.
అన్నీ నేనే కనిపెట్టాను… నేనే ఈ చరాచర జగత్తును క్రియేట్ చేసినవాడిని అని ఏవేవో మాట్లాడుతుంటాడు కదా… పాపం, అని మనం నవ్వుకుంటాం, జాలిపడతాం కానీ… ఆయన మాటకూ ప్రపంచవ్యాప్తంగా విలువ ఉన్నట్టుంది చూడబోతే…
ఆమధ్య ఏదో మీటింగు పెట్టేసి… హైదరాబాద్ కట్టాను, దాని పక్కన ముస్లింల అభ్యున్నతి కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు కట్టాను, అంతెందుకు..? బిర్యానీని కూడా వాళ్ల కోసమే ప్రమోట్ చేశాను అన్నాడా లేదా…
Ads
వెంఠనే ఫుడ్ ర్యాంకింగుల వరల్డ్ సైటు టేస్ట్ అట్లాస్ అందుకుంది… అంత పెద్దాయన ప్రమోట్ చేశాడు కదా, మనం కూడా గుర్తించకపోతే బాగుండదు, మర్యాద అనుకుంది… అందుకని వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్‌లో టాప్ 10 హైదరాబాదీ బిర్యానీయే అని జాబితాలో ర్యాంకు ప్రకటించేసింది…

నిజానికి ఫుడ్డుకు మతానికీ సంబంధం ఉంటుందా..? ఏమో, గొప్ప ప్రవచనకారుడు చంద్రబాబే చెప్పాలి… ఆఫ్టరాల్ ఈ గరికపాటి ఏ పాటి..? ఈ చాగంటి ఏ పాటి..? వాస్తవంగా పేరుకు ఇది హైదరాబాద్ బిర్యానీ కానీ దీని మూలాలు పర్షియా (నేటి ఇరాన్)…

మొఘలులు, ముస్లిం పాలకుల ద్వారా ఇక్కడికి చేరింది… వాళ్ల పండుగల్లో, ఫంక్షన్లలో బిర్యానీ ఓ ఆహార సంస్కృతికి ప్రతీకగా నిలిచేది… ఇప్పుడూ అంతే వండే విధానాన్ని బట్టి హైదరాబాదీ చెఫ్స్ బిర్యానీకి ఇంత పాపులారిటీ సంపాదించి పెట్టారు… పాకశాస్త్రంలో, పర్టిక్యులర్ సువాసన, సుమధుర మసాలా వంటల్లో నిపుణులు హైదరాబాదీ చెఫ్స్… పైగా ముస్లిం పాలకులు భోజనప్రియులు కూడా…

ప్రపంచవ్యాప్తంగా చెఫ్స్, ఫుడ్ రివ్యూయర్స్ అభిప్రాయాలను బట్టి బిర్యానీకి స్థానం కల్పించినట్టు టేస్ట్ అట్లస్ చెబుతోంది… ప్చ్, చంద్రబాబు వరల్డ్ ఎకనమిక్ ఫోరం దగ్గర కూడా కొత్తిమిర రైస్ పాపులర్ చేశాడు గానీ అక్కడికి టేస్ట్ అట్లాస్ ప్రతినిధులను పిలవడం మరిచిపోయాడు… లేకపోతే టాప్ 50 లో అదీ చేర్చేవారు…

అంతెందుకు..? చంద్రబాబు గారు, ఆయన మామ గారు, ఆయన వియ్యంకుడు గారు తెలంగాణకు వరి అన్నం తినడం నేర్పించారు కదా, పాపం, తెలంగాణ ఫేమస్ పబ్బియ్యం డిష్‌ను బిర్యానీలాగా ప్రమోట్ చేయడం మరిచిపోయాడు… లేకపోతే అదీ టాప్50లోకి గ్యారంటీగా వచ్చి ఉండేది…

సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ప్రొబయాటిక్స్ పుష్కలంగా దొరికే హెల్దీ, రిచ్ న్యూట్రిషియస్ చద్దన్నం గురించి అసలు ఈ రైస్ వెరయిటీల్లో ప్రస్తావనే లేదు… రైస్ అంటేనే ఆసియా, తూర్పు దేశాల ఫుడ్… అనేక దేశాల్లో అనేకరకాల డిషెస్ ఉంటాయి…

కానీ ఇండియాలో రైస్ వంటకాల్లో వైవిధ్యం ఎక్కువ… బిసిబెళిబాత్, రకరకాల పులిహోర, కర్డ్ రైస్ (దధ్యోజనం), పొంగల్… చెబుతూ పోతే వందల రైస్ రకాలు… కానీ కేవలం బిర్యానీకే స్థానం దక్కింది… అది సదరు టేస్ట్ అట్లస్ తీసుకున్న ప్రామాణికాల ఎంపికలోనే జరిగిన తప్పిదం..!! బాబు గారూ, ఈసారి కాస్త మా పబ్బియ్యాన్ని ప్రమోట్ చేయండి ప్లీజ్..!! పోనీ, చద్దన్నం..!!!
Share this Article