Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!

November 27, 2025 by M S R

.

జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితం ఏం చెప్పింది..? కేటీయార్, హరీష్‌రావుల బేస్‌లెస్ ఆరోపణల్ని, మాటల్ని జనం ఏమాత్రం విశ్వసించడం లేదనీ, పట్టించుకోవడం లేదనీ తేల్చిచెప్పింది…

ఏదో అప్పటికప్పుడు దొరికిన బురదను రేవంత్ రెడ్డిపై చల్లుదాం, కడుక్కునే తీట తనది… ఇదుగో ఇలాగే సాగుతోంది… వికారాబాద్ నేవీ రాడార్ దగ్గర నుంచి మొదలు… అనేకం… మూసీ అనగానే అదుగో లక్ష కోట్లు… హిప్టీ పారిశ్రామిక వాడల తరలింపు అనగానే ఐదు లక్షల కోట్లు… రామగుండం థర్మల్ అనగానే 50 వేల కోట్లు… మెట్రో స్వాధీనం అనగానే అదో స్కాం…

Ads

అసలు జీవోలు, నిర్ణయాలు పూర్తిగాకముందే ఎన్ని లక్షల కోట్ల స్కాములో తేల్చిపడేస్తున్నారు… ఎప్పుడైతే జుబ్లీ షాక్ తగిలిందో ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువైనట్టుంది… బయటి నుంచి కవిత కొడుతున్న దెబ్బలు సరేసరి…

నిన్న కేబినెట్‌లో నిర్ణయం ఏమిటి..? రామగుండంలో థర్మల్ ప్లాంటు ఏర్పాటు… వీలయితే పాల్వంచ, మక్తల్ ఏరియాల్లో కూడా థర్మల్ ప్లాంట్లు..! అంతే, ఇక 50 వేల కోట్ల స్కామ్ అని ముందస్తు ఆడిటింగ్ అర్జెంటుగా జరిపించేసి, చార్జి షీటు దాఖలు చేస్తున్నాడు హరీష్ రావు… ప్రతిపక్షం చేయాల్సిన పని నిఘా, అక్రమాలపై వాచ్ డాగ్ డ్యూటీ… కరెక్టు, కానీ మరీ గాలి పోగేసి ఆరోపణలు చేయడం కాదు..!



కొన్ని నిజాలు చెప్పుకుందాం… పాయింట్లవారీగా…

1) రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు… ఎన్టీపీసీకన్నా జెన్‌కో ఎక్కువ కోట్ చేస్తోంది, 30, 40 శాతం కమీషన్ల బాగోతం అట, హరీష్ మాట ఇది…

– నిజానికి రామగుండం స్థలం మాకు ఇవ్వాలని ఎన్టీపీసీ ఎప్పటి నుంచో అడుగుతోంది… జెన్‌కోకన్నా తక్కువ కోట్ చేస్తే మీకే ఇస్తాం అంటోంది ప్రభుత్వం… ఎన్టీపీసీ కూడా 30, 40 శాతం కమీషన్లు ఇస్తుందా..? హేమిటో, మరీ హరీష్ రావు కూడా ఇలా తయారయ్యాడేంటో…



2) మేం యాదాద్రి 8.63 కోట్లకు మెగావాట్ చొప్పున, భద్రాద్రి 9.74 కోట్లకు మెగావాట్ చొప్పున కట్టాం, రేవంతేమో 14 కోట్లకు మెగావాట్ కడతాడట… ఇదీ హరీష్ వాదన…

– నిజానికి బొగ్గు లేని చోట ప్లాంటు కట్టడం అంటేనే దుర్మార్గం… పిట్ హెడ్ (బొగ్గు ఉన్నచోటే) ప్లాంట్లే కరెక్టు… బొగ్గు రవాణా ఛార్జీలు ఉండవు… కానీ దామరచర్లలో ఎందుకు కట్టినట్టు కేసీయార్… కమీషన్ల కోసమేనా..? సబ్ క్రిటికల్ అనే అడ్డమైన టెక్నాలజీతో భద్రాద్రి ఎందుకు కట్టినట్టు..? కమీషన్ల కోసమేనా..? అసలు ఆ ప్లాంట్లు ఏడాదిలో ఎన్నిరోజులు మూసి ఉంటున్నాయో హరీష్‌కు తెలుసా అసలు..? కారకులు ఎవరు..? కేసీయార్..!!



3) పాల్వంచ, మక్తల్ ప్లాంట్ల పేరిట వేల కోట్ల స్కామ్… ఇది హరీష్ మాట…

– ఆలూ లేదు, చూలూ లేదు, అక్కడ థర్మల్ ప్లాంట్లు రానే రావు… అసలు ఇప్పుడు థర్మల్ యుగం కాదు, క్లీన్ అండ్ గ్రీన్ రెన్యువబుల్ ఎనర్జీ యుగం ఇది… కానీ అప్పుడే ప్లాంట్లు కట్టేసి కోట్లు కొట్టేసినట్టు చెబుతున్నాడు హరీష్ రావు… ఇవేమైనా యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లా కమీషన్ల బాగోతాలకు..!!



4) చౌక విద్యుత్తు ఇచ్చే 2400 మెగావాట్ల ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ కరెంటుకు రేవంత్ రెడ్డి మోకాలడ్డుతున్నాడట… హరీష్ ఆరోపణ…

– నిజానికి విభజన చట్టంలో చెప్పినట్టు ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల ప్లాంటు కట్టాలి… 1600 మెగావాట్లు అయిపోయింది… కానీ మిగతా 2400 మెగావాట్ల ప్లాంట్ల మీద కేసీయార్ సైలెంట్… ఎందుకు..? యాదాద్రి, భద్రాద్రి సొంత ప్లాంట్ల కమీషన్ల కోసమేనా..?



5) దామరచర్ల ప్లాంటు 95 శాతం పూర్తి చేస్తే సీఎం, భట్టి ప్రారంభిస్తున్నారు… హరీష్ విమర్శ…

– ఆ ప్లాంట్లు కేటీయార్, హరీష్ రావు, కేసీయార్ జేబుల నుంచి కాదు కదా కట్టింది… తెలంగాణ జనం సొమ్ము… కేసీయార్ కట్టాడని పడావు పెట్టలేదు, ప్రారంభిస్తున్నారు, జాతికి అంకితం చేస్తున్నారు… తప్పేముంది..? సానుకూల ధోరణి కాదా ఇది..?



6) ప్రభుత్వ పథకాల కోసం సపరేటు డిస్కమ్ పెట్టి, మిగతా రెండింటిని ప్రైవేటీకరించే కుట్ర రేవంత్ ది… ఇదీ హరీష్ ఆరోపణే…

– లేని ఆలోచనల్ని కొత్తగా క్రియేట్ చేయడమా ఇది హరీష్ బాబూ…?



7) హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ స్కాం అట… పంప్‌డ్ స్టోరేజీ స్కాం అట… బ్యాటరీ స్టోరేజీ స్కాం అట… హరీష్ రావు అంటున్నాడు…

– అంటే కొత్త టెక్నాలజీలు, అవసరాల మేరకు ప్రభుత్వం అడుగులు వేయకుండా… కేసీయార్ హయాంలోలాగే సబ్ క్రిటికల్ చీకటి కాలంలోనే ఉండిపోవాలా..? అసలు నిర్ణయాలు, విధానాలు చెప్పగానే స్కామ్స్ అయిపోయాయా..?



8) ప్రతిపక్షంగా ప్రజల తరుపున మీరు చేస్తున్న స్కాంలపై, అన్యాయాలపై ప్రశ్నిస్తే మాపై ఎంక్వైరీలు అంటున్నవు… హరీష్ విమర్శ ఇది…

– ఆల్రెడీ చత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోళ్లు, కారిడార్ ఖర్చు, యాదాద్రి కమీషన్లు, భద్రాద్రి సబ్ క్రిటికల్ బాగోతాలు, ప్రైవేటు పవర్ కొనుగోళ్ల అవినీతి మీద ఓ కమిషన్ వేశారు, రిపోర్టు కూడా వచ్చినట్టుంది… అది బయటపెడితే ఎన్ని మేడిగడ్డలు బయటికొస్తాయో చూడాలిక..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…
  • బీసీ సీట్లపై బీఆర్ఎస్ ఫేక్ ప్రాపగాండా..! నిజాలేమిటో ఓసారి చూద్దాం..!!
  • ఒకటే చెట్టు… పది పక్షులు… ఒక తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…
  • బాబోయ్ విలేకర్స్..! సొసైటీకి బెడదగా న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్థ..!!
  • ఈ విశ్వసుందరి కిరీటం ధగధగల వెనుక కొన్ని చీకటి నీడలు…!!
  • అసలు తండ్రిని నేనేనా..?! కుటుంబ వ్యవస్థనే కూల్చేసే ‘పితృత్వపరీక్షలు’..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions