.
ముందుగా ఒక వార్త చూద్దాం… దేశమంతా ఇండిగో ప్రకంపనలు కలకలం క్రియేట్ చేస్తున్నాయి… ఇండిగో బలుపు ఏమిటో కూడా మనం ఇంతకుముందు ఓ కథనంలో చెప్పుకున్నాం…. ఫాఫం మోడీ ప్రభుత్వం… దీన్ని ఎవరు టాకిల్ చేయాలో, వైఫల్యం ఎవరిదో కూడా తెలియనంతగా జన వ్యతిరేకతలో కూరుకుపోయింది…
అన్నింటికీ మించి పౌరవిమానయాన మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు మీద జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది… మంత్రి అట్టర్ ఫ్లాప్… సరే, తన నుంచి దేశం, మోడీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి భంగపడటం మాటెలా ఉన్నా…
Ads
టీడీపీ పిచ్చి కూతలతో మరింతగా పరువు తీసుకుంది… విషయం ఏమిటంటే..? రిపబ్లిక్ టీవీ అంటేనే బీజేపీ చానెల్ కదా… చివరకు తను కూడా ఈ ఇండిగో విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం మీద ఔట్ రైట్ ఆడేసుకున్నాడు… కానీ… ఓ డిబేట్‌లోకి ఓ తెలుగు దేశం నాయకుడు వచ్చాడు… ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్ర ప్రదేశ్ ఉపాధి కల్పన, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా ఉన్న దీపక్ రెడ్డి…
- అసలు ఉపాధికల్పనకు, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సొసైటీకి ఇండిగో సంక్షోభానికి లింక్ ఉందా ఏమైనా..? ఈ డిబేట్ లో కేంద్ర ప్రభుత్వ తీరును అర్నాబ్ గోస్వామి తీవ్రంగా తప్పుపడుతూ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి …ఇండిగో ఎయిర్ లైన్స్ చేసిన బ్లాక్ మెయిల్ కు ప్రభుత్వం లొంగిపోయినట్లుగా ఉంది అని ఆరోపించాడు…

అందుకే రెండేళ్ల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ (ఎఫ్‌డీటిఎల్) లో మళ్ళీ మినహాయింపులు ఇచ్చారు అని ఆరోపించాడు… ఇదే అంశంపై అర్నాబ్ టీడీపీ నుంచి చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డి స్పందన కోరినప్పుడు… ఆయన ఈ అంశంపై స్పందిస్తూ ‘‘మంత్రి నారా లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు… ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగింది’’ అన్నాడు…

- దీనిపై అర్నాబ్ స్పందిస్తూ ‘‘మీ మంత్రి నారా లోకేష్ పౌర విమానయాన శాఖ మంత్రి కాదు కదా…ఏ హోదాతో ఆయన పరిస్థితిని మానిటర్ చేస్తున్నాడు, ఈ వార్ రూం ఏమిటి’’ అని ప్రశ్నించాడు… ‘‘ఒక రాష్ట్ర మంత్రి దేశవ్యాప్తంగా నెలకొన్న సమస్యను ఎలా మానిటర్ చేస్తాడు… ఏ హోదాతో నారా లోకేష్ దేశ పౌర విమానయాన శాఖ పరిస్థితిని మానిటర్ చేస్తాడు…’’ అని లెఫ్ట్ రైట్ తీసుకున్నాడు…

‘‘తమ పార్టీ తరపున నారా లోకేష్ కూడా పరిస్థితిని మానిటర్ చేస్తున్నాడు…. పరిస్థితిని చక్కదిద్దటానికి’’ అని దీపక్ రెడ్డి జవాబు చెప్పాడు… ఇందులో అసలు మీ పార్టీ ఎలా భాగం అవుతుంది అన్నాడు అర్నాబ్… ‘‘ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీనా లేక టీడీపీ మినిస్ట్రీనా…’’ అని అర్నాబ్ అడిగితే… ‘‘ఇండిగో ఒక ప్రైవేట్ కంపెనీ, తన పద్దతుల ప్రకారం అది వ్యాపారం చేసుకుంటూ పోతుంది, ఈ పరిస్థితి రావటానికి గల కారణాలపై ఒక కమిటీ వేశాం’’ అని చెప్పుకొచ్చాడు దీపక్ రెడ్డి…
- ఫాఫం… దీపక్ రెడ్డి తన పరువు కాదు, లోకేష్ పరువును దేశవ్యాప్తంగా బజారుపాలు చేశాడు… లోకేష్‌కు ఏదో ఎలివేషన్ ఇవ్వబోయి భంగపడ్డాడు….. సరే, ఇదంతా సరే… కానీ ఇక్కడ ఆర్నాబ్ తప్పు లేదా..? టీడీపీకి ఏం సంబంధం.? ఎందుకు ఆ పార్టీకి డిబేట్‌లో స్థానం..? ఏవియేషన్ నిపుణులో, మాజీ ఎయిరోస్పేస్ వ్యాపారులో అయితే, వాళ్ల అభిప్రాయాలకు వాల్యూ ఉంటుంది… కానీ దీపక్ రెడ్డితో ఆడుకోవడం ఏమిటి..? అసలు తను ఈ డిబేట్‌కు ఎలా ఆప్ట్..,?

ఇక్కడ ఖచ్చితంగా ఆర్నాబ్ తప్పే కనిపిస్తోంది… దీపక్ రెడ్డి లెవల్ అదే, అంతకుమించి తన నుంచి స్పందన ఆశించలేం… ఖచ్చితంగా… టీవీ5 సాంబ, ఏబీఎన్ వెంకటకృష్ణ డిబేట్లకు అర్హుడైన నాయకుడిని రిపబ్లిక్ టీవీ డిబేట్‌లోకి అనుమతించడమే అసలు తప్పు… ఇదీ ఇండిగో బాపతు వైఫల్యమే..!!
ఇజ్రాయిల్ పాలస్తీనా, రష్యా ఉక్రెయిన్ వంటి సీరియస్ ఇష్యూలు కదా లోకేష్ స్పెషల్ వార్ రూమ్స్ గురించి అడగాల్సింది… ఆఫ్టరాల్ ఇండిగో…
https://www.facebook.com/krishna.narayanaNK
Share this Article