.
నో డౌట్… ఇండిగో సంక్షోభం చాలావరకు స్వయంకృతమే… అంతకుమించి బరితెగింపు… అది మోనోపలీ వల్ల వచ్చిన బలుపు… దీనికితోడు కేంద్ర విమానయాన శాఖ వైఫల్యం…
డీజీసీఏ కొత్త రూల్స్ తీసుకొస్తే… ఆమేరకు కొత్త సిబ్బంది రిక్రూట్‌మెంట్ లేదు, శిక్షణ లేదు… జస్ట్, అలా వదిలేసింది… తీరా డీజీసీఏ గడువు రాగానే తెగించి ఫ్లయిట్లను రద్దు చేస్తూ పోయింది… ఈ మొత్తం యవ్వారం వెనుక ఇంకేమైనా అంతర్జాతీయ కుట్ర ఉందానేది తేలాల్సి ఉంది…
Ads
ఎందుకంటే..? అసలే తప్పులతడక వ్యాపారం, మరింతగా విశ్వసనీయత దెబ్బతింటే దానికే ప్రమాదం… వేల కోట్ల నష్టం… ఐనా ఎందుకలా తెగించింది..? అదీ సందేహం…
సరే, మరో ప్రధానమైన కారణం కూడా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు… అది P&W ఇంజన్లు… ఐనా, ఇండిగో గానీ, కేంద్ర విమానయాన మంత్రి గానీ ఈ వివరాలు వెల్లడించడం లేదు ఎందుకో మరి…

ఇండిగో షెడ్యూళ్లు దెబ్బతిన్నది భారత ప్రభుత్వపు కొత్త రూల్స్ వల్ల, వాటిని పూర్తిచేయని యవ్వారం వల్ల మాత్రమే కాదు…, ప్రధాన కారణం Pratt & Whitney ఇంజిన్ భద్రతా ఆదేశాలు…
Pratt & Whitney GTF ఇంజిన్ భాగాల భద్రతా ఆదేశాలు విమానాల షెడ్యూళ్లపై ప్రభావం చూపాయి… అదెలా అంటే..?
P&W ఇంజిన్ డైరెక్టివ్ ప్రభావం
EASA (యూరోప్), FAA (అమెరికా) భద్రతా సంస్థలు Pratt & Whitney GTF ఇంజిన్‌లలో సమస్యలను గుర్తించాయి… అందువల్ల, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌లైన్లు అత్యవసర ఇన్స్పెక్షన్ ఆదేశాలను పాటించాల్సి వచ్చింది…
ఇండిగోపై ఎక్కువ ప్రభావం ఎందుకు?
ఇండిగో A320 ఫ్లీట్‌లో 75% P&W ఇంజిన్లు ఉన్నాయి… ఇతర ఎయిర్‌లైన్లు CFM ఇంజిన్లను ఎక్కువగా ఉపయోగిస్తాయి, అందువల్ల FAA/EASA-issued ADలు వాటిని తక్షణం ప్రభావితం చేయవు…
ఇండిగో పెద్ద ఫ్లీట్ + ఎక్కువ సర్వీసులు → దీనివల్ల కొద్ది విమానాలు నిలిపివేయడం కూడా షెడ్యూల్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది… ఇంజిన్ల తనిఖీలు కూడా బాగా స్లోగా జరుగుతూ ఉండటంతో అనివార్యంగా తనఖీ జరగని ఇంజిన్ల విమానాల్ని నిలిపివేయాల్సి వచ్చిందట…
75% P&W vs 25% CFM ఇంజిన్ — ఇండిగో ఫ్లీట్
150+ FAA/EASA-issued ADs — ప్రపంచవ్యాప్తంగా

DGCA / విమానయాన శాఖ పాత్ర
DGCA కొత్త రూల్స్ పైలట్ల డ్యూటీ అవర్స్, భద్రతా పర్యవేక్షణ కఠినతరం చేస్తాయి… ఎప్పుడో ఏడాది క్రితం రూల్స్ జారీ చేస్తే, కోర్టులు కూడా గమనిస్తూ ఉంటే… ఇండిగో లైట్ తీసుకుంది… పైగా రోజూ వందల విమాన ప్రయాణాల్ని రద్దు చేస్తూ వెళ్లింది గుడ్డిగా…
డీజీసీఏ ఎప్పుడూ ఇండిగో నుంచి జవాబు అడగలేదు, ఏమేరకు కొత్త రూల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు అని..! కేంద్ర విమానయాన శాఖకు ఏ సోయీ లేదు… మరి మిగతా ఎయిర్ లైన్స్‌కు ఇంత సమస్య ఎందుకు రాలేదు..?
వాటి ఫ్లీట్ తక్కువ… పైగా కొత్త రూల్స్‌కు అనుగుణంగా పైలట్లు, క్రూ సంఖ్యను పెంచుకున్నాయి… పైగా వేరే ఎయిర్ లైన్స్ విమానాల ఇంజిన్లు వేరే ఇంజిన్ మోడల్ ఉపయోగించడం (ఉదా: CFM LEAP)…
(cfm vs p&w)
ఇతర ఎయిర్ లైన్స్ విమానాల ఇంజిన్ల సర్వీస్ / ఇన్స్పెక్షన్ ఇప్పటికే పూర్తి అయి ఉండటం కూడా వాటిపై పెద్దగా ప్రభావం కనిపించలేదు… పైగా FAA/EASA-issued ADలు ప్రత్యేకంగా P&W GTF ఇంజిన్‌లకు మాత్రమే…
సో, ఇంజిన్ ఇన్స్పెక్షన్ పూర్తయ్యే కొద్దీ, షెడ్యూళ్లు సాధారణ స్థితికి వస్తాయి అని ప్రపంచ విమానయాన నిపుణులు చెబుతున్నారు… అంతేకాదు, డీజీసీఏ రూల్స్ అమలుకు ప్రభుత్వం కూడా కొంత గడువు పెంచడం..!!

Share this Article