.
స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్… చైనా మన భారత్ చుట్టూ ఓ ‘ముత్యాల వల’ను సముద్ర రవాణా పేరిట నిర్మిస్తూ ఉంటుంది… ప్రపంచాన్ని శాసించగల సముద్ర రవాణాను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం… మరోవైపు చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)… ఇంకోవైపు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్,, ఓల్డ్ సిల్క్ రోడ్ పునరుద్దరణ…
మరి మనం ఏం చేస్తున్నాం..? తలొగ్గాల్సిందేనా… మన వ్యూహాలు మనకున్నాయి… మనకూ మన రష్యా ఉంది… పుతిన్ వచ్చిపోయాడుగా… ఓసారి ఇది చదవండి…
Ads
Pardha Saradhi Upadrasta…. చెన్నై–వ్లాడివోస్టోక్ సముద్ర మార్గం – భారత్‌కి ఎందుకు గేమ్‌చేంజర్?
భారత్ & రష్యా కలిసి అభివృద్ధి చేస్తున్న Eastern Maritime Corridor (EMC) చెన్నై పోర్ట్ (ఇండియా) నుంచి వ్లాడివోస్టోక్ (రష్యా Far East) వరకు 5,647 నాటికల్ మైళ్ళ సముద్ర మార్గం…
ఇది operational అయితే — భారత్ రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రత, భూభౌగోళిక వ్యూహాల్లో పెద్ద మార్పు రానుంది…
ప్రస్తుతం ఉన్న పరిస్థితి
ఇండియా– రష్యా సముద్ర వాణిజ్యం కోసం సరుకు ఎక్కువగా ముంబై–సెంట్ పీటర్స్‌బర్గ్ మార్గం ద్వారా స్యూయెజ్ కాలువ మీదుగా వెళ్తుంది.
దూరం: 8,675 nautical miles
సమయం: 35–40 రోజులు
ఈ EMC operational అయితే:
కొత్త దూరం: 5,647 nautical miles
సమయం: 20–22 రోజులు
12–15 రోజుల సమయ తగ్గింపు
20–25% వరకు రవాణా ఖర్చు తగ్గింపు
రష్యన్ Far East వనరులకు నేరుగా యాక్సెస్
వ్లాడివోస్టోక్ ప్రాంతం ప్రపంచంలో అత్యంత వనరుల సమృద్ధిగా ఉన్న ప్రాంతం:
ఆయిల్ & నేచురల్ గ్యాస్
బొగ్గు
టింబర్
అరుదైన ఖనిజాలు, Rare Earth Minerals
ఇండస్ట్రియల్ ముడిసరుకు
ఇవన్నీ ఇండియా నేరుగా కొనుగోలు చేసి కనీస ఖర్చుతో రవాణా చేసుకునే అవకాశం.
ఇది వ్యూహాత్మక, రక్షణపరంగా ఎందుకు కీలకం?
ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రభావం పెరుగుతుంది
రష్యా Far East తో రక్షణ సహకారం & నేవల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి అవకాశం
చైనా Belt & Road Initiative కు భారత్ ప్రత్యామ్నాయం
Arctic shipping రూట్ కలుపుకునే భవిష్యత్ గేట్ వే
Suez Canal మీద ఆధారాన్ని తగ్గిస్తుంది. స్యూయెజ్ కాలువ మీద ఆధారపడటంలో సమస్యలు — ఎందుకంటే
1. ఒక్క చిన్న ప్రమాదం సమస్త వాణిజ్యాన్ని నిలిపేస్తుంది : 2021లో ఒక పెద్ద కంటైనర్ షిప్ — Ever Given — స్యూయెజ్‌లో విరిగిపోయి 6 రోజులకు కాలువ మూసివేయబడింది. అప్పట్లో ప్రపంచ వ్యాప్త షిప్పింగ్- లైన్‌లు నిలిచిపోయాయి. ఆ సమయంలో పాడయిన సరుకు, తడిసిపోయిన సరుకులు, డెలివరీలు వాయిదా — ప్రపంచ supply chains తీవ్రంగా దెబ్బతిన్నాయి .
2. ఇది ఒక “చోక్-పాయింట్ (bottleneck / choke-point)” — ప్రపంచ సముద్ర వాణిజ్యంలో చాలా దేశాలు — తమ సరుకు రవాణా కోసం స్యూయెజ్, మెలాకా స్వాట్, ఇతర మార్గాల మీద ఆధారపడతాయి. చోక్-పాయింట్‌లపై ఏ చిన్న తీవ్ర అస్థిరతనైనా పెద్ద ప్రభావం ఉంటుంది. 2024–25 మధ్య గ్లోబల్ వాతావరణ మార్పులు, భూక్షోభలు, జియోపాలిటికల్ మార్పుల కారణంగా కూడా కాలువ వాడకంపై సంకోచాలు, అనుమానాలు పెరిగాయి. ఎవడో ఒకడు నీ నౌకను కదలనివ్వను పో అంటాడు.
3. ప్రమాదాల, భద్రతా కారణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. కాలువలో ఘటనలు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే — షిప్పింగ్ కంపెనీలు, ఇన్‌షూరెన్స్ సంస్థలు, రవాణా — రిస్క్ ప్రీమియం పెంచి వుంటాయి. ఈ సమయంలో సరుకు రవాణా ఖర్చు పెరిగిపోతుంది. Delay & rerouting (కల్పిత మార్గాలైన Africa చుట్టూ వెళ్లడం) వల్ల ఇంధన + సమయ + లాజిస్టిక్స్ ఖర్చులు మళ్ళీ చాలా అవుతాయి.
4. Supply Chains అస్థిరతకు గురవుతాయి. సముద్ర వాణిజ్యంపై ఆధారపడి ఉన్న దేశాలకో, కంపెనీలకో — ఒక చిన్న Accident / Blockage / రిస్క్ తో సరఫరా నిలిచిపోతుంది.
5. భద్రత, జియో- పొలిటికల్ రిస్క్‌లు కూడా ఉంటాయి . సమీప ప్రాంతాల్లో రాజకీయ, సైనిక అశాంతులు, సముద్ర దాడులు (piracy / militant attacks) ఉంటే — కాలువ మార్గం ప్రమాదకరం అవుతుంది.
ఒక చోక్-పాయింట్ మీద ఆధారపడటం అంటే సముదాయ మార్గాల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలి
అందుకే — ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సముద్ర కారిడార్లు అవసరం
దీని వల్ల భారత్– రష్యా వాణిజ్యం భారీ స్థాయిలో పెరగబోతోంది
ప్రస్తుతం India–Russia trade ~ 65 బిలియన్ డాలర్లు
ఈ కారిడార్ పూర్తి అయితే $100–120 బిలియన్‌కి పెరగాలి అనే అంచనా
భారత ఎగుమతులకు (pharma, IT, steel, engineering goods, food products) భారీ అవకాశాలు
Act East Policy కి బలమైన మద్దతు
ఆగ్నేయ ఆసియా దేశాలతో ట్రేడ్ కనెక్టివిటీ పెరగడం. చెన్నైని దక్షిణాసియాలో ప్రధాన నౌకాశ్రయంగా మార్చుతోంది. ముంబై మీద వత్తిడి కూడా తగ్గుతుంది .
సారాంశం
చెన్నై– వ్లాడివోస్టోక్ EMC కేవలం సముద్ర మార్గం కాదు —
భారత్ భవిష్యత్ ఆర్థిక శక్తి, భద్రతా వ్యూహం, జియోపాలిటికల్ ప్రభావం పెరిగే మెగా మిషన్.
వాణిజ్యం వేగవంతం
ఇంధన భద్రత
ఖర్చు తగ్గింపు
వ్యూహాత్మక శక్తి
దేశ ప్రయోజనం
— ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #ChennaiVladivostok #EasternMaritimeCorridor #EMC #IndiaRussia #Geopolitics #IndoPacific #TradeGrowth #BlueEconomy #ActEastPolicy #AtmanirbharBharat #connectivitypower
Share this Article