.
చూడబోతే టీఎంసీలో అందరూ అలాగే ఉన్నట్టున్నారు… అధినేతలాగే… పైగా ఇప్పుడు ‘సర్’ ప్రక్రియ ఫ్రస్ట్రేషన్ కూడా తోడైనట్టుంది… ఉదాహరణకు వందేమాతరం చర్చలో టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ అభ్యంతరాన్ని తీసుకుందాం…
ప్రధాని మోడీ మాట్లాడుతున్నప్పుడు ఓచోట బంకిం చంద్ర దా అని ప్రస్తావించాడు… అంతే… ఈ టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ‘బాబూ అనాలి, దా అనడం ఏమిటి..?’ అన్నాడు… అంటే మోడీ బంకిం చంద్రను దా అనడం తనను అవమానించినట్టే అనేది తన అభిప్రాయం, అభ్యంతరం…
Ads
మోడీ దీన్ని పెద్ద ఇష్యూగా మారనివ్వకుండా… వోకే వోకే, నీ మనోభావాల్ని గౌరవిస్తాను, బంకిం బాబు అంటాను, కానీ నిన్ను దాదా అనొచ్చా, అదీ అభ్యంతరమేనా? అని సరదాగా దాటేశాడు… నిజానికి అది పెద్ద ఇష్యూ కాదు, దా అనడం అంటే అవమానించడమూ కాదు… కానీ ఏదో ఒకటి గోకడం టీఎంసీకి అలవాటు కదా… (ఏమయ్యా, మా బెంగాలీ పెద్ద మనిషిని అన్నయ్యా అంటావా, సార్ అని పిలువు అన్నట్టుగా ఉంది ఇది…)

నిజానికి దా అని ఎవరైనా పెద్దవారిని పిలిస్తే గౌరవం, అభిమానంతో కూడిన పలకరింపే… అన్నా, పెద్దన్నా అని పిలిచినట్టు ఒకరకంగా..! (దాదా అని పిలవడం, మమతను దీదీ అంటారు, అంటే అక్కా అని…) ఇందులో మర్యాద ఉంటుంది, పెద్దరికానికి గౌరవమూ ఉంటుంది… వోకే, బాబు అనేది కూడా గౌరవప్రదమైన పిలుపే… కానీ మరీ ఆ పిలుపు ఆభిజాత్యం ఆపాదించినట్టు కూడా…
ఇదే బెంగాల్‌లో బ్రిటిష్ సంస్కృతికి అలవాటుపడిన భద్రలోక్ సెక్షన్ (హై ప్రొఫైల్) ను ఉద్దేశించి కూడా బాబు అనే పదాన్ని వ్యంగ్యంగా వాడుతుంటారు… బంకిం చంద్ర ఛటర్జీ ఆ సెక్షనే… మరి టీఎంపీ ఎంపీ బాబు అని పిలవాలని పట్టుబట్టడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి..! సర్లె, అంత ఆలోచించే ‘ఆ అదే’ ఉంటే తను టీఎంసీలో ఎందుకుంటాడు సదరు ‘సౌగత్ రాయ్ బాబు’..!!
అన్నట్టు… బాబు అనే పదం తెలుగు సమాజంలో కూడా చర్చనీయాంశమే… ప్రత్యేకించి సినిమా ప్రపంచంలో బాబు అనే గౌరవ సంబోధనను తమ పేర్లకు సఫిక్సుగా యాడ్ చేసుకుంటారు.., అదొక ‘స్వీయ ప్రకటిత ఆభిజాత్య’ పోకడ… ముద్ర లేదా బ్యాడ్జ్… ‘సెల్ఫ్ డిక్లేర్డ్ స్టేటస్ సింబల్’… ఒక్కసారి తెలుగు సినిమా కుటుంబాల్లో ఈ బాబులను గుర్తుచేసుకొండి… విశ్లేషించుకొండి… ఈ బాబుల పోకడ గురించి ఎవరైనా తెలిసిన సినిమావాళ్లను కదలించి చూడండి, ‘అవును బాబూయ్’ అంటారు మీరే…
అన్నట్టు ఇకపై గాంధీ తాత కాదు, గాంధీ బాబు... చాచా నెహ్రూ కాదు, నెహ్రూ బాబు... సరేనా..?!
Share this Article