.
రేపు దాటితే… ఓ కొత్త అధ్యాయం… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ సమిట్… ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ మెగా ఈవెంట్ పనుల్లోనే యంత్రాంగం మొత్తం తలమునకలై ఉంది… అనేకమంది విశిష్ట అతిథులు వస్తున్నారు… హంగామా, హడావుడి… 27 సెషన్లు …
ప్రజెంటేషన్లు, చర్చలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు… ఇది నిజంగానే ఓ గ్లోబల్ సదస్సు… అసలు ఏమిటి లక్ష్యాలు..? ఏం సాధిస్తారు..? అనే ప్రశ్నలు సగటు తెలంగాణవాసి మదిలో సహజంగానే తలెత్తుతుంది… ఓసారి స్థూలంగా చెప్పుకుందాం… (రొటీన్ పీపీటీలు గాకుండా... పడికట్టు పదాలు గాకుండా... స్ట్రెయిటుగా, సరళంగా...)
Ads
- దీని ప్రధాన లక్ష్యాల్లో ప్రధానమైంది… హైదరాబాద్‌ను మోస్ట్ హాపెనింగ్ సిటీగా ప్రొజెక్ట్ చేయడం… ఫార్ములా వన్ వంటి నిరర్థక, ఆర్థిక అక్రమాల కార్యక్రమాలతో కాదు… ఓ స్పష్టమైన, ప్రయోజనాత్మక ప్రణాళికతో సిటీ బ్రాండ్ ఇమేజ్‌ను…
- మరీ ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తున్న ఓ గ్లోబల్ సిటీ అలియాస్ ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేయడం… ప్రపంచానికి పరిచయం చేయడం… అందుకే సమిట్‌ను కూడా అక్కడే నిర్వహిస్తున్నారు… మరి ప్రపంచ విశ్వనగరాలతో పోటీ అంటే తమాషా, అల్లాటప్పా యవ్వారం కాదు కదా…
అభివృద్ధి అంటే అడ్డదిడ్డంగా పరుగులు తీయడం కాదు… ఓ ప్రణాళిక ఉండాలి, అది మన బాట ఎలా ఉండాలో, ఎటువైపు వెళ్లాలో చెప్పేలా ఉండాలి… శాఖల వారీ నిర్ణయాలు, ఆచరణ అదే దిశలో ఉండాలి… అందుకే తెలంగాణ రైజింగ్ నినాదం… విజన్ 2047 డాక్యుమెంట్… మా బాట ఏమిటనేది ప్రపంచానికి చెప్పడం…
- అందులో తెలంగాణ డెవలప్‌మెంట్‌కు సంబంధించి… క్వాంటం సిటీ దగ్గర నుంచి టెంపుల్ టూరిజం సర్క్యూట్ల దాకా… మాన్యుఫాక్చరింగ్ నుంచి అగ్రికల్చర్ దాకా.., ఐటీ, హెల్త్, గ్రీన్ ఎనర్జీ, ఎయిరోస్పేస్, ఫార్మా, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సినిమా… అన్నీ… మన బాట ఎటో, ఏమిటో ఖరారు చేసుకోవడం ఇది…
- కేంద్ర ప్రభుత్వ 30 ట్రిలియన్ల వికసిత భారత్ (విజన్ 2047) లక్ష్యం దిశలోనే… మేమూ రెడీ, దేశ జీడీపీలో 10 శాతం, 3 ట్రిలియన్ల వాటాకు మేం సిద్ధమని ప్రకటించడం ఇది… బృహత్ లక్ష్యం… అవును, సంకల్పానికి దరిద్రం దేనికి..?
ఐతే… తమ విజన్ లక్ష్యాలేమిటో ఇన్నాళ్లూ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా జనానికి చెప్పలేకపోయింది… పైన చెప్పిందే స్థూలంగా అసలు ఉద్దేశం, లక్ష్యం… ఇవేకాదు… గత రెండేళ్ల తెలంగాణ ప్రభుత్వ ప్రయాణంపై ఓ విశ్లేషణ, ప్రపంచానికి ఓ వివరణ… మాది పనిచేసే ప్రభుత్వం అని చాటుకోవడం…
- ఇవన్నీ సరే… మరి రాజకీయంగా..? అవును, అది లేకపోతే ఎలా..? రేవంత్ రెడ్డి తను రాజకీయంగా హైలైట్ కావడం ఓ లీడర్‌గా… ప్రభుత్వ అధినేతగా… మంత్రులు సహకరించరు, తనకు ప్లానింగ్ లేదు, ఎఐసీసీ అసంతృప్తి వంటి ప్రచారాలను బద్ధలు కొట్టడం కోసం… దేశానికి తన నాయకత్వ సామర్థ్యాన్ని చూపించడం కోసం…
అందుకే… వేరే సీఎంలను, ప్రధానిని, ఎఐసీసీ ముఖ్యులకు ప్రత్యేకంగా సమిట్‌కు రమ్మని ఆహ్వానాలు… అందరినీ ఓ వేదిక మీదకు తీసుకువచ్చి… ఓ మెగా బంపర్ ఈవెంట్ నిర్వహించి… ఇదీ తెలంగాణ అని చాటడం… అందుకే సీఎంల దగ్గరకు మంత్రులను పంపించడం..! సోనియా, రాహుల్, ఖర్గేల వద్దకు తనే స్వయంగా వెళ్లడం… అసలే జుబ్లీ హిల్స్ ఉపఎన్నికతో కొంత జోష్ వచ్చింది తనలో… దాన్ని సస్టయిన్ చేసుకోవడం మరింత బలంగా… అదీ పొలిటికల్ లైన్…
మరి తెలంగాణ జనానికి వచ్చేదేమిటి అంటారా..? క్లియర్ కట్ డైరెక్షన్ చూపించడం… ఉదాహరణకు… ప్యూర్, కేర్, రేర్… అసలు ఏమిటీ ఈ ఏరియాలు..?
1) ఓఆర్ఆర్ లోపల మంచి రెసిడెన్షియల్ సిటీ… విశ్వనగరం… సర్వీస్ సెక్టార్, కాలుష్యం తగ్గింపు, చెరువుల పునరుద్దరణ, జీహెచ్ఎంసీ విస్తరణ ఎట్సెట్రా…
2) ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు మాన్యుఫాక్చరింగ్ ఏరియా… దానికి తగిన పాలసీలు, మౌలిక వసతులు…
3) ఆర్ఆర్ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దుల దాకా అగ్రికల్చర్, గ్రామీణ వృత్తుల (రూరల్ ఎకానమీ) మీద ఫోకస్… ఇలా…
- తెలంగాణతనంతో కూడిన గ్లోబల్ సమిట్… అందుకే ఆహుతుల ఎదుట తెలంగాణ జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు… ప్లస్ తెలంగాణ వంటలు, కానుకలతో కూడిన సావనీర్ కిట్టు… అందులో ఇప్ప లడ్డూ ఎట్సెట్రా..!! ఇదీ స్థూలంగా తెలంగాణ గ్లోబల్ సమిట్ లక్ష్యం, సంకల్సం…!!
Share this Article