.
తెలుగువాడి సత్తా అంటే మామూలుగా ఉండదు! మొన్నటిదాకా పబ్లిక్ లైఫ్‌కి, మీడియా తెరకు దూరంగా ఉన్న ఓ తెలుగు మూలాలున్న ఫార్మా బిలియనీర్… ఒక్క పెళ్లితో ఏకంగా ఇంటర్నేషనల్ వార్తల్లోకి దూకాడు… ఆయనే రాజ్ మంతెన…
రాజ్ మంతెన యు.ఎస్. (US)లో ఉంటూ కూడా గోప్యత పాటించే బిలియనీర్… ఆయన డబ్బు మొత్తం కేవలం మందుల వ్యాపారంతోనో, కేవలం సాఫ్ట్‌వేర్ తోనో రాలేదు… ఆయనది తెలివైన కాంబినేషన్!
Ads
ఇండియాలో కంప్యూటర్ సైన్స్ చదివి, ఆపై అమెరికాలో క్లినికల్ ఫార్మసీ చదివాడు… ఈ రెండు జ్ఞానాలనూ కలిపి ‘ఫార్మా టెక్’ అనే కొత్త హైవే సృష్టించాడు…
ఈయన కంపెనీల్లో ఒకటైన ICORE Healthcare సూపర్ హిట్… క్యాన్సర్ వంటి ఖరీదైన ట్రీట్‌మెంట్స్‌కి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత డబ్బు ఇవ్వాలో లెక్కించే అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ తయారుచేసింది… కేవలం నాలుగేళ్లలోనే ఈ కంపెనీని $200 మిలియన్ డాలర్లకు (సుమారు ₹1,600 కోట్లకు పైగా) అమ్మేశాడు..! ఈ డీల్‌తో ఆయన స్థాయి ఒక్కసారిగా మారిపోయింది…
ప్రస్తుతం ఆయన Ingenus Pharmaceuticals (స్పెషాలిటీ generic drugs), Integra Connect (క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్ కోసం క్లౌడ్ టెక్నాలజీ) వంటి అనేక విజయవంతమైన సంస్థలకు ఛైర్మన్/CEO…
రాజ్ మంతెన కూతురు నేత్ర… ఆమె కూడా హార్వర్డ్‌లో చదివి తండ్రి కంపెనీల్లోనే పనిచేస్తోంది… ఆమె వివాహం గురించి మనం చెప్పుకునే ముచ్చట… ఆమె పెళ్లి మరో టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ వంశీ గాదిరాజుతో ఉదయ్‌పూర్‌లో జరిగింది… పెళ్లి ముచ్చట కాస్తా ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది అంటే దానికి కారణం…
1) రాజఠీవి…: పెళ్లి కేవలం ఫైవ్-స్టార్ హోటల్‌లో కాదు. సిటీ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్ వంటి రాజభవనాలను నాలుగు రోజుల ఫంక్షన్ కోసం పూర్తిగా బుక్ చేశారు… అసలు ఉదయ్‌పూర్ అంటేనే హైఫై డెస్టినేషన్లకు వేదిక కదా…
2. హాలీవుడ్ ఎంట్రీ…: మన హీరోలు, హీరోయిన్లు డాన్స్ చేయడం మామూలే. కానీ, ఈ పెళ్లికి ఏకంగా గ్లోబల్ స్టార్స్… జెన్నిఫర్ లోపెజ్ (JLo), జస్టిన్ బీబర్ పాటలు పాడటానికి, పెర్ఫార్మ్ చేయడానికి వచ్చారు! వీరికి ఇచ్చిన రెమ్యునరేషన్ గురించే ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది…
3. వీఐపీ లిస్ట్…: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొడుకు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా హాజరు కావడం ఈ ఈవెంట్ స్థాయిని అమాంతం పెంచింది…
ఉదయ్‌పూర్… లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పెట్టింది పేరు… పీవీ సింధు, హార్దిక్ పాండ్యా, ఇషా అంబానీ, నీల్ నితిన్ ముఖేష్, సంజయ్ హిందూజ… ఇలా ఎందరో ఇక్కడ వివాహ వేడుకలు జరుపుకున్నారు. తాజాగా ఈ కోవలోకే చేరారు మంతెన కొడుకు, అల్లుడు…
పెళ్లికొడుకు ఎవరు..? నేత్రను పరిణయం చేసుకునేది అమెరికాకు చెందిన వంశీ గాదిరాజు… ఈయన ప్రముఖ టెక్ ఇన్నోవేటర్… కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందారు… సూపర్ ఆర్డర్ అనే ఫుడ్ యాప్‌కు సహ వ్యవస్థాపకుడు… అంతేకాదు దానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు… గతేడాది ఫోర్బ్స్ 30, అండర్ 30 జాబితాలో ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీ కింద చోటు సంపాదించాడు…
అతిథులు… డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అతని స్నేహితురాలు ఈ వేడుకలకు హాజరవడం ప్రత్యేక ఆకర్షణ… ఇతని కోసం సుమారు 40 దేశాల నుంచి 126 మంది అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు… జస్టిన్ బీబర్, జెన్నిఫర్ లోపెజ్, టియెస్టో, బ్లాక్ కాఫీ, సిర్క్యు డు సోలైల్, డీజే అమన్ నాగ్‌పాల్ తదితర అంతర్జాతీయ ప్రదర్శనకారులు…
అంతేనా… హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కరణ్ జోహార్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మాధురీ దీక్షిత్, దియా మిర్జా తదితర బాలీవుడ్ స్టార్లు కూడా… శుక్రవారం తాజ్ లేక్ ప్యాలెస్‌లో హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి… వీటిని కరణ్ జోహార్, సోఫీ చౌదరీ హోస్ట్ చేశారు…
సంగీత్ వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ ఆడుతూ పాడుతూ డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను అతని స్నేహితురాలిని డ్యాన్స్ ఫ్లోర్‌కు తీసుకెళ్లడంతో హాలంతా కేరింతలతో నిండిపోయింది… శనివారం… మానెక్ చౌక్‌లో మెహందీ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి… ఆదివారం.. ప్రధాన వివాహ ఘట్టం, రిసెప్షన్..!!
Share this Article