Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెస్సి..! ఫుట్‌బాల్ ఆటలోనే కాదు… వ్యాపారాల్లో అంతకుమించి దూకుడు..!!

December 5, 2025 by M S R

.

(రమణ కొంటికర్ల) ..... రాష్ట్రానికి ప్రముఖ ఫుట్ బాల్ వరల్డ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ వస్తుండటం… ఆయన, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ కోర్టులో ఈనెల డిసెంబర్ 13వ తేదీన తలపడుతుండటంతో.. ఇప్పుడు మెస్సీ గురించి తెలంగాణాలోనూ మరోసారి చర్చ మొదలైంది.

ఫుట్ బాల్ ఆటతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెస్సీ.. ఒక క్రీడాకారుడు మాత్రమే కాదు.. ఓ పేరెన్నికగన్న బిజినెస్ మ్యాన్. 2025 నాటికి కొన్ని సర్వేల ప్రకారం ప్రపంచ మిలియనీర్లలో మెస్సీ ఒకడు. ఫోర్బ్స్, ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం మెస్సీ నికర సంపద మొత్తం 850 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 7 వేల 667 కోట్లు.

Ads

అయితే ఈ సంపాదనంతా మెస్సీ ఫుట్ బాల్ వల్ల మాత్రమే సంపాదించిందేమీ కాదు. తాను క్రీడల్లో ఎంత ఫోకస్ చేశాడో… తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకూ అంతే ఫోకస్ చేశాడు. అందుకే, ప్రపంచంలోని సంపన్న క్రీడాకారుల్లో మెస్సీ పేరు కూడా చెప్పుకుంటారు.

అమెరికా మయామీలో ఉన్న ఇంటర్ మయామీ సీఎఫ్ క్లబ్ కోసం ఆడే మెస్సీకి అక్కడ వచ్చే ఆదాయమే పెద్ద మొత్తంలో అందుతుంది. అయితే, ఆటమీద వచ్చే మెస్సీ సంపాదన.. ఆయన బిజినెస్ కింద బహుతక్కువే. మెస్సీ వ్యాపారాల్లో హోటళ్లు, బ్రాండెడ్ దుస్తుల కంపెనీలు, రియల్ ఎస్టేట్, మీడియా సంస్థలు, చైన్ రెస్టారెంట్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటివి అనేకమున్నాయి.

వాటి నుంచి మిలియన్ల ఆదాయం సంపాదిస్తూ అత్యంత సంపన్నుల్లో ఒకడిగా నిల్చాడు మెస్సీ. స్పెయిన్, అర్జెంటీనా, అండోరా, ఉరుగ్వే, ఇటలీ, పోర్చుగల్, చిలీ, పారాగ్వే, యునైటెడ్ స్టేట్స్ వంటి పలు దేశాల్లో మెస్సీ వ్యాపార సంస్థలు విస్తరించాయి. దీంతో మెస్సీ కేవలం ఫుట్ బాల్ క్రీడలో మాత్రమే కాదు.. వ్యాపారంలోనూ గురి చూసి గోల్ కొట్టగల్గే సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు.

మెస్సీ ప్రధాన వ్యాపారాలేంటి..?

మెస్సీ మెజిస్టిక్ హోటల్ గ్రూప్ వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. ఐబిజా, మల్లోర్కా, సైట్స్, బకీరా, అండోరా, ఎంఐఎం పేరిట చైన్ హోటల్స్ వ్యాపారముండగా.. వీటిని బీచెస్, మౌంటెయిన్స్ వంటి ప్రాంతాల్లో నడిపిస్తున్నాడు. ఇవి అత్యంత విలాసవంతమైన స్టైలిష్ స్టేకు పెట్టింది పేరు. 2024లో ఈ మెజిస్టిక్ హోటల్ గ్రూప్ యూరోపియన్ ప్రాంతాలకూ విస్తరించింది.

2019 సెప్టెంబర్ లో స్పెయిన్ లోని బార్సిలోనాలో మెస్సీకి సంబంధించిన ది మెస్సీ స్టోర్ ప్రారంభమైంది. స్పోర్ట్స్ వేర్ తో పాటు.. లైఫ్ స్టైల్ డ్రెస్సెస్ కు కేరాఫ్ బ్రాండ్ గా ఈ దుస్తులు పేరు తెచ్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో కూడా ఈ దుస్తులు అందుబాటులో ఉన్నాయి.

2024లో మెస్సీ ఎనర్జీ డ్రింక్స్ బిజినెస్ లోకీ ప్రవేశించాడు. మాస్ ప్లస్ బై మెస్సీ (MAS+ BY MESSI) పేరిట దక్షిణ ఫ్లోరిడాలో ఈ ఎనర్జీ డ్రింక్ బిజినెస్ ను ప్రారంభించాడు. డిఫరెంట్ టేస్ట్స్ లో ఈ ఎనర్జీ డ్రింక్ లభిస్తుంది. మయామీతో పాటు, యునైటెడ్ స్టేట్స్ మొత్తం ఈ ఎనర్జీ డ్రింక్ ఆన్ లైన్ లో కూడా దొరుకుతుంది.

మెస్సీ కాలు ఫుట్ బాల్ కోర్టులో ఎంత చురుకుగా కదులుతుందో.. భిన్నమైన వ్యాపారాల్లోకి అలాగే దూసుకెళ్తోంది. అలా మీడియా వ్యాపారంలోకి కూడా విస్తరించాడు మెస్సీ. 2022లో 525 రొసారియో మీడియా కంపెనీని ఏర్పాటు చేశాడు. అర్జెంటీనాలోని రోజారియోలో నెలకొల్పిన ఈ మీడియా సంస్థ మెస్సీ పర్సనల్ షోస్ తో పాటు, ఇతర క్రీడలు, డిజిటల్ సీరీస్ లనూ ప్రసారం చేస్తుంది. హాలీవుడ్ స్టూడియోల్లోనూ మెస్సీ మీడియా సంస్థ అర్జెంటీనా దర్శకులతో కలిసి పనిచేస్తోంది.

ఇక తనదైన రుచులతో ఫుడ్ వ్యాపారంలోనూ అడుగు పెట్టి… ప్రపంచానికి కొత్త రుచులను పరిచయం చేసే రెస్టారెంట్లనూ ఏర్పాటు చేశాడు మెస్సీ. EL CLUB DE LA MILANESA పేరిట 2023లో అర్జెంటీనా, ఉరుగ్వే, యూఎస్ఏల్లో 70కి పైగా బ్రాంచులతో ఈ ప్రముఖ చైన్ రెస్టారెంట్స్ ను ప్రారంభించాడు. 2024 వరకు ఈ చైన్ రెస్టారెంట్స్ ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, చిలీ, పరాగ్వే, వంటి దేశాలకు కూడా విస్తరించగా.. ఈ హోటల్ చైన్ లో మెస్సీ కూడా ప్రధాన వాటాదారుడు.

తనకిష్టమైన ఫుట్ బాల్ తో పాటు, ఇతర క్రీడల నిర్వహణకు సంబంధించి.. ప్లే టైమ్ స్పోర్ట్స్- టెక్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్ ను కూడా 2022లో ఆరంభించాడు మెస్సీ. క్యాలిఫోర్నియాలో ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ సంస్థ క్రీడలు, మీడియా, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది. యువ క్రీడా కంపెనీలతో పాటు.. టెక్ స్టార్టప్ లలోనూ పెట్టుబడులు పెడుతూ వ్యాపారాన్ని విస్తరిస్తోంది ఈ సంస్థ.

అయితే, ఇంత పెద్ద ఫుట్ బాల్ క్రీడాకారుడు… అంతకుమించి వ్యాపారంలో రాణించిన బిజినెస్ మ్యాన్ అయిన మెస్సీ.. ఎంత పెద్ద విజయాలు సాధించినా సాధారణ జీవితాన్ని ఇష్టపడే తన తీరే అతడి క్రేజును ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచింది.

డబ్బు నన్నెప్పుడూ నడపదు. నేను ఫుట్ బాల్ ఆడేది కూడా ఆటపైనున్న ప్యాషన్ తోనేనంటాడు మెస్సీ. అయితే, కొందరు ఏది ముట్టుకుంటే అది బంగారమవుతుందంటారు. అలాంటి కోవకు చెందినవాడే మెస్సీ. అందుకే ఫుట్ బాల్ లో ఒక క్రేజీ స్టార్ గా ఎదిగిన మెస్సీ.. వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించి ప్రపంచంలోని బడా బిజినెస్ మెన్ లో తానూ ఒక్కడిగా నిలుస్తున్నాడు……

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ట్రంపు ఎజెండా వేరు… ఇండియా- రష్యా ఎవరికీ వ్యతిరేకం కాదు…’’
  • మెస్సి..! ఫుట్‌బాల్ ఆటలోనే కాదు… వ్యాపారాల్లో అంతకుమించి దూకుడు..!!
  • ప్రతి పాత్రధారి వీర పర్‌ఫామెన్స్… కామెడీ టైమింగులో పర్‌ఫెక్షన్…
  • బాలయ్య ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ..! అఖండ తాండవం ఆగింది హఠాత్తుగా..!!
  • తనూజకు సంజన వెన్నుపోటు… తోడుగా భరణి… ఏం ఆటరా భయ్…
  • అందుకే అమెరికాను నమ్మకూడదు… పుతిన్‌ రాకను స్వాగతిద్దాం…
  • తప్పులు కేసీయార్‌వి… తిప్పలు రేవంత్‌‌వి… కాళేశ్వరం అక్రమాల కథలు మరిన్ని
  • ప్రాప్తకాలజ్ఞతకు నిర్వచనం… ఆ రైల్వే మాస్టర్- వందల ప్రాణాలకు రక్ష..!
  • అవునూ.., ఈమె గుర్తుందా..? ఈ చిత్తవికారి ఏం చేస్తోంది ఇప్పుడు..?
  • ఆ 19 దేశాల వారికి ఇక అమెరికాలోకి నో ఎంట్రీ…! ఏమేం చర్యలు అంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions