.
వేరే భాషల బిగ్‌బాస్ పెడపోకడలు, ప్రత్యేకించి హిందీ బిగ్‌బాస్ షో నడిచే తీరుతో పోలిస్తే తెలుగు బిగ్‌బాస్ కాస్త నయమే అనిపించేది ఇన్నాళ్లు… ప్రతి సీజన్‌లో కొందరు అడవీ మృగాళ్ల వంటి కేరక్టర్లు వస్తుంటాయి… కానీ ఎప్పటికప్పుడు అదుపు చేసేవాళ్లు… మరీ మ్యాన్‌హ్యాండ్లింగ్ దాకా పరిస్థితి వెళ్లేది కాదు…
కానీ నిన్న రాత్రి ప్రసారం చేసిన ఎపిసోడ్ చూస్తే బిగ్‌బాస్9 సీజన్ పూర్తిగా భ్రష్టుపట్టించినట్టు స్పష్టమవుతోంది… ఏమో, బిగ్‌బాస్ కావాలని ఇంకా పెట్రోల్ పోశాడేమో… అందుకే బూతులు, దాడుల దాకా పరిస్థితి దిగజారితే అస్సలు ఇన్వాల్వ్ కాలేదు, హెచ్చరించలేదు… వాటెండ్‌లీ… చెత్తా ధోరణి…
Ads
నిన్నటిదాకా పడాల కల్యాణ్ కూల్… సాధుజీవి… కానీ హఠాత్తుగా తనలోని ఓ మృగం నిద్రలేచింది… రెండుమూడు వారాలుగా వోటింగులో తనూజతో పోటీపడుతున్న తను పిచ్చివాడై ఉన్మాదంతో బిహేవ్ చేసి, తనను తాను దిగజార్చుకున్నాడు…
నిజానికి డెమోన్ పవన్ ఇమాన్యుయెల్‌ను నామినేట్ చేస్తున్నాడు… ఏదో వాగ్వాదం సాగుతోంది… మధ్యలోకి కల్యాణ్ వచ్చాడు, అరుస్తున్నాడు, మీదమీదకు వస్తున్నాడు… అడ్డుపడిన రీతూ పట్ల కూడా అనాగరికంగా పైపైకి వెళ్తున్నాడు… ఓ దశలో డెమోన్ కల్యాణ్ పీక పట్టుకున్నట్టు కనిపిస్తోంది… ఆల్రెడీ కొట్టుకుంటే ఆ మేరకు కట్ చేశారేమో అన్నట్టుగా ఉంది…

పదే పదే ఇమాన్యూయేల్, సంజన, భరణి, దివ్య అడ్డుకుంటున్నా సరే, కల్యాణ్ మరీ పిచ్చోడిలాగే వ్యవహరించాడు… పూర్తిగా అదుపు తప్పాడు… అంతకుముందు ఇదే సంజన రీతూను ఉద్దేశించి ఏదో తిక్క కూత కూసింది… తనకు బాగా సన్నిహితంగా ఉండే ఇమాన్యుయేల్ తదితరులు కూడా కోపంగా ఆమె చేసింది తప్పని చెబుతున్నా సరే, ఆమె ఆగలేదు… ఆమెకూ పడాల కల్యాణ్ ఆవహించినట్టున్నాడు…
నిజానికి దివ్య తనూజకు సారీ చెప్పింది, ఇంతటితో అన్నీ మరిచిపోదాం అని చెప్పింది… తనూజ కూడా అంతే పాజిటివ్‌గా రియాక్టయింది… ఇద్దరూ హగ్ చేసుకున్నారు… తనూజతో వైరం వోటింగును దెబ్బతీస్తుందనే తత్వం దివ్యకు బోధపడినట్టుంది… గత వారం తృటిలో తప్పిపోయింది కదా ఎలిమినేషన్… కానీ బేసిక్ గుణం మారదు కదా, భరణితో తన తిక్క ధోరణినే కనబర్చింది… నామినేషన్ సమయంలో…

ప్రధాన పోటీదారు కాబట్టి అందరూ తనూజనే టార్గెట్ చేస్తున్నారు… కానీ సుమన్ శెట్టి చెప్పిన కారణం ఫూలిష్… సంచాలక్‌గా తనూజ ఉన్నప్పుడు ఆమె ఏదో చెప్పిందట, తనకు నచ్చలేదట, మరి ఆ పోటీ అయిపోయాక రూమ్‌లోకి వచ్చినప్పుడు ఈ సాకులు చెప్పలేదేమిటి అని తనూజ అడిగితే ఏదో పొంతన లేని పిచ్చి కారణాలేమో చెప్పాడు…
మొత్తానికి భరణి సేఫ్ గేమ్ వదిలేసి… బాండింగ్స్ పక్కన పెట్టేశాడు… అందరూ అనుకున్నట్టు ఇమాన్యుయేల్ ప్రధాన పోటీదారు ఏమీ కాదు, పొద్దున అనఫిషియల్ వోటింగులు చూస్తే మూడో ప్లేసులో, తనూజకు చాలా దూరంలో ఉన్నాడు… నిన్నటి ఎర్రగడ్డ మార్క్ బిహేవియర్‌తో కల్యాణ్ సెకండ్ ప్లేసు నుంచి దిగజారొచ్చు కూడా… జరిగిన కొట్లాటలో డెమోన్, కల్యాణ్ ఇద్దరిదీ తప్పున్నట్టు కనిపిస్తున్నా, పదే పదే ట్రిగ్గర్ చేసింది మాత్రం కల్యాణే….
సుమన్ శెట్టి ఆల్రెడీ చివరి నుంచి రెండో ప్లేసుకు పడిపోయాడు… రీతూ పట్ల మ్యాన్‌హ్యాండ్లింగ్ అంటూ పవన్ ను హౌజు నుంచి బయటికి పంపేస్తానని ఆ -వేషం ప్రదర్శించాడు కదా నాగార్జున ఆమధ్య… ఇప్పుడు పడాల కల్యాణ్‌ను బయటికి పంపించగలడా..? ఆ నిజాయితీ ఉందా..? చూద్దాం..!!
Share this Article