.
ముందుగా ఓ వార్త…. 8 నెలల్లో బైక్–టాక్సీ డ్రైవర్ ఖాతాలో ₹331 కోట్లు పడ్డాయి… 8 నెలల కాలంలో ఇంత జరుగుతున్నా సరే, తను నాకేమీ తెలియదు అనే అంటున్నాడు…
ఈడీ విచారణలో ఈ డబ్బు 1xBet అక్రమ బెట్టింగ్ ద్వారా వచ్చిందనే సందేహాలు బలపడ్డాయి… తరువాత మ్యూల్ అకౌంట్స్ ద్వారా మనీల్యాండరింగ్ జరిగింది… ఆ ఖాతా నుండి కోటి రూపాయలకు పైగా — Taj Aravalli Resort లో వెడ్డింగ్ వేడుక కోసం చెల్లింపు… ఈ పెళ్లికి గుజరాత్ కాంగ్రెస్ నేత లింక్ ఉందని ఆరోపణలు…
Ads
- ఇదంతా పెద్ద నెట్‌వర్క్… బ్యాంకర్ల సాయం లేనిదే జరుగుతోందా..? దాదాపు ప్రతి బ్యాంకు 50 వేలకు పైగా ఏదైనా లావాదేవీ ఉంటే, ఇది నిజమేనా అని కాల్ చేసి అడిగే సిస్టం పెట్టుకుంది… మనం అనుమతి ఇస్తే తప్ప ఆ లావాదేవీ పూర్తి కాదు… మరి ఆ 331 కోట్ల నుంచి ఎప్పుడూ జరుగుతున్న లావాదేవీల గురించి సదరు ఖాతా ఓనర్‌కు ఎందుకు కాల్స్ రాలేదు..? రాలేదా..? రాలేదని చెబుతున్నాడా..?
ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి, ఇలాంటి రాకెట్లకు కొందరు పేదల ఖాతాలు వాడుకుంటారు… సైబర్ క్రైమ్ కేసు పడేలోపు వాడేసుకుంటారు, తరువాత వీడి బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అవుతుంది… కొందరు నేరగాళ్లు ఏకంగా బ్యాంకు ఖాతాలకు హ్యాక్ చేసి వాడుకుంటున్నారు… బ్యాంకులు సస్పీషియస్ అకౌంట్లు, ట్రాన్సాక్షన్లను నిజంగా గుర్తించడం లేదా..?
చివరకు సేవింగ్స్ అకౌంట్ల నుంచి జరిగే భారీ లావాదేవీలపైనా చెక్ లేకపోతే ఎలా..? కేవలం ఫోన్ నంబర్ మార్చాలన్నా, అడ్రెస్ అప్‌డేట్ చేయాలన్నా ఖాతాదారుడు తప్పనిసరిగా స్వయంగా బ్రాంచ్‌కి రావాలని బ్యాంకులు కఠిన నియమాలు పెడతాయి… పదే పదే కేవైసీ అంటుంటాయి… (భద్రత, నిర్వహణ, సర్వీస్ విషయాల్లో ఈ దేశపు అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ నిర్లక్ష్యానికి ఇంకేమీ సాటి రాదు…)
మరి లక్షలు– లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మాత్రం ఎలాంటి కఠిన నియమం ఎందుకు ఉండకూడదు?
ప్రజలు జీవితకాలం చేసుకున్న పొదుపులు ఒక క్లిక్‌తో మొత్తం ఖాళీ అయిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఎలా?
కరెంట్ లేదా బిజినెస్ అకౌంట్లలో పెద్ద పెద్ద మొత్తాల్లో లావాదేవీలు సాగుతుంటాయి… కానీ కొత్త వ్యక్తి, కొత్త బ్యాంక్, కొత్త నంబర్, లేదా ఎప్పుడూ లేని బెనిఫిషియరీకి పంపుతున్నప్పుడు — “ఇది సైబర్ మోసం కావచ్చు. వివరాలు చెక్ చేసుకోండి… అనుమానం ఉంటే వెంటనే transaction ఆపేయండి” అనే హెచ్చరిక పంపడం బ్యాంక్‌కి పెద్ద పని కాదు… కానీ అది ఎందుకు చేయటం లేదు ?
1. కొత్త బెనిఫిషియరీకి మొదటి లావాదేవీకి కఠిన హెచ్చరిక – ఇది ఆప్షన్ కాదు… ఇది తప్పనిసరి గా చేయాలి…
2. సేవింగ్స్ అకౌంట్ నుండి పెద్ద మొత్తం బయటకు వెళ్తే డబుల్ వెరిఫికేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ అనుమతించకూడదు…
3. కరెంట్ అకౌంట్‌లకైనా సరే – కొత్త ఖాతాకు పెద్ద మొత్తం పంపేటప్పుడు తప్పనిసరిగా రిస్క్ అలర్ట్ ఇవ్వాలి.
4. OTP సరిపోదు. స్పష్టమైన, కఠినమైన, ఆపలేని వార్నింగ్ మెసేజ్ రావాలి.
బ్యాంకు చేయాల్సిన పని డబ్బు వెళ్ళిపోయాక సైబర్ సెల్‌కి కాంప్లైంట్ చేయండి” అని చెప్పడం కాదు… ఖాతాదారుని డబ్బును రక్షించటం…! ఖాతాదారుడు కాస్త ఇబ్బంది పడినా అతడి కష్టార్జితానికి రక్షణ ముఖ్యం. అది బ్యాంకుల ప్రథమ కర్తవ్యం… దాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది చిన్న తప్పు కాదు — తీవ్రమైన చర్య… బ్యాంకు చేసే నేరంగా పరిగణించాలి…
మొన్న ఓ కేసు… ఎక్కడో కేరళలోని ఏదో సైబర్ సెల్ నుంచి హైదరాబాద్ బ్యాంకు శాఖకు ఈమెయిల్… ఫలానా ఖాతా నుంచి 24 వేల అనుమానాస్పద లావాదేవీ జరిగింది అని… వెంటనే ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసింది… అందులో 24 లక్షల రూపాయలున్నాయి… ఈఎంఐలు ఆగిపోయాయి, బ్యాంకు ఖాతా డీఫ్రీజ్ ఎలా చేయించుకోవాలో తెలియదు, తను ఎన్ఆర్ఐ… ఈ కేసు ఎలా డీల్ చేయాలి..? ఆ 24 వేల మేరకు హోల్డ్ పెట్టుకుంటే సరిపోదా..?
(ఆ 24 వేల సొమ్మును వేరే ఎవరిదో ప్రైవేటు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని, ఖాతా డీఫ్రీజ్ చేయవచ్చునని మళ్లీ ఈమెయిల్ పంపించారు సదరు కేరళ సైబర్ పోలీసులు… అంటే, ఏం జరుగుతోంది..?)
- సైబర్ క్రైమ్స్ నుంచి గరిష్ట రక్షణ కావాలంటే బ్యాంకులు మారాలి… దురదృష్టవశాత్తూ నిర్మల అనే ఆర్థిక మంత్రి నుంచి, ఆర్బీఐ నుంచి, అంబుడ్స్‌మెన్ల నుంచి, చిన్న బ్యాంకు శాఖ దాకా అందరికీ జనం సొమ్మంటే తేలికభావనే… పోతున్నది వాళ్ల సొమ్ము కాదు కదా… కేంద్రానికి ఏమాత్రం సీరియస్‌నెస్ లేకపోవడం ఈ దేశ ప్రజల దురదృష్టం..!!
Share this Article