.
అంతే… ఈ సీజన్ బిగ్‌బాస్ అంటే రణరంగం అంటుంటాడు కదా నాగార్జున… పలుసార్లు చెప్పుకున్నాం కదా, రణరంగం కాదు, చదరంగం కాదు… దారుణరంగం, చెదరంగం అని… మరోసారి నిరూపించుకున్నాడు…
రీతూ చౌదరిని ఎలిమినేట్ చేశారు… తామే పెంచి పోషించిన ఓ ప్రేమికుల జంటను విడదీశారు… డిమోన్ పవన్‌ను ఒంటరిగాడిని చేసేశారు… అంత అవసరమా..? అసలు ఈసీజన్‌లో లవ్ ట్రాకులే తక్కువ… ఉన్నంతలో వీళ్లిద్దరూ ఏదో షో నడిపించారు… ఇదే ఊపుతో టాప్ 6 ఫైనలిస్టుల్లో ఉంచేస్తారులే అనుకున్నారు…
Ads
నిజానికి పలు అనఫిషియల్ వోటింగు ప్లాట్‌ఫారాల్లో సుమన్ శెట్టి లీస్ట్ వోటింగు… తనకు దీటుగా సంజన… రీతూ బెటర్ వోటింగులోనే ఉంది… కొన్ని వోటింగుల్లో భరణికన్నా మంచి ప్లేసులో ఉంది… అలాంటప్పుడు రీతూ చౌదరిని ఎందుకు ఎలిమినేట్ చేశారో ఎవరికీ అర్థం కాదు…
వాస్తవంగా అందరూ అనుకున్నది ఏమిటంటే… ఈసారి సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని..! గత రెండు వారాల్లో తన ప్లే కూడా పెద్దగా ఏమీ లేదు… పైగా డిమోన్ పవన్‌ను నామినేట్ చేసినప్పుడు చెప్పిన కారణం విని జనం నవ్వుకున్నారు…

ఎలాగూ కల్యాణ్, ఇమాన్యుయెల్ నామినేషన్లలో లేరు… ఉన్నాసరే, వాళ్ల వోటింగు బాగానే ఉంటుంది… సో, వాళ్లకు పోయేదేమీ లేదు… తనూజ ఎప్పటిలాగే టాప్ వన్ ప్లేసులో ఉంది… కాకపోతే ఈ వారం తను ఆటలో డల్ అయిపోయింది ఎందుకో గానీ…

ప్రేక్షకుల అభిప్రాయం స్థూలంగా…. తనూజ పుట్టస్వామి, పడాల కల్యాణ్, ఇమాన్యుయెల్‌లకు తోడుగా భరణి, డిమోన్ పవన్, రీతూ చౌదరిలను టాప్ -6 ఫైనలిస్టులుగా కొనసాగించి… సుమన్ శెట్టిని ఒకవారం, సంజనను మరోవారం ఎలిమినేట్ చేస్తే బాగుండేది అని… అర్హులు కూడా…
ప్రేక్షకుల అభిప్రాయాలకు, వోటింగుకు బిగ్‌బాస్ విలువ ఇవ్వడు కదా… తన స్క్రిప్టు, తనతో కుదిరిన ఒప్పందాల మేరకు కథ నడిపిస్తూ ఉంటాడు… ఇప్పుడూ అంతే… ఐతే ఈసారి ఇదే సింగిల్ ఎలిమినేషనా..? అనూహ్యంగా సంజన, సుమన్ శెట్టిలలో ఒకరిని కూడా పంపించేస్తారా..? అదొక్కటే సస్పెన్స్..!!
Share this Article