.
పాకిస్థానీ ముష్కరులు ముంబై మీద చేసిన దాడిని నిన్న జాతి మొత్తం మరోసారి గుర్తుచేసుకుంది… మీడియాలో, సోషల్ మీడియాలో బోలెడు జ్ఞాపకాల కథనాలు కనిపించాయి… కానీ ఈ సందర్భంగా ఓ గొప్ప మనిషిని, మరో తుచ్చుడిని కూడా ఓసారి గుర్తుచేసుకోవాల్సి ఉంది…
ఆ గొప్ప మనిషి… నిజమైన భారతరతన్ టాటా…! నవంబర్ 26, 2008, పాకిస్థానీ ముష్కరులు దేశ ఆర్థిక రాజధాని మీద విరుచుకుపడుతున్న వేళ…, ఆ 70 ఏళ్ళ పెద్దాయన, తనని నమ్మిన, తను నమ్ముకున్న ఓ సుందర స్వప్నం కకావికాలమై పోతున్నా… ఓ మొండివాడిలా… ముంబై తాజ్ హోటల్ గోడలా…, మూడు రాత్రులు అక్కడే, ఓ రోడ్ పేవ్‌మెంట్ మీద… ఒక వ్యాపారవేత్తగా కాదు, ఒక కోటీశ్వరుడిలా కాదు, ఒక సాటి మనిషిగా, ఒక నాయకునిగా… అక్కడినుంచి కదలని క్షణం, లక్షణం…
Ads
అందుకే తను ట్రూ “భారత రతన్ “… తనను నమ్ముకున్నవాళ్లు కష్టాలలో ఉన్నప్పుడు ముందు నిలబడి ధైర్యాన్ని నింపేవాడు నిజమైన నాయకుడు ట్రూ లీడర్…

ఒకవైపు దుమ్ము ధూళి, ఇంకోవైపు తుపాకుల మోత… చుట్టూ పొగలు, దాదాపు మూడు రాత్రులు, NSG కమెండోలు హోటల్ తాజ్ ని మొత్తం తమ అధీనంలోకి తీసుకునే వరకు అక్కడే ఉన్నాడు..,
తర్వాత ఒక్క చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్టేట్మెంట్లు కూడా లేవు.,. సీదా క్షతగాత్రుల దగ్గరికి లేదా చనిపోయిన కుంటుంబాల దగ్గరికి వెళ్లాడు… టాటా గ్రూవ్ నుంచి చేతనైన సహాయం అందించాడు… ఇంకా కొన్ని కుటుంబాలకి ఇంకా అందుతూనే వుంది… బాధిత వివరాలను తన టీమ్ చేత తెప్పించుకుని… ప్రభుత్వంకన్నా ఎక్కువ అండగా నిలబడ్డాడు…
అంతటి విలువలు, విశ్వసనీయతతో టాటా గ్రూవ్ నడిపించిన గ్రేట్ రతన్ టాటా… నేడు అదే గ్రూవు టాటా ట్రస్టీ నియామకం విషయంలో పడుతున్న గొడవలు చూస్తే, పాపం, పెద్దాయన మనస్సు ఎంత కలుక్కుమంటుందో…

ఒకటీరెండు చిల్లర కేరక్టర్ల గురించి కూడా చెప్పుకోవాలి కదా… పూర్తి కంట్రాస్టు…
హోం మంత్రి శివరాజ్ పాటిల్… ఒకవైపు జాతి మొత్తం రగిలిపోతుంటే… తను మాత్రం పబ్లిక్ అపియరెన్స్‌ల కోసం పదేపదే తన బట్టలు మార్చుకున్నాడు… నీరో ఆఫ్ ఇండియా… 300 మంది ఎన్ఎస్‌జీ కమాండోలను తీసుకెళ్లాల్సిన ప్రత్యేక విమానం, ఈయన రాక కోసం చాలాసేపు ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తూ ఉండిపోయింది…
ఇదే కాదు, ఏ ఉగ్రదాడి విషయమైనా నిర్లిప్తత… నిర్లక్ష్యం… ఈ దేశం చూసిన అత్యంత బేకార్ హోం మంత్రి… దేశం మొత్తం ఛీత్కరించేసరికి యూపీఏ తనతో రాజీనామా చేయించింది… 26/11 దాడుల వల్లనే హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినా… తన ఆత్మకథలో ఈ దాడుల గురించి ప్రస్తావించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది…

మరొకడు… వాటికి తోడుగా ఇంకొకరు… పాకిస్థానీ ఉగ్రవాదుల దాడి ముగిసిన తర్వాత రోజు… నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్తో కలిసి తాజ్ హోటల్‌ను సందర్శించారు…
(తెల్లారిలేస్తే ఆర్జీవీ అనే ధూర్తుడు బోలెడు నీతులు చెబుతాడు)… ఈ దాడి తర్వాత భావోద్వేగ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి తన అధికారంతో సినిమా దర్శకుడిని, తన కుమారుడిని వెంటబెట్టుకుని హోటల్‌ను సందర్శించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి… ఇది “టెర్రర్ టూరిజం” (Terror Tourism) లా ఉందని ప్రజలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు…

రామ్ గోపాల్ వర్మ ఈ దాడి గురించి సినిమా తీయడానికి లోకేషన్ పరిశీలన (Recce) కోసమే వచ్చాడు.. సీఎం కొడుక్కి స్నేహితుడు కదా, తనతోపాటు వచ్చాడు హత్యాచారానికి గురైన ఆ హోటల్‌కు… వర్మను తీసుకురావడంలో తప్పేమీ లేదని దేశ్‌ముఖ్ సమర్థించుకున్నాడు… ఎంత తోలుమందం కేరక్టరో తెలిసింది కదా… కానీ ఈ సంఘటన తర్వాత దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది…
చివరగా…. మొదట్లో వర్మ ముంబై దాడుల మీద సినిమా తీసే ఉద్దేశం లేదని చెప్పినా, తర్వాత కాలంలో ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ (The Attacks of 26/11) అనే సినిమా తీశాడు… ఇది మనకు తెలిసిన ‘దేశ్‌ముఖ్’ పోకడల్ని మించిన తోలుమందం కేరక్టర్ కదా..!! …………… (గోపు విజయకుమార్ రెడ్డి)
Share this Article