‘‘ఫోఫోవయ్యా, ఉద్దరించావు గానీ… మధ్యలోనే చెప్పాపెట్టకుండా మాయమవుతావు,.. పట్టించుకోవు… అందుకే బిగ్‌బాస్ రేటింగ్స్ ఇలా తగలడ్డాయి’’ అని బిగ్‌బాస్ నిర్మాతలు హోస్టు నాగార్జునను పరోక్షంగా దెప్పిపొడిస్తే ఎలా ఉంటుంది…?
‘‘ఎహె, ఊరుకో… తలాతోకా తెలియని టీంను పెట్టి, జనమెరుగని కంటెస్టెంట్లను చీప్ రేట్లకు పట్టుకొచ్చి, సీజన్ మొత్తాన్ని నాశనం చేసింది మీరు… నడుమ నా ఇజ్జత్ పోయింది… మళ్లీ మాట్లాడితే స్టూడియో బయటికి నెట్టించేస్తాను…’’ నాగార్జున సీరియస్ అయితే ఎలా ఉంటుంది..?
జస్ట్, ఓసారి థింక్ చేయండి… కల్పనా, నిజమా వదిలేయండి… కానీ జరుగుతున్నది మాత్రం దాదాపుగా ఇదే… నాగార్జున మాటిమాటికీ 9.5 కోట్లు, వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని ఎన్ని గప్పాలు కొట్టుకున్నా సరే… ఈ షో నిర్మాతలు Endemol Shine India వాడికి వైరాగ్యం వచ్చినట్టుంది… ఇక చాప చుట్టేస్తున్నాడు… తొక్కలో రేటింగ్స్ ఇక పెరగవు, షో లేవదు అని తీర్మానించేసుకున్నట్టున్నాడు…
Ads
ఇక రెండుమూడు వారాలేగా… చూసేవాడు చూస్తాడు, లేకపోతే లేదు… ఇప్పుడు ఇక ఉద్దరించబడేది ఏమీ లేదు అని ఫిక్సయిపోయాడు… స్టార్ మాటీవీ వాడిదీ అదే ఫీలింగు… దాంతో షో టైమును రాత్రి 9.30 గంటల నుంచి మార్చిపారేశారు… ఇకపై అది 10 గంటలకు ప్రసారం అవుతుంది… చూడాలనే తీట ఉన్నవాడు చూస్తాడు… లేదంటే లేదు… అంతే…
అసలు 9.30 గంటల టైమ్ అనేదే టీవీలకు సంబంధించి ఆడ్ టైమ్… ఇక అరగంట ముందుకు జరపడం అంటే… అనగా 10 గంటలకు మార్చడం అంటే… ఈ షో మీద మాకు కూడా ఇంట్రస్టు పోయిందోచ్ అని చెప్పేయడమే… ప్చ్, ఫాఫం నాగార్జున… ఫాఫం సీజన్-4… చివరకు దాని దుస్థితి అదీ… ఇప్పటికీ షో స్పానర్సర్లు పంకజ కస్తూరి బ్రీత్ ఈజీ, స్కంధాంశి, ఒప్పో తాలూకు స్పెషల్ యాడ్ స్కిట్స్ కూడా చేయించేసి వదిలేశారు… ఇక ఏదో ఫినాలె వరకూ నెట్టుకొస్తారు… వీకెండ్ షోలు మాత్రం సేమ్ 9 గంటలకు ప్రసారం చేస్తారు… ఇదీ కథ… ఇక్కడ ఓసారి సీన్ కట్ చేయండి…
వంటలక్క తెలుసు కదా… కార్తీకదీపం… మధ్యలో పరిటాల నిరుపమ్ దెబ్బకు కాస్త తేడా కొట్టింది… సీరియల్ కూడా పరమ బోరింగుగా మారింది… దిక్కూమొక్కూలేని కథనంతో ఉసూరుమనిపిస్తోంది… ఏదో స్టార్‌మాటీవీ వాడికి ఈ బార్క్ మాయామర్మాల్లో కాస్త పట్టుంది కాబట్టి ఏదో రేటింగ్స్‌లో నెట్టుకొస్తున్నట్టున్నాడు… కానీ జనంలో ఇంట్రస్టు పోయింది… హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ కూడా ఏదో సినిమా ప్రయత్నాల్లో పడింది… సో, చాప చుట్టేసే రోజులు దగ్గరపడ్డయ్… బహుశా డిసెంబరు చివరికల్లా గుమ్మడికాయ కొట్టేస్తారేమో…
అందుకే వదినమ్మను లేదా గృహలక్ష్మిని పైకి లేపే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు స్టార్ మాటీవీ వాడు… ఇక వంటలక్క ప్రేమిని ప్రేమించడం మానేయండి… ఇప్పుడిక సుజిత లేదా కస్తూరి… వాటికి పంపింగ్ కార్యక్రమం ఉండబోతోంది… వదినమ్మ సీరియల్‌ను ప్రత్యేకంగా పైకిలేపే కసరత్తు ఆరంభమైంది… మొదట్లో మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేది, దాన్ని సాయంత్రం ఏడుకు మార్చారు… ఇప్పుడు బిగ్‌బాస్ స్లాటులోకి… అంటే రాత్రి 9.30కు మార్చనున్నారు… వచ్చే సోమవారం నుంచి ఈ మార్పులు…
మరి వదినమ్మ స్లాటులోకి ఎవరు అంటారా..? గుప్పెడంత మనసు అని ఓ కొత్త సీరియల్… దాన్ని తీసుకొస్తున్నారు… రాబోయే రోజుల్లో ఇక స్టార్ మాటీవీ బార్క్ రేటింగుల్లో వంటలక్క టాప్ ప్లేసులో ఉండబోవడం లేదు… వదినమ్మ లేదా గృహలక్ష్మి… మరీ తిక్కలేస్తే గుప్పెడంత మనసు… బార్క్ మీద పట్టుంటే ఏదైనా చేయొచ్చు… మరి బిగ్‌బాస్ రేటింగ్స్ విషయంలో ఈ తెలివి ఎక్కడ పోయింది అంటారా..? అసలు బొత్తిగా సరుకులోనే నాణ్యత లేనిది ఎంత ప్రమోట్ చేసి ఏం లాభం చెప్పండి…!?
Share this Article