.
నక్సలైట్ల చివరి విజ్ఞప్తి… ఆయుధాలు వదిలేసి, పోరాటం విసర్జించి… జనజీవన స్రవంతిలో కలిసిపోతాం… ఫిబ్రవరి వరకూ టైమ్ ఇవ్వండి… మొత్తం ప్రభుత్వం తరఫున యాక్టివిటీ ఆపేయండి, మా అభ్యర్థన… అందరితోనూ మాట్లాడతాం… ఆయుధ విసర్జన తేదీని ప్రకటిస్తాం… అని మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధిగా అనంత్ అభ్యర్థన జారీ…
.
Ads
దీన్ని కూడా ఓ ఎత్తుగడగా భావించాలా..? చాన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నమే కదా… జర్నలిస్టులు, మేధావులతో మాట్లాడతాం, కాల్పులు విరమిద్దాం అనే ప్రకటనలు… ఆపరేషన్ కగార్ ఓ ముగింపుకి వస్తోంది… సెంట్రల్ కమిటీ సభ్యులే లొంగిపోతున్నారు లేదా ఎన్‌కౌంటర్ అయిపోతున్నారు… ఈలోపు రాజ్యం వాళ్లకు బ్రీత్ టేకింగ్ టైమ్ కూడా ఇవ్వదు… అది రియాలిటీ…
కఠినంగా ఉన్నా ఒకటే మాట… లొంగిపొండి లేదా చచ్చిపొండి… ఇదే కేంద్రం విధానం… ఇప్పుడు మూడు రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ ఆయా రాష్ట్రాల సీఎంలకు అభ్యర్థన జారీ చేసినా అది ఓ వృథా ప్రయత్నం… అవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే… అన్నీ కేంద్రంలోని బీజేపీ లేదా ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా నడిచేవే…
అంతేకాదు, ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వమే ఉన్నది… ఒక్క తెలంగాణలో మాత్రమే బీజేపీయేతర ప్రభుత్వం ఉంది… కానీ హిడ్మా వంటి నేతలూ తెలంగాణను సేఫ్ వాతావరణాన్ని నమ్ముకోకుండా హతమారిపోయారు…
‘‘మా సహచరులను సంప్రదించి, మా పద్దతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలి… కాబట్టి, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము… నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశ్యం లేదు…’’ అంటున్నాడు ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్…
రాజ్యం స్పందన ఎలా ఉంటుందంటే…? ‘‘సమయం లేదు మిత్రమా, రణమా, శరణమా…’’ కేంద్రం వైఖరిని బట్టి చెబుతున్నది ఇదే… మావోయిస్టులకు అర్థంకాని అంశమేమిటంటే… ‘‘రాబోయే PLGA వారంలో వారు ఎటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదు… వారు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను కూడా ఆపాలి..’’ వంటి షరతులను రాజ్యం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదిప్పుడు… ఇది రియాలిటీ…

Share this Article