Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తప్పులు కేసీయార్‌వి… తిప్పలు రేవంత్‌‌వి… కాళేశ్వరం అక్రమాల కథలు మరిన్ని

December 4, 2025 by M S R

.

అడ్డగోలుగా వేల కోట్ల కమీషన్ల కక్కుర్తితో లక్ష కోట్ల ప్రజాధనం కాజేసి, ప్రాజెక్టును పఢావు పెట్టింది ఒకరు.... తరువాత పీఠం ఎక్కి, దిక్కులేక ఆ భారం మోస్తూ, గెలిపించిన తెలంగాణ జనం రుణం తీర్చుకునేది మరొకరు...

అవును, మీరు ఊహిస్తున్నది నిజమే… కాళేశ్వరం ప్రాజెక్టు కథే… వెనుక నుంచి ఎంత తంతున్నా, పదే పదే ఆ పాత సీఎం పాదాల మీద పాకిన కేంద్ర అధికార పార్టీ గురించి కాసేపు పక్కన పెడదాం… సీబీఐ విచారణకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే, ఈరోజుకూ కిక్కుమనడం లేదు ఆ దిగ్రేట్ దర్యాప్తు సంస్థ…

ఎప్పుడో ఓసారి కేసీయార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడేమోనని ఆశ పాపం… (ఇలాగే చెప్పి సోనియాను మోసం చేశాడనేది వేరే కథ)… పేరుకు కాళేశ్వరం కేసీయార్ ఏటీఎం అని అలా అలా తమలపాకుతో కొట్టినట్టు ఆరోపణ చేయడమే తప్ప.., దోషిని శిక్షించే దిశలో ఆకు కదిలింది లేదు, అడుగు వేసిందీ లేదు…

Ads

సరే, కాళేశ్వరం డిజైన్లు, నాణ్యతలోపాలు, తస్కిన స్థంభాలు గట్రా చాలాసార్లు చెప్పుకున్నాం… ఇంకాస్త లోపలకు వెళ్దాం… ముందుగా ఓ తాజా వార్త చదవండి…



– రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ [ఆర్ఈసీ] నుంచి కాళేశ్వరం కార్పొరేషన్ కోసం తీసుకున్న అప్పు మొత్తం చెల్లించేసిన ప్రభుత్వం… అంటే ఆర్ఈసీకి నయా పైసా బాకీ లేం…! ఆ సంస్థతో రుణానుబంధం తెగిపోయింది…

-కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక వెసులుబాటు మేరకు ఎక్కువ శాతం వడ్డీలు చెల్లిస్తున్న అప్పులు క్లియర్… -8.5% నుంచి 11% వడ్డీ రేట్లున్న అప్పులను తీర్చేసి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కు వెళ్తున్న సర్కారు… 7.5% వడ్డీకి తెచ్చిన దీర్ఘకాలిక రుణాలతో పాత బాకీల చెల్లింపు…

-తద్వారా ప్రభుత్వంపై నెలకు ₹7 వందల కోట్లు, ఏటా ₹8 వేల కోట్ల భారం తగ్గుతోంది- ఆర్థికశాఖ… – కాళేశ్వరం అప్పుల గురించి ఆర్ఈసీ 3 వసారి లేఖ రాసిందన్న పింక్ క్యాంపు కరపత్రిక నమస్తే తెలంగాణ వార్త తప్పు… (తన అన్ని వార్తల్లాగే… బీఆర్ఎస్ ముఖ్యుల ఆరోపణల్లాగే)…

– పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు అలానే ఉంది… ఆ చెల్లింపులు డెడ్ లైన్ లోపు చేసేస్తున్నాం… కేంద్ర ప్రభుత్వం ఎట్లా వెసులుబాటు కల్పిస్తే, అట్లా అప్పులు కడుతూ వెళ్తున్నాం… రుణం క్లియర్ చేస్తున్న మేరకు ఎఫ్ఆర్బీఎంలో కొత్తగా వెసులుబాటు కలుగుతోంది… ఈ ఆర్థిక సంవత్సరంలో ₹26 వేల కోట్ల రుణాల రీషఫ్లింగ్- ఆర్థిక శాఖ వర్గాలు…



అర్థమైంది కదా… అడ్డగోలు కమీషన్ల కోసం, ఎడాపెడా అడ్డగోలు వడ్డీ రేట్లకు రుణాలు తెచ్చి, జేబులు నింపుకున్నది కేసీయార్ ప్రభుత్వం… (బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణల మేరకు… తెలంగాణ జనానికి అర్థమైన మేరకు…)

ఆ వడ్డీ భారం తగ్గించుకోవడానికి, ఆ రుణాలు చెల్లించడానికి నానా తిప్పలు పడుతున్నది రేవంత్ రెడ్డి… ఇంకాస్త లోపలకు వెళ్దాం…

kaleswaram

ఆర్ఈసీ రుణం చుక్తా చేశాం సరే… ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాబార్డు, పీఎఫ్సీ, యూనియన్ బ్యాంకు రుణాలు ఉన్నాయి… ఆ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం, అవసరమైతే రుణాల స్వాపింగు కోసం రేవంత్ రెడ్డి తిప్పలు పడుతున్నాడు… ప్రభుత్వం అంటే కంటిన్యుటీ ప్రాసెస్ కాబట్టి… మోయకతప్పదు…

అంటే… అడ్డగోలుగా బొక్కింది ఒకరు, కిందా మీదా పడి మోస్తుంది మరొకరు… (హార్ష్‌గా ఉందా..? అంతకుమించిన దారుణాలు బోలెడు కేసీయార్ హయాంలో… నమ్మి గద్దె మీద ఎక్కించినందుకు…) ఇక్కడ మరో విషయం ప్రధానంగా చెప్పుకోవాలి…

నిజానికి పీఎఫ్‌సీ గానీ, ఆర్‌ఈసీ గానీ కేవలం విద్యుత్తు సంబంధ ప్రాజెక్టులకే రుణాలు ఇవ్వాలి… మరి కాళేశ్వరం ప్రాజెక్టులో పవర్ జనరేషన్ అంశం ఏముంది..,? ఎడాపెడా మెగావాట్ల కొద్దీ విద్యుత్తు వాడుకోవడమే కదా… మరి ఆ రెండు సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు ఎందుకు ఇచ్చాయి..? అదీ మార్కెట్ రేట్లకు దీటుగా..!!

నిజంగా సీబీఐ గనుక కొరడా పట్టుకుంటే ఫస్ట్ తగిలే దెబ్బలు కేసీయార్‌కు కాదు… ఇదుగో ఇలా అడ్డదిడ్డంగా రుణాలు ఇచ్చిన పీఎఫ్సీ, ఆర్ఈసీ బాధ్యులకు… అందుకే రేవంత్ రెడ్డి సీబీఐకి కేసు అప్పగిస్తున్నప్పుడు టరమ్స్ ఆఫ్ రెఫరెన్సుల్లో ఆ రెండు సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అని రాశాడు…

నిజంగా ఆ కేంద్ర ఆర్థిక సంస్థల పెద్దలను కేసీయార్ ఎలా ట్రాప్ చేశాడు..? మోడీ ప్రభుత్వం ఎందుకు ఆ ట్రాపులో పడిపోయింది అనేది అనూహ్యం… అవునూ, కేసీయార్ ఇంత ఘోరంగా తెలంగాణను అనేకరకాలుగా దోచుకున్నాడు అంటున్నారు కదా… రేవంత్ రెడ్డికి తనను శిక్షించే ఆలోచన ఉందా..? లేదు… అంత సీన్ లేదు, మోడీ శిక్షించడు, రేవంత్ శిక్షించడు… ఇది రియాలిటీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తప్పులు కేసీయార్‌వి… తిప్పలు రేవంత్‌‌వి… కాళేశ్వరం అక్రమాల కథలు మరిన్ని
  • ప్రాప్తకాలజ్ఞతకు నిర్వచనం… ఆ రైల్వే మాస్టర్- వందల ప్రాణాలకు రక్ష..!
  • అవునూ.., ఈమె గుర్తుందా..? ఈ చిత్తవికారి ఏం చేస్తోంది ఇప్పుడు..?
  • ఆ 19 దేశాల వారికి ఇక అమెరికాలోకి నో ఎంట్రీ…! ఏమేం చర్యలు అంటే..?!
  • బాలు విగ్రహవివాదం..! అనేక ప్రశ్నలు- జవాబులు దొరకని నిశ్శబ్దం..!!
  • స్టింగ్ ఆపరేషన్ పేరుతో హనీట్రాప్… మలయాళీ చానల్ అత్యుత్సాహం…
  • ఎవరీ 19 ఏళ్ళ మహేష్ రేఖే..? 200 ఏళ్ల రికార్డు ఎలా బద్దలు కొట్టాడు..?
  • 100 % గరం మసాలా సినిమాలో జయమాలినికి సంసారి పాత్ర..!!
  • పాపం టీబీజేపీ… కక్కలేక, మింగలేక… వంకర దారులు, వక్ర బాష్యాలు…
  • హై-స్పీడ్ రాకెట్-స్లెడ్… పైలట్ల ప్రాణాలకు భరోసా..! ఇదేమిటంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions