.
స్టార్డమ్ వచ్చాక దాన్ని ఎవరైనా సరే తమంతటతాము వదులుకోవడం కష్టం… రంగుల జీవితానికి అలవాటుపడితే దూరం జరగలేరు… అందుకే చాలామంది తారలు ఏజ్ బారయ్యాక కూడా రీఎంట్రీ ఇస్తుంటారు… డబ్బు, కీర్తి, ప్రచారంలో ఉండటం, యాక్టివిటీ అంత తేలికగా వదలని ప్రలోభాలు…
కానీ కొందరు ఉంటారు… కమలినీ ముఖర్జీ వంటి తారలు… ఆమె నటించిన ఆనంద్, గోదావరి సినిమాల్లో ఆమె పాత్రల్లాగే టెంపర్‌మెంట్ ఎక్కువ…ముంబైలో పుట్టినా ఆమె బెంగాలీ… 2000 ప్రాంతంలో టాప్ స్టార్… తెలుగు, తమిళం, మలయాళం సినిమాలే కాదు, హిందీలో కూడా చాన్సెస్ వచ్చాయి… చిరంజీవి, మోహన్‌లాల్ వంటి స్టార్లతో కూడా స్క్రీన్ షేర్ చేసుేకుంది…
Ads
ప్రత్యేకించి ఆనంద్, గోదావరి, గమ్యం వంటి సినిమాలతో కమలినీ ముఖర్జీ తెలుగువాళ్లకు బాగా దగ్గరైంది… కానీ దర్శకుడు కృష్ణ వంశీ ఆమెను హర్ట్ చేశాడు… 2014లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో ఆమె పాత్రను ఘోరంగా దెబ్బకొట్టాడు… ఆమె బాగా ఆశపెట్టుకుని, కష్టపడి నటించిన సీన్లనూ కత్తిరించేశాడు…
పోనీ, సినిమా హిట్టయ్యిందా..? లేదు… కృష్ణ వంశీ తన మార్క్ ఏమాత్రం చూపించలేక సినిమా కూడా చతికిలపడింది… సినిమా ఔట్‌పుట్ చూశాక కమలిని బాగా హర్టయింది… ఎంతగా అంటే, ఆ దెబ్బకు పూర్తిగా తెలుగు ఇండస్ట్రీనే వదిలేసింది… అలా కృష్ణ వంశీ కమలిని ముఖర్జీని టాలీవుడ్ నుంచి కత్తిరించేశాడు… ఆ సినిమాలో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ కాజల్ అగర్వాల్…
తరువాత కూడా ఒకటీరెండు తమిళం (ఇరైవి), మలయాళం (పులిమురుగన్) సినిమాలు చేసింది… ఇక నటనకే స్వస్తి చెప్పేసింది… పేరుకు మంచి పాత్రలు వస్తే చేస్తాను అని పైకి చెప్పినా సరే, ఆమె తన కెరీర్ పట్ల పెద్దగా శ్రద్ధ చూపించలేదు… అమెరికా వెళ్లిపోయింది… సిస్టర్స్‌తో ఏదో బేకరీ పెట్టిందట… కొన్నిరోజులు యూట్యూబ్ నడిపింది…
రోజులు గడిచిపోతున్నాయి… కొత్త తారలు దూసుకొస్తున్నారు… ఆమె పెద్దగా సౌత్ నిర్మాతలకు అందుబాటులోకి రాకుండా ఉండిపోయింది… ఏజ్ పెరుగుతోంది… లావయింది… అంతే పూర్తిగా తెరమరుగు… ఈవెన్ ఆమె గురించిన సమాచారమే ఎవరికీ తెలియకుండా పోయింది…
(కేవలం ఒక సినిమా దర్శకుడి వైఖరితో ఇక పూర్తిగా కెరీర్‌నే వదిలేయడం చాలామందిలో సందేహాస్పదంగానే ఉన్నా, అసలు కారణం మాత్రం ఆమె ఎవరికీ ఎప్పుడూ వెల్లడించలేదు…) రీసెంటుగా మొన్న ఏదో పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ మాత్రం అదే కారణం చెప్పింది… చాన్నాళ్ల తరువాత కనిపించింది…

ఆమె దృష్టి నటన నుండి స్వేచ్ఛ, ప్రశాంతత, ఇతర అభిరుచుల వైపు మళ్లింది… పెద్ద స్టార్డమ్, డబ్బు సంపాదించాలనే తపన కంటే, తనకి నచ్చిన జీవితాన్ని జీవించడం ఆమెకు ముఖ్యమని భావించి ఉండవచ్చు…
ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆమెకు రీఎంట్రీ ఆలోచన వచ్చినా సరే... రైలు మిస్సయినట్టే... కష్టం... మరీ కేరక్టర్ ఆర్టిస్టుగా చిన్నాచితకా పాత్రలు ఆమె చేయదు..! ప్రధాన పాత్రలు ఆమెకు దొరకవు...!!
Share this Article