Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పవర్ పాలసీ..! కేసీయార్ నష్టకారకాలు Vs రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీలు..!!

November 26, 2025 by M S R

.

పాత కేసీఆర్ హయాంలోకన్నా ప్రస్తుత సీఎం తీసుకుంటున్న విధాన నిర్ణయాలే సరైన డైరెక్షన్‌‌లో, తెలంగాణ వాస్తవ అభివృద్ధి దిశలో ఉంటున్నాయి… రియాలిటీ ఏమిటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి ఓసారి…

ఉదాహరణకు… నిన్నటి కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యమైంది జీహెచ్ఎంసీ బయట, ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను స్థూలంగా జీహెచ్ఎంసీలో కలిపేయడం… అంతకుముందు చిన్న చిన్న మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది కేసీయార్ ప్రభుత్వం…

Ads

raidurgam

ఇప్పుడు జీహెచ్ఎంసీని విస్తరించడంతో పాలన సులువు, అవసరమున్నచోట్ల నిధుల వ్యయానికీ వెసులుబాటు… జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులకు సరైన ప్లానింగ్… అంతేకాదు, నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న పారిశ్రామికవాడల భూములకు మల్లీయూజ్ కన్వర్షన్‌ను అనుమతించడం  (హిల్టీపీ)… పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి పంపించేయాలనే నిర్ణయం… అంటే విశ్వనగరాన్ని మరింత నివాసయోగ్యంగా మార్చడం…

ghmc

(ఈ భూముల కన్వర్షన్ మీద బీఆర్ఎస్ ఏదేదో వేల కోట్ల కుంభకోణం అని ఆడిపోసుకుంటోంది గానీ, ఆ విధాన నిర్ణయాల ఉత్తర్వులన్నీ కేసీయార్ హయాంలో వెలువడినవే…) జీహెచ్ఎంసీ విస్తరణకు తోడు మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటివి అదనపు సౌకర్యాల విస్తరణ… ఇతర అభివృద్ధి ప్రణాళికలు…

hyderabad

మరో ముఖ్యమైన నిర్ణయం… 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు కొనుగోలుతోపాటు… ఈ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు, పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం… అభినందించతగిన మంచి నిర్ణయం… ఇది ఎందుకు ప్రశంసించాల్సిన నిర్ణయమో చెప్పడానికి ముందు గతంలో ఓ కేబినెట్ నిర్ణయం గురించి చెప్పాలి…

bess

1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు, ఆ రంగంలో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… అది విద్యుత్తు రంగంలో చాలా క్రూషియల్ నిర్ణయం… సౌర, పవన విద్యుత్తులు వంటి రెన్యువబుల్, క్లీన్, గ్రీన్, చౌక ఎనర్జీని పగటిపూట వాడుకోగలం, మరి రాత్రి..? అందుకే ఆ విద్యుత్తును స్టోర్ చేసి, రాత్రి వేళ, పీకవర్స్‌లో వాడుకోవడానికి, గ్రిడ్ రక్షణకు అద్భుతమైన ఏర్పాటు…

పవర్

  • ఆల్రెడీ సింగరేణి 200 మెగావాట్ల బీఈఎస్ఎస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్లాన్ చేసింది… త్వరలో మందమర్రిలో తొలి ప్లాంటు స్టార్ట్ కాబోతోంది… తెలంగాణ జెన్‌కో కూడా ఈ ప్లాంట్లపై ప్రణాళికలు వేస్తోంది… ఈ వార్తలు వివరంగా రాసినప్పుడే ‘ముచ్చట’ ప్రభుత్వానికి ఓ సూచన చేసింది… బీఈఎస్ఎస్ (బ్యాటరీ స్టోరేజీ)తో పాటు పంప్డ్ స్టోరేజీ మీద కూడా దృష్టి పెట్టాలని..!

tg discoms

ఇది ఎందుకు అంటే..? జలవిద్యుత్తును వాడకం ఎక్కువ లేనప్పుడు పైకి రిజర్వాయర్లలోకి ఎత్తిపోసి, పీకవర్స్‌లో అదే నీటితో మళ్లీ ఉత్పత్తి చేసుకుని, వాడుకోవడం…రీ జనరేషన్… రాబోయే రోజుల్లో పీకవర్స్, ఆఫ్ పీకవర్స్‌లో రేట్లు వేర్వేరుగా ఉండబోతున్నాయి… ఇప్పటికే కొంత అమల్లోకి వచ్చాయి… సో, రాను రాను ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు కీలకం కాబోతున్నాయి… (హైబ్రీడ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ రాబోయే రోజుల విద్యుత్తు…)

అయిదేళ్ల కాలపరిమితిలో 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు నిర్ణయంతోపాటు… రాబోయే పంప్డ్ స్టోరేజీకి అవసరమైన నీళ్లు, భూమి ఇస్తాం గానీ మొదట ఆ పవర్‌ను స్టేట్ డిస్కమ్స్‌కే అమ్మాలనేది షరతు… సరైనదే…

bhadradri

నిన్నటి కేబినెట్ నిర్ణయం అదే… ఒక్కసారి తేడా చూడండి… కాలం చెల్లిన సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంటును తెలంగాణ నెత్తిన రుద్దింది కేసీయార్… చత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోలుకు లోపభూయిష్ట విధానాలు, అడ్డగోలు కారిడార్ ఒప్పందాలు, అధిక ధరలకు ప్రైవేటు కరెంటు కొనుగోళ్లు సరేసరి… కానీ..?

medigadda

  • రేవంత్ రెడ్డి ప్రభుత్వపు బీఈఎస్ఎస్, పంప్డ్ స్టోరేజీల ప్రణాళికలకూ… కేసీయార్ ప్రభుత్వపు అడ్డదిడ్డం నష్టదాయక నిర్ణయాలకూ నడుమ ఎంత తేడా ఉందో అర్థమవుతోంది కదా… అందుకే ఎవరి పని వాళ్లు చేయాలి… నేనే నీటిప్రాజెక్టులు డిజైన్ చేస్తాను అని కదిలితే మేడిగడ్డ బరాజు తస్కింది… పవర్ ప్లాంటు టెక్నాలజీ నిర్ణయమూ నాదే అని కదిలితే ఇదుగో, ధర ఎక్కువ, కాలుష్య కారక సబ్ క్రిటికల్ భద్రాద్రి ప్లాంటును ఎప్పుడూ షట్‌డౌన్‌లో ఉంచడం..!!

kaleswaram

రామగుండంలో 800 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంటుకు అనుమతి, పాల్వంచ, మక్తల్ ప్రాంతాల్లో ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు సూత్రప్రాయ నిర్ణయం కూడా సరైన విద్యుత్తు విధానంలో భాగమే… అంతేకాదు, సర్కారీ సబ్సిడీలు, బకాయిలు అధికంగా ఉండే కనెక్షన్లకు ఓ సపరేట్ డిస్కమ్ ఏర్పాటు చేసి, మిగతా రెండు డిస్కమ్‌ల వయబులిటీ, లాభదాయకత పెంచి, పరపతి పెంచడం..!

స్థూలంగా కేసీయార్ హయాంలో గాడితప్పిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు విధానం మళ్లీ పట్టాలెక్కి, వందే భారత్‌లాగా వేగంగా ఉరుకుతోంది… ఇది రియాలిటీ…!!

పాలకుడు తనే నార్ల తాతారావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనుకుంటే నష్టం ఏమిటో కేసీయార్ చేసిన నష్టాలు చెప్పాయి కదా... సో, పాలకుడు ఖచ్చితంగా గుంపు మేస్త్రీలా మాత్రమే ఉండాలి..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పవర్ పాలసీ..! కేసీయార్ నష్టకారకాలు Vs రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీలు..!!
  • సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!
  • అందరికీ కొత్త ఆధార్ కార్డులు..! అవసరం ఏమిటి..? ఎప్పటి నుంచి..?!
  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?
  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…
  • అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? మోడీ ఏమైనా తప్పుచేశాడా..?
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!
  • నాగార్జునా… ఈ కల్యాణ్ అనే రూడ్ కేరక్టర్‌ను బయటికి పంపించగలవా..?
  • హిడ్మా..! తెలంగాణలో రోజుకూలీగా అనామకంగా బతికాడా..? దేనికి..?!
  • ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions