.
దశాబ్దాల తరబడీ పోరాడి, ఎందరో ప్రాణత్యాగాలు చేసి… తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పదేళ్ల కాలం ‘అగడు పడ్డట్టు’ (ఆబగా) రాజకీయ నాయకులు, ప్రత్యేకించి బీఆర్ఎస్ (పాత టీఆర్ఎస్) నేతలు ఎలా దోచుకుతిన్నారో తెలిసేకొద్దీ ఆశ్చర్యం, ఏవగింపు ఎట్సెట్రా చాలా భావాలు ముప్పిరిగొంటాయి…
పారిశ్రామికవాడల తరలింపుకి సంబంధించి ఆరున్నర లక్షల కోట్ల కుంభకోణానికి ఈ ప్రభుత్వం తెర తీసిందని ఎప్పటిలాగే బీఆర్ఎస్ (ఇప్పుడు తోడుగా బీజేపీ… ప్రస్తుతం రెండూ రహస్య దోస్తులే కదా) ఆరోపణలు చేస్తోంది… అవును, ఎప్పటిలాగే గాలి పోగేసి టన్నుల కొద్దీ బురద జల్లడం… అసలు జీవో రాగానే స్కామ్ జరిగిపోయినట్టుగా..!!
Ads
ఆరున్నర లక్షల కోెట్ల కుంభకోణం అంటే… అదీ ఆలూలేదు, చూలూ లేకుండానే…! అదేమైనా హరీష్ రావు, కేటీయార్ ప్రెస్‌మీట్లు పెట్టినంత అలవోక యవ్వారామా..?! అసలు పారిశ్రామికవాడల తరలింపు మీద ప్రభుత్వం జారీ చేసిన హిల్ట్‌పీ (“Hyderabad Industrial Lands Transformation Policy (HILTP)” వివరాలు తెలుసుకుంటూ ఉంటే… బీఆర్ఎస్ నేతల ఫ్రస్ట్రేషన్, పాత బాగోతాలు, వాళ్ల ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరించక పోయి ఉంటే వాళ్లు చేయాలనుకున్న దారుణ భూదందాల ప్లాన్లు తెలుస్తున్నాయి…
సరే, వివరాల్లో వెళ్దాం… విశ్వనగరాన్ని లివబుల్ సిటీగా, కాలుష్యరహితంగా మార్చాలంటే పరిశ్రమల్ని బయటికి పంపించాలి… అదీ ఓఆర్ఆర్ బయటకు… రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అనగానే పరిశ్రమలు పోవు… వివిధ పారిశ్రామికవాడల్ని పూర్తిగా తరలించాలంటే, ఓఆర్ఆర్ బయట భూములు ఇవ్వాలి… ఇదంతా దేనికి..? నగరం మధ్యలో బిజీగా మారిన పారిశ్రామికవాడల భూముల మల్టీయూజ్‌కు పర్మిషన్ ఇస్తే… ఆ ఓనర్లు అమ్ముకుంటారు లేదా తామే డెవలప్ చేసుకుంటారు… ఆయా ఏరియాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది…
అందుకని ప్రభుత్వం వాళ్లకు మల్టీ యూజ్ పర్మిషన్లు ఇవ్వడానికి ఓ విధానం ప్రకటించింది… రోడ్డు వెడల్పును బట్టి 30 నుంచి 50 శాతం ఫీజు కట్టాలని నిర్దేశించింది… అదీ ఎస్ఆర్ఓ విలువ మీద…! ఆ డబ్బును ఆ ఏరియాల్లో మౌలిక వసతుల కోసమే ఖర్చు చేస్తారు… ఇది కేబినెట్ డెసిషన్…

జీవోలోనే ఏయే ఇండస్ట్రియల్ ఏరియాలో ఎంత భూమి ఉందో, అందులో ప్లాటింగ్ ఎంతో, ఐఐసీ రేటు ఎంతో, ఎస్ఆర్ఓ రేటు ఎంతో పేర్కొన్నారు… నిజానికి ఇక్కడ బయటికి రావల్సింది గత బీఆర్ఎస్ హయాంలో ఎలా భూముల మీద పడి, అక్రమ దందాలకు దిగారో… అవే జనానికి తెలియాల్సింది…
ఎస్, అవన్నీ బయటపెడతాను అంటున్నాడు డిప్యూటీ సీఎం భట్టి… ఎందుకంటే..? గతంలోనే బీఆర్ఎస్ ప్రత్యేకంగా, సెలెక్టివ్ జీవోలు ఇచ్చింది… వాటిని గోప్యంగా ఉంచారు… ఓ స్ట్రెయిట్ పాలసీ గాకుండా… తమకు లబ్ధి చేకూర్చే డీల్స్ కుదుర్చుకుని, ఆ ల్యాండ్స్‌కే కన్వర్షన్స్ ఇస్తూ పోయారు… మళ్లీ వాళ్ల ప్రభుత్వం వస్తే ఈ దందా మరింత విపరీతంగా జరిగేది… గ్రిడ్ పాలసీ పేరుతో బీఆర్ఎస్ దందా మీద కొన్ని పత్రికల్లో వస్తున్న కొన్ని ఉదాహరణలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి…
- సారాంశం ఏమిటంటే..? ప్లాన్ ప్రకారమే పెద్ద ఎత్తున ఒప్పందాలు, హైరైజ్ బిల్డింగ్స్ కు అనుమతులు, బాలానగర్ లో ఓ మాజీ ఎమ్మెల్యేకు 8 ఎకరాలు, ఉప్పల్ లో మరో మాజీకి 4 ఎకరాలు, హఫీజ్‌పేట ఏరియాలో ఓ నేతకు 6 ఎకరాలు, ఆరాంఘర్ కాటేదాన్లో బినామీకి 5 ఎకరాలు, మౌలాలీలో 4 ఎకరాలు… నిజానిజాలు, ఇతర దందా నేతల యవ్వారాలను భట్టి బయటపెట్టాలి లేదా ఆరోపణల తీవ్రత దృష్ట్యా సీఎం బయటపెట్టాలి… బీఆర్ఎస్ ప్రభుత్వ పాత బాగోతాల్ని..!!
హైదరాబాద్లో ఐటీ కంపెనీలు వెస్ట్రన్ కారిడార్ (మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, అమీన్ పూర్, కూకట్ పల్లి)లో మాత్రమే ఉండేవి… మిగతా ఏరియాల్లో ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేవు… అందుకని కోర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాల్లో సైతం ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రిడ్ పాలసీ (గ్రోత్ ఇన్ డిసపరేషన్) తీసుకొచ్చారు…
- ఆయా ఏరియాల్లోని పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోకి తరలించేందుకు అవకాశం కల్పించడం ఈ పాలసీ ఉద్దేశం… ఇంకేం… గులాబీ లీడర్లు, బంధువులు, బినామీలు రంగంలోకి దిగిపోయారు… కన్వర్షన్స్ జీవోలు ఇప్పించుకోవడం… హైరైజ్ బిల్డింగులకు పర్మిషన్లు… దాదాపు 450 ఎకరాల మేరకు ఇలా పెద్ద తలల చేతుల్లోకి వెళ్లిపోయాయట…
2023 అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు పరిశ్రమల శాఖ మూడు జీవోలను రహస్యంగా విడుదల చేసింది… దాని ప్రకారం బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాలోని 30 ఎకరాలు, అజామాబాద్ లోని 136 ఎకరాలు, హఫీజ్ పేట్ లోని 14.32 ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… రహస్యంగా ఆ భూముల్ని చెరపట్టిన బీఆర్ఎస్ నేతలది స్కామా..? స్ట్రెయిట్ పాలసీ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది స్కామా..? జనానికి చెబితేనే మంచిది..!
ఇంకా చాలా ప్లాన్లు వేసి పెట్టారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మళ్లీ దక్కకపో వడంతో గులాబీ లీడర్ల ప్లాన్ బెడిసి కొట్టిందనే చర్చ ఉంది… ‘హైదరాబాద్ బీఆర్ఎస్ భూముల దందా’ మీద కనీసం రెండుమూడు కమిషన్లు వేస్తే గానీ మొత్తం నిజాలు బయటకు రావేమో… ఎవరి పాలైంది తెలంగాణ…!?
Share this Article