.
సింధు తులానీ… గుర్తుందా ఈ పేరు..? హఠాత్తుగా ఆంధ్రా కింగ్ తాలూక సినిమాలో కనిపించి ఆశ్చర్యపరిచింది… అసలు ఇన్నాళ్లు ఏమైపోయింది… 2005 నుంచి 2008 వరకు ఏటా ఆరేడు సినిమాలు చేసిన పాపులర్ హీరోయిన్ ఆమె…
నిజానికి పాతికేళ్ల క్రితం తెరంగేట్రం ఆమెది… మొహబ్బతే అని ఏదో హిందీ సీనిమా… తరువాత 2003లో ఐతే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినిమాలో ఎంట్రీ… కల్యాణ్ రామ్ అతనొక్కడేతో, తమిళంలో శింబు మన్మథతో కుదురుకుంది…
Ads
చిత్రమైన కెరీర్… అంత పాపులర్ ముంబై హీరోయిన్‌కు హఠాత్తుగా అవకాశాలు రాకుండా పోయాయి… 2009 తరువాత అడపా దడపా ఏవో చిన్న చిన్న వేషాలు వేస్తోంది తప్ప… కంటిన్యుటీ లేదు… మధ్యలో బాగా గ్యాప్స్… 2017 చిత్రాంగద తరువాత పూర్తిగా కనిపించలేదు ఇక… సన్నాఫ్ సత్యమూర్తి, ఇష్క్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో మాత్రం కనిపించింది…
ఆమె వయస్సు 42… హఠాత్తుగా ఆంధ్రా కింగ్ తాలూక సినిమాలో ఉపేంద్ర భార్యగా ఓ చిన్న పాత్రలో కనిపించింది… ఎందుకు ఆమె పట్ల ఆసక్తి అంటే… అప్పుడెప్పుడో తెలుగులో ఆమెకు బాగా అవకాశాలు వస్తున్న టైంలో… 2008లో… బతుకమ్మ సినిమా చేసింది… అలా తెలంగాణ ప్రేక్షకులకు కనెక్టయింది…
ఎండల్లో తిరుగుతూ కాయకష్టం చేసుకునే పాత్రలో సహజంగా కనిపించడానికి ఆమె ఫెయిర్ కలర్‌ను మేకప్పుతో కాస్త డార్క్ షేడ్‌లోకి తీసుకొచ్చారు… (ఫుల్లు మేకప్పుతో హీరోయిన్ల కలర్ ఫెయిర్‌గా చూపించే ధోరణికి ఇది రివర్స్)… ఆమె కూడా ఓ తెలంగాణ పడతిగా చాలా నేచురల్‌గా నటించి మెప్పించింది… సాదాసీదా బట్టల్లో , తెలంగాణ పాటల్లో మెరిసింది…

మరి అలాంటి గిరాకీ ఉన్న నటి ఎందుకు తెరకు దూరమైంది అలా..?
వ్యక్తిగత జీవితం/కుటుంబం…: ఆమె చేతన్ అనే సాఫ్ట్‌వేర్ వ్యక్తిని వివాహం చేసుకుంది… వారికి ఒక కుమార్తె (శ్వేత)… ప్రస్తుతం ఆమె ఫ్యామిలీతో కలిసి ముంబైలో స్థిరపడి, తన కుమార్తె ఆలనాపాలనలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది…
రీ-ఎంట్రీ & పాత్రల మార్పు…: హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తరువాత, ఆమె “సన్నాఫ్ సత్యమూర్తి” వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా (హీరో వదిన వంటి) ముఖ్యమైన పాత్రలలో కనిపించింది… అయితే, 2017 తర్వాత ఆమె మరే సినిమాలోనూ కనిపించలేదు…
ఆంధ్రా కింగ్ తాలూక సినిమా నిర్మాతలకు, దర్శకుడికి హఠాత్తుగా ఈమె ఎలా కనిపించింది..? ఆ పాత్రకు ఆమే కావలని ఎందుకు అనిపించిందో కూడా తెలియదు… సినిమా ప్రమోషన్లకు కూడా ఆమె రాలేదు… చాలామంది రివ్యూయర్లకు ఆమె ఎవరో కూడా తెలియదు, కనీసం ఆమె పేరు కూడా రాయలేదు..!!
Share this Article