Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!

November 26, 2025 by M S R

.
Subramanyam Dogiparthi …… దొంగలందు మంచిదొంగలు వేరయా విశ్వదాభిరామ వినుర వేమ . ఏ సినిమాలో అయినా హీరో ఉత్త పుణ్యానికి దొంగ కాడు . ఖచ్చితంగా ఫ్లాష్ బేక్ ఉండాల్సిందే . ఈ సినిమాలో కూడా ఉంది . అయితే ఈ దొంగ మంచిదొంగ కావటానికి ఎన్ని మలుపులో ! మళ్ళా సగం దొంగ సగం పోలీసుగా మారటానికి ఎన్ని మలుపులో !

సీతక్క మావోయిస్టు అవతారం నుండి జన జీవన స్రవంతిలోకి వచ్చి MLA అయ్యి , ఇప్పుడు మంత్రి కూడా ఎలా అయిందో… అలాగే మంచిదొంగ చిరంజీవి కూడా జైల్లో తనని తాను సంస్కరించుకుని చదువుకొని సబ్ ఇనస్పెక్టర్ అవుతాడు . సంఘ విద్రోహ శక్తులతో పాటు తన తండ్రిని చంపిన దుర్మార్గుడిని కూడా చట్టానికి అప్పచెప్పి ఆదర్శ పోలీస్ అవుతాడు .‌

ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన దేవీ వరప్రసాదరావు నిర్మించిన ఈ మంచిదొంగ సినిమాకు కధను నేసింది యం వి యస్ హరనాధరావు . డైలాగులను కూడా ఆయనే వ్రాసారు . ఈ సినిమాలో వీర , భయంకర శృంగారాన్ని మెచ్చుకోక తప్పదు . విజయశాంతి సరేసరి, కానీ చివరకు సుహాసిని కూడా ఓవర్ డోస్. అంతటి కుయిలీ కూడా వెలవెలబోయింది వీరోయిన్ల విన్యాసాల ముందు…

మనకు ఎన్నో 1+ 2 సినిమాలు ఉన్నాయి . రాఘవేంద్రరావు ఓ పాటలో సినిమాను 2+ 1 సినిమాను చేసేస్తాడు . హీరోయిన్లు ఇద్దరు ప్రాణస్నేహితులు . ఇద్దరూ ఒకే సారి ఊహల్లోకి వెళ్ళిపోయి చిరంజీవితో శృంగార రసాన్ని వర్షిస్తారు . ఇద్దరూ ఒకరి చెవిలో ఒకరు ఏం చెప్పుకుంటారో తెలియదు .

Ads

తరువాయి సీన్లో ఇద్దరూ ఒకే బెడ్ మీదకు చేరి హీరోతో పాటను కంటిన్యూ చేస్తారు . కన్ను కొట్టువాడె కన్నెమొగుడు కౌగలించుకునే వాడె దొంగ మొగుడు . శృంగార హృదయులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాట వీడియోని మిస్ కాకండి బాబో, మిస్ కాకండి .

  • సినిమాలో పాటలన్నీ ఇలాగే శృంగార రసభరితంగా ఉంటాయి . విజయశాంతిని సర్కస్సులో రబ్బరు బొమ్మని వంచినట్లుగా రకరకాల భంగిమల్లో వంచిపారేసాడు చిరంజీవి . సంతోషం ఏమిటంటే ఆమె శరీరం సహకరించటం , ఆ తర్వాత ఏమీ విరిగిపోకుండా సినిమా పూర్తవటం .

ఆమెతో కడుపులోని బాబుకు కధలు చెప్పనా ముద్దు ముద్దు పాపకు జోల పాడనా అనే డ్యూయెట్ , బెడ్ లైట్ వెలిగించనా బెడ్ లైట్ తొలగించనా అనే మొదటి రాత్రి డ్యూయెట్ , నా రెండు కళ్ళకు పువ్వుల పిచ్చి నా రెండు పెదవులకు ముద్దుల పిచ్చి అంటూ చిరంజీవి , విజయశాంతి మీద సాగుతాయి . సుహాసినితో ముద్దు పెట్టమంటావా నువ్వే పెట్టుకుంటావా అంటూ సాగుతుంది ఒక డ్యూయెట్ .

కుయిలీ , లీనాదాసులతో క్లబ్ డాన్సులో కూడా చిరంజీవి వాళ్ళిద్దరినీ రబ్బరు బొమ్మల్లాగే వంచేస్తాడు . డాన్స్ మాస్టర్ రఘురాంని మెచ్చుకోవాల్సిందే . చిరంజీవి కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసినట్లున్నారు . రేచుక్కల అందం చూస్తా తైతక్కల తాళం వేస్తా అంటూ సాగుతుంది ఆ పాట .

ఇవన్నీ శృంగార భరిత పాటలు , డాన్సులు . టైటిల్సుతో పాటు వచ్చి మరలా సినిమాలో రెండు సార్లు వచ్చే సంసారపక్ష పాట ఒక దీపం వెలిగింది చీకటిలో అనే పాట . చాలా శ్రావ్యంగా ఉంటుంది .

  • రాఘవేంద్రరావు ఈ సినిమాలో ఒక్క భక్తి రసాన్ని మినహాయించి మిగిలిన శృంగారం , హాస్యం , కరుణ , రౌద్రం , వీరము , భయానకము , భీభత్సం , అద్భుతం , శాంతం అనబడే ఎనిమిది రసాల్ని కురిపించాడు . ఒక భక్తి పాట పెడితే నవ రసభరితం అయిపోయేది .

సినిమాలో ప్రధాన ఆకర్షణ చిరంజీవి , విజయశాంతి , సుహాసిని . పోలీసు అవతారంలో విజయశాంతి మొదటి సినిమా అనుకుంటాను . ఆ యూనిఫాంలో ఫైట్లు కూడా . ఆమె పోలీసు పాప అయితే సుహాసిని లాయర్ పాప .

స్నేహితురాలు విజయశాంతి కోసం ప్రేమను త్యాగం చేస్తుంది . అతన్ని హత్యానేరం నుండి బయటపడటానికి ప్రాణాలను కూడా త్యాగం చేస్తుంది . చిరంజీవికి ఈ పాత్ర ఏముంది !? అప్పటికే రాటుతేలాడు కదా ! వెడం చేత్తో చేసేసాడు .

నా రూటే వేరు అంటూ మోహన్ బాబు కొత్త రూట్లో దర్శనమిస్తాడు . భారీ తారాగణం ఉంది . సత్యనారాయణ , రావు గోపాలరావు , జగ్గయ్య , నర్రా , చిట్టిబాబు , నిర్మలమ్మ , రాళ్ళపల్లి , సుత్తి వేలు , చలపతిరావు , రంగనాధ్ , తదితరులు నటించారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి , జొన్నవిత్తుల పాటలు ప్రేక్షకులను హుషారు చేస్తాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , మనో శ్రావ్యంగా పాడారు .

విజయన్ ఫైట్లను చిరంజీవి స్థాయిలో కంపోజ్ చేసారు . క్లైమాక్సులో లేని ఫైట్ లేదు . సినిమా చూస్తుంటే కల్కి , ప్రతిఘటన , యన్టీఆర్ రేచుక్క , ఒకటేమిటి ! చాలా సినిమాలు గుర్తుకొస్తాయి . 29 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడిన ఈ సినిమా 1988 సంక్రాంతికి బాలకృష్ణ ఇనస్పెక్టర్ ప్రతాపుతో యుధ్ధం చేసింది . ఇద్దరూ గెలుపొందారు .

ఆరోజుల్లో (ఇప్పుడు కూడా ఉందేమో) ఎవరి అభిమానులు వాళ్ళ హీరో సినిమాను దగ్గరుండి హిట్ చేయటానికి నానా కృషి చేసేవారు . Of course . అయినా ఒక్కోసారి కుదరక పోవచ్చు . ఏది ఏమయినా ఈ మంచిదొంగ ఫక్తు మసాలా సినిమా .

An excellent music , action , commercial , feel good , Chiranjeevi-mark , Raghavendra Rao-songs-picturisation entertainer . యూట్యూబులో ఉంది . చూడని సినిమా ప్రియులు తప్పక చూడవచ్చు . మళ్ళా మరచిపోతారేమో ! కన్ను కొట్టినోడె కన్నె మొగుడు 2+1 పాటను ముందు చూసేయండి .

నేను పరిచయం చేస్తున్న 1177 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!
  • అందరికీ కొత్త ఆధార్ కార్డులు..! అవసరం ఏమిటి..? ఎప్పటి నుంచి..?!
  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?
  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…
  • అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? మోడీ ఏమైనా తప్పుచేశాడా..?
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!
  • నాగార్జునా… ఈ కల్యాణ్ అనే రూడ్ కేరక్టర్‌ను బయటికి పంపించగలవా..?
  • హిడ్మా..! తెలంగాణలో రోజుకూలీగా అనామకంగా బతికాడా..? దేనికి..?!
  • ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!
  • దైవశక్తులు Vs మంత్రశక్తులు… అందరిదీ ఇదే బాట… ఇదే జానర్…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions