.
నేనొక అద్భుతమైన సామాజిక మేధావిని అనే భ్రమల్లో ఉండిపోవడం, అనాలోచిత వ్యాఖ్యలు చేయడం సినిమా సెలబ్రిటీలకు కొత్త కాదు… అదొక అవలక్షణం… అమితాబ్ బచ్చన్ భార్య, మాజీ నటి, రాజకీయవేత్త జయా బచ్చన్ ఇందుకు మినహాయింపేమీ కాదు, ఓ పిసరు ఎక్కువే…
‘పెళ్లి అనేది పాత కాన్సెప్ట్… అది ఢిల్లీ లడ్డూ వంటిది, తిన్నా సమస్యే, తినకపోయినా సమస్యే… సో పెళ్లీపెటాకులు ఏమీ లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయండి… నా మనవరాలికి మాత్రం పెళ్లీగిళ్లీ వద్దు అమ్మాయ్ అని చెప్పేశాను…’ అని జాతికి కర్తవ్య బోధ చేసింది…
Ads
ఫాఫం, ఇంత తెలివి, పెళ్లి ఓ పాత, నిష్ప్రయోజన కాన్సెప్టు అనే జ్ఞానం ఆమె తల్లిదండ్రులకు లేదు అప్పట్లో… లేకపోతే ఈమె పుట్టుకే ఉండేది కాదు, ఈ నీతిబోధ జాతికి లభించేది కాదు… అంతెందుకు, అమితాబ్ బచ్చన్‌కు కూడా ఆ సోయి లేకుండా పోయింది… సో, అందరికీ తెలిసి ఉంటే ఆమె మనవరాలు కూడా పుట్టి ఉండేది కాదు… పోనీలే, ఏదో ఢిల్లీ లడ్డూ లంపాట్కం…
ఒకదానికి ఒకటి క్రోడీకరించలేం, కానీ కొన్ని ఇలా చకచకా గుర్తొస్తాయి…
1) పరాయి వ్యక్తులతో లైంగిక సంబంధాలు అక్రమం ఏమీ కాదు, వారి స్వేచ్ఛ, వాళ్లిష్టం అని సుప్రీంకోర్టు ఆమధ్య చెప్పింది… ఓహో, చట్టబద్దం, సక్రమమే అన్నమాట అనే భరోసా, ప్రేరణ, స్పూర్తి దొరికాయి దేశప్రజలకు… ఇంకేం..?
2) మొన్న తెలుగు రాష్ట్రాల్లోనే ఓచోట 9 చదివే అబ్బాయి, ఇంటర్ చదివే అమ్మాయి, ప్రణయం (?), తరువాత గర్భం… (అన్నట్టు, పోక్సో కేసు కూడా వర్తించదేమో…) స్కూలింగులోనూ ఈ దైహిక సంబంధాలు, అదే ప్రేమ అనుకునే అపరిపక్వత, అజ్ఞానం దేని వల్ల..! సింపుల్, సినిమాల్లో ప్రేమ పేరిట చూపించబడే విశృంఖలత…
3) ప్రేమ అంటే సంభోగం మాత్రమే అనే భావన యువతను కాదు, పిల్లల్ని కుదిపేస్తోంది… అటువైపు తరిమేయబడుతోంది… దీనికితోడు థాంక్స్ టు చీప్ బ్రాడ్‌బ్యాండ్, చేతుల్లో స్మార్ట్ ఫోన్స్, అరచేతిలో శృంగార కంటెంటు, సంభోగ దృశ్యాలు… తోడు కోసం ఇక వెంపర్లాట…
4) తూర్పు దేశాలు జనాభా తగ్గి విలవిలలాడుతున్నాయి… ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలిటీ రేట్ పడిపోయింది… డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్ అనే ధోరణి ప్రబలుతోంది… ఒంటరి జీవితం పట్ల అనురక్తీ పెరుగుతోంది… సంభోగానికి పెళ్లే అక్కర్లేదు కదా… మన దేశంలోనూ ఈ ధోరణి వేగంగానే వ్యాపిస్తోంది…
5) అట్టహాసంగా పెళ్లిళ్లు చేసినా, నాలుగు రోజులకే పెటాకులు అవుతున్నాయి… విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగింది… ఇంకా పెరుగుతుంది… కుటుంబాలు, బాధ్యతలు, పరిమితులు మన్నూమశానం నేటి యువతకు గుదిబండలుగా కనిపిస్తున్నాయి… సో, సోలో బతుకే సో బెటరూ అంటున్నారు… దీనికితోడు జయాబచ్చన్ వంటి మేధోమహిళల ఉద్బోధలు ఉండనే ఉన్నాయి…
6) ప్రేమ పేరిట సంభోగ వాంఛలో ఏమైనా సందేహాలుంటే… తక్షణం వాటిని దృశ్యాలు చూపిస్తూ మరీ నివృత్తి చేసే యూట్యూబ్ వీడియోలు బోలెడు…
పెళ్లి వద్దు, పిల్లలు వద్దు, ఎంజాయ్ ది లైఫ్ అనే ఉద్బోధలు ఇంకా ఇంకా పెరిగితే… జాతి విస్తరణ ఆగిపోయి… ఎక్కువ మంది సంతానం (అధిక ఫర్టిలిటీ రేట్) కోరుకునే దేశాల ప్రజలే ఇక ప్రపంచమంతా విస్తరిస్తారేమో..!!
Share this Article