Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమిటీ ఈ భూతశుద్ధి..! సమంత- రాజ్ పెళ్లి క్రతువు అసలు విశేషాలు..!!

December 2, 2025 by M S R

.

సమంత- రాజ్ నిడుమూరు వివాహం మీద పెద్ద విశ్లేషణలు అవసరం లేదు… ఇద్దరూ వారి పాత సహచరులకు విడాకులు ఇచ్చారు… కొన్నాళ్లుగా లవ్ ట్రాకులో ఉన్నారు… ఎక్కడో మొదలైన పరిచయం, వెబ్ సీరీస్‌లు, సహ నిర్మాణ భాగస్వామ్యాలతో ప్రణయం దాకా వెళ్లి… రెండేళ్లుగా రిలేషన్‌లోనే ఉండి, ఇప్పుడిక అధికారికంగానే పెళ్లి చేసుకున్నారు…

అనారోగ్యం, సంసార విచ్ఛిన్నం, రాజకీయ కువిమర్శల బాధితురాలు సమంత పట్ల నెగెటివిటీ కూడా అవసరం లేదు ఇప్పుడు..! కానీ ఆమె పెళ్లి వార్తల్లో కాస్త ఆకర్షించింది ఆ పెళ్లి జరిగిన విధానం… ఎవరెవరో సెలబ్రిటీలలాగా పెళ్లిని అట్టహాసంగా, ఆడంబరంగా చేసుకుని, ఆ వీడియోలను, ఫోటోలను కూడా అమ్ముకోలేదు.,. సంతోషం…

Ads

ఇంతకీ ఆ పెళ్లి ఎక్కడ జరిగింది..? నిరాడంబరంగా ఈషా ఫౌండేషన్‌కు చెందిన ఒక యోగా సెంటర్‌లో ( కోయంబత్తూరు, లింగభైరవి ఆలయంలో)  భూతశుద్ధి వివాహ క్రతువు (Bhuta Shuddhi Vivah) పద్ధతిలో జరిగింది… ఇది నిజంగా ఒక అరుదైన,  విశిష్టమైన యోగ సంప్రదాయ వివాహ పద్ధతి…

samantha raj

ముందుగా ఓ నిజం… భూతశుద్ధి అనేది ఈషా వాళ్లు బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చే ఓ యోగా పద్ధతి… హఠయోగం… దీనికి అనుబంధంగా ఈ వివాహ క్రతువును కూడా చేర్చారు… ఈ తంతు కూడా ఓ విశిష్ట పద్ధతి… ఆ ఫోటోలను, ఆ తంతును పెద్దగా ఈషా ఫౌండేషన్ వెల్లడించదు… గోప్యతను మెయింటెయిన్ చేస్తుంది… సమంత- రాజ్ పెళ్లి క్రతువు ఫోటోలు కూడా బయటికి రాలేదు, సమంత ఏదో దండం పెడుతున్న ఒక ఫోటో తప్ప…

ఈషా వాళ్ల లిటరేచర్‌ను బట్టి… ఇది సాధారణ వివాహ తంతుకు భిన్నంగా…, భూతశుద్ధి వివాహం అనేది దంపతుల మధ్య లోతైన ఆధ్యాత్మిక, శారీరక అనుబంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన ఒక పురాతన యోగ ప్రక్రియ…

భూతశుద్ధి అంటే ఏమిటి?

భూత అంటే పంచభూతాలు (5 elements) – భూమి (Earth), జలం (Water), అగ్ని (Fire), వాయువు (Air), మరియు ఆకాశం (Space)… శుద్ధి అంటే శుద్ధి చేయడం లేదా శుభ్రం చేయడం…

భూతశుద్ధి అనేది మనిషి యొక్క శరీరం, మనస్సు దేనితో నిర్మితమై ఉన్నాయో, ఆ పంచభూతాలను శుద్ధి చేసి, వాటిని విశ్వంలోని మూలకాలతో సమన్వయం చేసే ఒక ప్రాథమిక యోగ సాధన…

మనిషి శరీరం, మనస్సు, శక్తి వ్యవస్థ (Energy System) ఈ ఐదు మూలకారకాలతోనే ఏర్పడతాయి… వీటిలో ఏర్పడే అశుద్ధత, భౌతిక, మానసిక రుగ్మతలకు దారితీస్తుందని యోగ సంప్రదాయం చెబుతుంది…

భూతశుద్ధి వివాహంలోని ప్రత్యేకత ఏమిటి?

సమంత- రాజ్ వివాహం విషయానికి వస్తే, భూతశుద్ధి క్రతువును వివాహ రూపంలో నిర్వహించడం వల్ల ఈ  అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి…

  • పంచభూతాల సాక్షిగా…: ఈ వివాహం కేవలం సాంఘిక లేదా చట్టపరమైన ఒప్పందం కాకుండా, ప్రకృతిలోని ఐదు మూలకాల సాక్షిగా దంపతులను ఏకం చేస్తుంది…

  • లోతైన అనుబంధం…: ఇది కేవలం ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అంశాలకే పరిమితం కాకుండా, దంపతుల మధ్య శక్తిపరంగా (energetically), ఆధ్యాత్మికంగా లోతైన, దృఢమైన బంధాన్ని ఏర్పరుస్తుంది…

  • సామరస్యం- శ్రేయస్సు… భూతశుద్ధి ద్వారా శుద్ధి చేయబడిన శక్తి వ్యవస్థలు, దంపతుల దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు (well-being), ఆధ్యాత్మిక పరిపూర్ణత వెల్లివిరిసేలా సహాయపడతాయని నమ్ముతారు…

  • నిరాడంబరం…: ఇది సాధారణంగా ఆడంబరానికి దూరంగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరుగుతుంది…

  • పవిత్ర స్థలంలో…: ఈ క్రతువును లింగ భైరవి ఆలయాల్లో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన కొన్ని పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే నిర్వహిస్తారు…

  • సమయం…: ఈ వివాహ క్రతువును తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో (Dawn/Early Morning) లేదా సంధ్యాసమయంలో నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది…

పంచభూత సాక్ష్యం….

సాధారణంగా హిందూ వివాహంలో అగ్నిని ప్రధాన సాక్షిగా పరిగణిస్తారు… కానీ ఈ భూతశుద్ధి వివాహంలో, పంచభూతాలన్నీ (భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం) సాక్షులుగా పరిగణించబడతాయి… ప్రధాన ఆచారాలు…: వివాహ వేదిక వద్ద భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి… ఈ ఐదు మూల కారకాలకు దంపతులు పూజలు, అర్పణలు చేస్తారు…

bhootha shuddhi

మంత్రోచ్చారణ- ధ్యానం

  • సాధారణంగా జరిగే వేద మంత్రోచ్చారణతో పాటు, ఈ తంతులో యోగా మంత్రాలు, కొన్ని ధ్వని ప్రక్రియలు (Sound processes) ఉంటాయి…
  • దంపతులు కలిసి కొన్ని ప్రత్యేక ధ్యాన ప్రక్రియలు చేస్తారు, ఇది వారిద్దరి శక్తి క్షేత్రాలను (Energy Fields) ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడానికి సహాయపడుతుంది…

 

  • దీనిని ‘గణ క్రియ’ లేదా ‘బంధన క్రియ’ లాంటి ప్రత్యేక దీక్షా రూపంలో నిర్వహిస్తారు…
  • ఇది వారిద్దరి మధ్య శారీరక, మానసిక బంధంతో పాటు, ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడే శక్తి బంధాన్ని సృష్టిస్తుంది… ఈషా ఫౌండేషన్ అంతర్గత సంప్రదాయం మేరకు తంతు నిర్వహించే పద్ధతిని గోప్యంగా ఉంచుతారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైబర్ క్రైమ్స్… ఖచ్చితంగా బ్యాంకర్లే ప్రథమ ముద్దాయిలు… ఎలాగంటే..?
  • ఏమిటీ ఈ భూతశుద్ధి..! సమంత- రాజ్ పెళ్లి క్రతువు అసలు విశేషాలు..!!
  • శివోన్..! ఎలన్ మస్క్ భార్యకు హిందూ మూలాలు నిజమే… కానీ..?!
  • హెడ్ (వెయిట్) కోచ్, సెలక్టర్… ఇండియన్ జట్టుకు వీళ్లే అసలు సమస్య..!!
  • సంజన గల్రానీ..! నాగార్జుననూ, బిగ్‌బాస్‌నూ కలిపి ఈడ్చికొట్టింది..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ఓ డిఫరెంట్ లీడర్… ఎందుకు, ఎలా అంటే…
  • పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…
  • నాగదుర్గ… పేరుగల్ల పెద్దిరెడ్డి… మరో కొత్త వీడియో వైరల్… బాగుంది…
  • సర్పంచ్..! సొంత ఖర్చులు, అప్పులు… ఐనా ఆ పదవి విలువే వేరు…
  • చిరంజీవి నటచరిత్రలో కలికితురాయి… జనం మాత్రం మెచ్చలేదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions