎక్కువగా వాడతారు
✔️ పాలు తక్కువైతే/ పనికిరాకపోతే మాంసంగా ప్రాసెస్ చేస్తారు. వీటినే వట్టి పోయిన గేదెలు అంటారు.
✔️ వట్టి పోయిన గేదెలు తొందరగా అనారోగ్యానికి గురి అవుతాయి. ఆ అనారోగ్యానికి గురి కాకుండా ముందే వాటిని మాంసంగా ప్రాసెస్ చేస్తారు.
✔️ Halal కారాబీఫ్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్
✔️ మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు భారత meat quality ఎక్కువగా నచ్చుతుంది
5️⃣ రాజకీయాలు ఎందుకు గందరగోళం చేస్తాయి?
భారత్‌లో…:
ఆవు = పవిత్రం + భావోద్వేగం + రాజకీయ సెన్సిటివిటీ
అదే సమయంలో
గేదె = వ్యవసాయ + డెయిరీ జంతువు → మాంసం ఎగుమతి చట్టబద్ధం
రాజకీయ చర్చల్లో ఈ రెండు విషయాలను కలిపి
బీఫ్ పేరు మీద భావోద్వేగ రాజకీయాలు చేయడం సులభం.
కానీ అసలు ఎగుమతుల్లో
ఆవు మాంసం ఒక్క గ్రాము కూడా ఉండదు.
6️⃣ Bottom Line….
✔️ భారత్ బీఫ్ ఎగుమతులు = 100% Buffalo meat
✔️ Cow meat export = సంపూర్ణ నిషేధం
✔️ UP = దేశంలోనే అగ్రస్థానం (₹14,000 కోట్ల కారా బీఫ్ ఎగుమతి)
✔️ బీఫ్ రాజకీయాలు = భావోద్వేగం vs వాస్తవం
✔️ చాలా రాష్ట్రాల్లో గో వధ, ముఖ్యంగా ఆవుల వధకు వ్యతిరేకముగా కఠిన చట్టాలు ఉన్నాయి. గో సంరక్షకులు చాలా చోట్ల అప్రమత్తంగా వుంటారు, వుండాలి.
ఇదిగో RTI లో కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఇచ్చిన సమాచారం…. — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #BeefExports #BuffaloMeat #UPNews #FactCheck #IndianEconomy #Carabeef #FoodProcessing #IndiaTrade #politicalfacts
Share this Article