.
తాజాగా నాగచైతన్య నటించే వృషకర్మ అనే సినిమా ప్రకటించారు… ఇదీ పౌరాణికం, మంత్ర, దైవ శక్తుల టచ్ ఉన్న థ్రిల్లర్ అంటున్నారు… అవును, ట్రెండ్ అదే కదా ఇప్పుడు… అసలు ఇదే కాదు, కొన్ని వేల కోట్ల టోటల్ బడ్జెట్ ఉన్న చాలా సినిమాలు రాబోతున్నాయి… వచ్చే సంవత్సరం, తరువాత సంవత్సరం…
కల్కి-2 సీక్వెల్ ఆల్రెడీ నిర్మాణంలో ఉంది… దీపిక పడుకోన్ బాపతు వివాదం తెలిసిందే కదా… జై హనుమాన్ సినిమా ప్రకటించబడి ఉంది, కానీ నిర్మాణ పురోగతి తెలియదు… మిరాయ్-2 కూడా ప్రకటించారు… కాంతారకు ప్రీక్వెల్ కాంతార-1 చాప్టర్ వచ్చేసింది… కాంతార-2 కూడా ఉండనుంది…
Ads
హొంబలె ఫిలిమ్స్ వారి మహావతార్ నరసింహ యానిమేషన్ ఫిలిమ్ అనూహ్య ఘనవిజయం తరువాత మరో అవతారం రావాల్సి ఉంది… అందులో పరుశురాముడిగా విక్కీ కౌశల్ నటిస్తాడని టాక్… నాస్తిక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే వారణాసి కూడా చరిత్ర, దైవిక, మంత్ర శక్తుల కథే… ఇవి గాకుండా సాయిపల్లవి సీతగా నటిస్తున్న రామాయణం నిర్మాణంలో ఉంది… అదీ భారీ సినిమాయే…
బ్రహ్మాస్త్ర 2, 3 సీక్వెల్స్ అన్నారు… ఎంతవరకు వచ్చిందో తెలియదు… అమీర్ ఖాన్ మహాభారతం ప్రిపొడక్షన్ పనుల్లో ఉన్నట్టు చెబుతున్నారు… రానా నటిస్తాడని చెబుతున్న హిరణ్యకశ్యప ప్రోగ్రెస్ చాన్నాళ్లుగా వినిపించడం లేదు… నిఖిల్ సిద్ధార్థ స్వయంభూ, హిందీలో రాహు-కేతు, శక్తి శాలిని, రామ్ రాజ్య సినిమాల ప్రకటనలు కూడా వచ్చాయి గతంలో…
సరే, ఇతర భాషల్లోనూ ఇంకా ఉండొచ్చు… మొత్తానికి ఇండియన్ సినిమా… పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఇదే జానర్‌లో కొట్టుకుపోతోంది… మైథలాజికల్, మంత్ర శక్తులు, దైవిక శక్తులు కథాంశాలు… దాదాపు ప్రతి సినిమా వీఎఫ్ఎక్స్ బేస్డ్ సీన్లపై కాన్సంట్రేట్ చేసేదే… అఫ్‌కోర్స్, ఒకటి పూర్తిగా యానిమేటెడే…
ఈ జానర్ సినిమాలు ప్రధానంగా హిందీ మార్కెట్‌లో బాగా ఆడుతున్నాయి… పెద్ద మార్కెట్ కదా, ఇక అందరి దృష్టీ ఇలాంటి సినిమాలపైనే ఉంది… అన్నీ కలిపితే కొన్ని వేల కోట్ల బడ్జెట్… ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంత ఖర్చయినా సరే అని ముందుకొస్తున్నాయి… వీటిల్లో ఎన్ని తెర మీదకు వస్తాయో, ఎలా ఆడతాయో చూడాలిక..!! అన్నట్టు… చెప్పడం మరిచిపోయాను… బాలయ్య అఖండ-2 శివతాండవం సరేసరి..!!
Share this Article