Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. అందుకే రేవంత్ రెడ్డి ఓ డిఫరెంట్ లీడర్… ఎందుకు, ఎలా అంటే…

December 1, 2025 by M S R

.

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి… ఈ పేరు ఇప్పుడు దేశంలో బహుళ ప్రచారంలోకి వస్తోంది… ఎందుకు..? తనను హైదరాబాద్ ఆహ్వానించి, ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడించనుంది తెలంగాణ ప్రభుత్వం..!

స్వతహాగా ఫుట్‌బాల్ ప్రేమికుడు, స్వయంగా ఆడగల రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్‌బాల్ ఆడతాడు అనే వార్తలు చదవగానే… గుర్తొచ్చేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తద్వారా వచ్చే అదనపు విలువ… ప్లస్ దీనికి కంట్రాస్టుగా కేటీయార్ మార్క్ ఫార్ములా వన్ అక్రమాలు… ఫార్ములా రేస్ పేరిట నడినగరంలో పోటీలు పెట్టి కొన్ని రోజులపాటు నగర ప్రజలకు ట్రాఫిక్ చుక్కలు చూపించాడు…

Ads

క్విడ్ ప్రోకో... అక్రమ చెల్లింపులు... మనీలాండరింగులు.,. అదొక స్కామ్... అదొక చీకటి ఎపిసోడ్...

ఈ అర్జెంటీనా కెరటం మొదట ఇండియాలోని మూడు నగరాల పర్యటనకు రావాలనేది ప్లాన్… ఫుట్‌బాల్ ఆటకు పాపులరైన కోల్‌కతా, కొచ్చి ప్లస్ అహ్మదాబాద్… తరువాత అది కొచ్చి నుంచి ముంబైకి… అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి మారింది…

గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రపంచవ్యాప్త ప్రచారం, బ్రాండ్ ఇమేజ్ కోరుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పర్యటనలో హైదరాబాద్‌ను కూడా చేర్పించింది… స్వతహాగా ఫుట్‌బాల్ ఆటను ప్రేమించే రేవంత్ రెడ్డి ఈ పర్యటనను గుర్తుంచుకునేలా ప్లాన్ చేయించాడు… ఎలా అంటే..?

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ 7 వర్సెస్ రేవంత్ 7… ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్… రేవంత్ తనే తన జట్టుకు లీడర్… ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జట్టుకు…! అదీ 56 ఏళ్ల వయస్సులో..!! తద్వారా ఈ మ్యాచుకు మరింత అట్రాక్షన్ ప్లస్ ప్రభుత్వ విద్యార్థుల్లో కొత్త ధీమాను, కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపనుంది… సీఎం రేవంత్ మెస్సీతో మ్యాచ్ కోసం బిజీ షెడ్యూల్లోనూ రాత్రి పూట ప్రాక్టీస్ చేస్తున్నాడు…

  • ఈ ఆటకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే..? ప్రస్తుతం దేశమంతా ప్రేమించే… కాదు, క్రికెట్ ప్రపంచమంతా ప్రేమించే విరాట్ కోహ్లి, శుభమన్ గిల్‌తోపాటు హైదరాబాద్ వచ్చి మెస్సీకి జత కలవబోతున్నారు…

ఎగ్జిబిషన్ మ్యాచ్ అనంతరం మెస్సీకి సన్మానం, తన కోసం ఓ సంగీత విభావరి కూడా..! నిజానికి ఇవి కావు ఆకట్టుకునే వివరాలు… కాస్త కాలంలో వెనక్కి వెళ్తే…

అందరమూ ఇండియాలో ఫుట్‌బాట్ ఆట అంటే… కేవలం కేరళ, బెంగాల్ అనుకుంటారు… కానీ ఒకప్పుడు హైదరాబాద్ ఫేమస్… మెస్సీ రాకతో మళ్లీ హైదరాబాద్ తన ఫుట్‌బాల్ గత వైభవాన్ని పట్టాలెక్కించుకునే ఓ అరుదైన అవకాశం ఇది…

  • 1950ల నుంచి 1970ల వరకు హైదరాబాద్ లోని ఫుట్బాల్ అంటే దేశవ్యాప్తంగా ఒక ఉత్సాహం ఉండేది… విక్టర్ అమల్రాజ్, తులసీదాస్ బలరామ్, సయ్యద్ నయీముద్దీన్ వంటి దిగ్గజాలు ఈ గడ్డ నుంచే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు…
  • ఏకంగా 14 మంది ఒలింపియన్లు 21 మంది అంతర్జాతీయ క్రీడాకారులను భారత ఫుట్‌బాల్‌కు అందించింది ఈ నగరం…, ఒకప్పుడు కోల్‌కత్తా దిగ్గజాలైన ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది…

ఆ స్వర్ణయుగం కాలక్రమేణా మరుగున పడిపోయినా, మెస్సీ రాక ఇప్పుడు ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తోంది… ప్రపంచ ఫుట్‌‌బాల్ క్రీడా చరిత్రలోనే అత్యున్నత క్రీడాకారుడిగా పేరొందిన మెస్సీని…|తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047 సదస్సుకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి…

ఈ మెస్సీ పర్యటనతో హైదరాబాద్‌ను కేవలం సాంస్క తిక, ఐటీ హబ్‌గానే కాకుండా, భవిష్యత్తులో దేశంలోనే ప్రధాన క్రీడా -ఆర్థిక హబ్‌గా నిలబెట్టేందుకు తొలి అడుగు పడబోతుంది… ఎలాగూ రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీలో ఓ స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా రాబోతోంది కూడా..!

లియోనల్ మెస్సీ హైదరాబాద్ రావడం అనేది కేవలం ఒక ప్రచార కార్యక్రమం మాత్రమే కాదు… తెలంగాణలోని ఫుట్‌బాల్ క్రీడకు పునరుజ్జీవనాన్ని అందించే ఒక ఉత్ప్రేరకం అనీ చెప్పవచ్చు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సంజన గల్రానీ..! నాగార్జుననూ, బిగ్‌బాస్‌నూ కలిపి ఈడ్చికొట్టింది..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ఓ డిఫరెంట్ లీడర్… ఎందుకు, ఎలా అంటే…
  • పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…
  • నాగదుర్గ… పేరుగల్ల పెద్దిరెడ్డి… మరో కొత్త వీడియో వైరల్… బాగుంది…
  • సర్పంచ్..! సొంత ఖర్చులు, అప్పులు… ఐనా ఆ పదవి విలువే వేరు…
  • చిరంజీవి నటచరిత్రలో కలికితురాయి… జనం మాత్రం మెచ్చలేదు…
  • Born Hungry…! తన ‘చెత్తకుండీ’ మూలాలకై ఓ స్టార్ చెఫ్ అన్వేషణ..!!
  • స్వార్థం కాదు… అజ్ఞానంతోనే సైబర్ క్రైమ్ బాధితులుగా మారేది…
  • వస్తున్నారు గ్రహాంతర జీవులు… అదుగో, వస్తున్నది వాళ్ల వ్యోమ నౌకేనా…
  • అసలు ఈ కుసంస్కారిని ఫంక్షన్లకు ఎందుకు పిలుస్తున్నారు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions