Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పావలా శ్యామల..! ఇలాంటోళ్లను ‘మా’ ఆదుకోదా…? ఏమీ చేయలేదా..?!

December 10, 2025 by M S R

.

Mohammed Rafee …… పావలా శ్యామలను ఒక హోమ్ తరిమేసింది… మరో హోమ్ అక్కున చేర్చుకుంది…

నటి పావలా శ్యామలకు కష్టాలు తీరేటట్లు కనిపించడం లేదు! బతుకు పోరాటం అడుగడుగునా చేస్తూనే వుంది! చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా చాలా మంది ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. అయినా ఆమెకు సరిపోవడం లేదు!

Ads

భయంతో డబ్బులు కూడబెట్టుకుంటుందా లేదా అప్పులేమైనా ఉన్నాయో తెలియదు కానీ, మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి బస్సుకు ఎదురుగా వెళ్లి తన కుమార్తెతో పాటు చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ సమాచారం తిరుమలగిరి పోలీసులకు అందింది. ఎసీపీ రమేష్ ఆదరించారు.

అసలేం జరిగింది

కొన్నాళ్ళుగా శ్యామల, తన కుమార్తెతో కలసి తిరుమలగిరిలో ఒక ఆశ్రయ హోమ్ లో ఉంటోంది! అయితే ఇద్దరి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అన్నీ బెడ్ పైనే జరిగే దశకు చేరుకోవడంతో ఆ హోమ్ నిర్వాహకులు చేతులెత్తేశారు!

తమకు భారంగా ఉందని, సర్వీస్ చేసే వాళ్ళు లేరని హోమ్ ఖాళీ చేసి వెళ్లాలని పలుమార్లు చెప్పినా శ్యామల వినలేదని సమాచారం. దాంతో నిన్న హోమ్ నుంచి బలవంతంగా పంపించేశారు.

ఆరోగ్యం బాగాలేకున్నా శ్యామలలో కోపం ఏమాత్రం తగ్గలేదు! హోమ్ నిర్వాహకులపై కోపంతో బలవన్మరణానికి పాల్పడతామని బెదిరించిందట. తిరుమలగిరి రోడ్లపై నిలబడి చంపేయండి అన్నదట!

ఆ హోమ్ నిర్వాహకులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఎసిపి రమేష్ వెంటనే స్పందించి, వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్నారు. కార్ఖానాలో వున్న ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ లో చేర్పించారు.

తల్లీకూతుళ్లకు బెడ్ లు కేటాయించి చికిత్స అందిస్తున్నారు. మందులు వేసుకోకుండా ఆరోగ్యాలు దెబ్బ తీసుకున్నారని, త్వరగా కోలుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

కోలుకున్నాక కూడా తమ ఆశ్రమంలోనే వారిద్దరికీ ఆశ్రయం కల్పిస్తామని వారు ప్రకటించారు. 300 పైగా సినిమాల్లో నటించిన శ్యామల చివరి దశలో కష్టాలు ఇతర నటులకు గుణపాఠం కావాలి! – డా. మహ్మద్ రఫీ

.


 



అవునూ, ఆమెకు ‘మా’లో సభ్యత్వం లేదా..? ఆ సంఘం ఏమీ పట్టించుకోదా..? వివరాలు తెలియవు కానీ, తలెత్తే సందేహం మాత్రం ఇదే...



నాకు తెలిసి ఆమెకు గత ప్రభుత్వం నుంచి నెలనెలా డబ్బు సాయం అందేది… ఐనా బదనాం చేసింది… ఇప్పటి పరిస్థితి ఏమిటో తెలియదు… ఇప్పటి హోంలో కూడా చాన్నాళ్లు ఉండలేదు ఆమె…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పావలా శ్యామల..! ఇలాంటోళ్లను ‘మా’ ఆదుకోదా…? ఏమీ చేయలేదా..?!
  • యూవీ బ్రిటిష్ భార్య మనకూ పరిచయమే…! వాళ్ల లవ్ స్టోరీ తెలుసా మీకు..?!
  • Conspiracy behind Crisis…? ఇండిగో నిర్వాకం వెనుక ఏదో భారీ కుట్ర..!
  • ఇక న్యాయ వ్యవస్థపైనే… హిందూ వ్యతిరేక ఇండి కూటమి అటాక్…
  • రేవంత్‌రెడ్డి చెప్పిన గ్వాంగ్‌డాంగ్ ప్రత్యేకత ఏంటి..? ఎందుకది ప్రేరణ..!?
  • రావుగారింట్లో రేవతి వింత పాత్ర..! కేర్‌టేకర్ కమ్ టీచర్ కమ్ ఎవరీథింగ్…!!
  • సినీ మృగాయణం! సకల జంతుజాతుల తెలుగు సినిమా ఎచ్చులు..!!
  • డెస్టినీ ప్రేమ- పెళ్లి…! విధి ఎవరిని, ఎప్పుడు, ఎలా కలుపుతుందో కదా..!!
  • ఇదీ అఖండ-2 అసలు పంచాయితీ… చివరకు పరిష్కారం అయ్యిందిలా…
  • నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions