మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా..? అనేది వదిలేయండి……… మోడీ స్థానంలో గనుక ఇందిరాగాంధీ ఉండి ఉంటే మమత బెనర్జీ ప్రభుత్వం ఉండేది కాదు… ఇప్పుడు కాదు, మొన్నటి ఎన్నికలకు ముందే ఉండేది కాదు… చీఫ్ సెక్రెటరీని రీకాల్ చేస్తాం, ఐపీఎస్ అధికారుల్ని రీకాల్ చేస్తాం వంటి పనికిమాలిన చిల్లరమల్లర చర్యలు ఉండేవి కావు… ఇది ఓ మిత్రుడి అభిప్రాయం… నిజమే… అక్షరాలా నిజమే…. మమత బెనర్జీ అప్పుడప్పుడు రహస్యంగా మోడీకి పంపించే డ్రెస్సులు, రసగుల్లాలు పనిచేస్తున్నాయేమో గానీ, ఈ విషయంలో మోడీ దీదీ పట్ల కఠినంగా వ్యవహరించడం లేదు… అది వదిలేస్తే… మోడీ స్థానంలో యోగీ గనుక ఉండి ఉంటే… బెంగాల్ కథే వేరుగా ఉండేది… తనది ఓ ప్రత్యేక దేశం అన్నట్టుగా వ్యవహరించే మమత పట్ల కేంద్రం వ్యవహరించే ధోరణి పూర్తిగా భిన్నంగా ఉండేది… ఇది ఇంకో మిత్రుడి అభిప్రాయం… నిజం… ఒక చంద్రబాబు పట్ల, ఒక మమత పట్ల మోడీ దూస్తున్న కత్తులకు పదును లేదు, ప్రయోజనమూ లేదు… శశికళ వంటి కేరక్టర్ల మీద కాదు, ఇలాంటి వాళ్ల మీద చూపించాల్సింది ప్రతాపం…. కేంద్రానికి గనుక ఓ టెంపర్మెంట్ లేకపోతే కష్టం…
ఈయన పేరు బందోపాధ్యాయ… బెంగాల్లోనే పుట్టాడు… ఏ కేంద్ర సర్వీసులోనూ పనిచేసినవాడు కాదు… చీఫ్ సెక్రెటరీ అయ్యాడు… ఈమధ్యే మూడు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది కేంద్రం… ఇప్పుడు ‘‘నీ మొహం, నీకు ఐఏఎస్ అధికారిగా ఎలా వ్యవహరించాలో తెలియదు, వెంటనే ఢిల్లీలో డీవోపీటీ దగ్గర రిపోర్ట చేయి‘’ అని ఆదేశించింది… తప్పేమిటంటే..? ప్రధాని తుపాన్ సమీక్షకు వస్తే హాజరు కాకపోవడం..! ఒక్క అధికారీ రాకపోవడం…!! నిజంగా తనది బాధ్యతారాహిత్యమే… అది మమత కారణంగా అనివార్యమైనా సరే..! ఇక్కడ రాజకీయాలు వదిలేయండి… పేరుకు మనం ఫెడరల్ అని చెప్పుకుంటున్నా భారతదేశ సార్వభౌమాధికారం కేంద్రానిదే… తమది వేరే దేశం, కేంద్రం రూల్స్ ఇక్కడ చెల్లవ్ అని తిరగబడితే కుదరదు, మోడీ వంటి అసమర్థ ప్రధాని ఉంటే తప్ప..!!
Ads
ఐఏఎస్ సర్వీస్ రూల్స్ గట్రా ఏం చదివినా అర్థమయ్యేది ఒకటే… ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై పెత్తనం అంతిమంగా కేంద్రానిదే… ఒక విపత్తు సాయం విషయంలో ఏకంగా ఈ దేశ ప్రధాని వస్తే ఆ సమావేశాన్ని చీఫ్ సెక్రెటరీ బహిష్కరించడం క్షమార్హం కాదు… ఇక ఒక సిస్టమ్ ఏమున్నట్టు..? రాజకీయంగా చిల్లర వేషాలకు అలవాటు పడిన మమత బెనర్జీ ఆ మీటింగుకు వస్తుందా లేదా అనేది ఆమె పొలిటికల్ మెచ్యూరిటీ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది… ఆమెకూ రాహుల్ గాంధీకి నడుమ పెద్ద తేడా కూడా కనిపించడం లేదు… కానీ రాష్ట్ర అధికార యంత్రాంగానికి బాస్ అనబడే చీఫ్ సెక్రెటరీకి రాజకీయాలు దేనికి..? మమతకు కోపం వస్తుంది, ఆమె వద్దని చెప్పింది అనుకుందాం… అలాంటప్పుడు తన రియల్ బాస్ అయిన కేంద్రం మాటేమిటి..? జనం మాటేమిటి..? ఒక సిస్టం మాటేమిటి..? ఇదా కేంద్రం- రాష్ట్రం సంబంధాల తీరు..? ఒక రాష్ట్ర అధికారులు ప్రధాని సమావేశాన్ని బేఖాతరు చేసినా సరే, మోడీ దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదూ అంటే…. మోడీ ఆలోచనలు, అడుగుల్లోనే తప్పున్నట్టు లెక్క…
గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేసేవాడు… మోడీకి దీటుగా విదేశీ పర్యటనలు చేసేవాడు… ఆఫ్టరాల్ మోడీ, నాకన్నా జూనియర్ అని బహిరంగంగానే కామెంట్లు చేసేవాడు… మోడీని ప్రధానిగా, అసలు కేంద్రాన్నే లెక్కచేసేవాడు కాదు… ఏపీ ఓ ప్రత్యేక దేశం అన్నట్టుగా ఓ రాజకీయ అపరిపక్వ ధోరణిలో ఉండేవాడు… దెబ్బతిన్నాడు… నేలకరుచుకుపోయాడు… ఇప్పుడు ఆ మోడీ నిజపాద దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నాడు… కాలం ఎప్పుడూ ఒకేరీతిలో ఉండదు… అయితే ప్రజలు శిక్షించారు చంద్రబాబును, కానీ మోడీకి ఏమీ చేతకాలేదు… ఈరోజుకూ…!! సేమ్, మమత… అంతకుముందు స్థానిక ఎన్నికల్లో ఆమె కనబరిచిన హింసాత్మక విశ్వరూపం, మొన్నటి ఎన్నికల అనంతరం సాగిన హింస… ఆమె హింసకు భయపడి వలసపోయిన జనం… ఏ కోణం చూసినా సరే, ఇందిరాగాంధీ గనుక ప్రధాని కుర్చీలో ఉండి ఉంటే మమత ఒక్కరోజు కూడా సీఎం కుర్చీలో ఉండేది కాదు… కేంద్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది… ప్రత్యేకించి ఇండియాకున్న ఇప్పటి బాహ్య సవాళ్ల నేపథ్యంలో…!! ఫెడరల్ స్పిరిట్ మన్నూమశానం పత్రికా విశ్లేషణల్లో, టీవీ డిబేట్లలో చెప్పుకోవడానికే బాగుంటయ్… ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్నీ రీకాల్ చేయడం, ఐటీ అధికారుల్ని ఉసిగొల్పడం…. ఇదా ఒక ప్రధాని అనుసరించాల్సిన సార్వభౌమ ధోరణి..? కరోనా దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఇదే ఫెయిల్యూర్… చివరగా :: ఇదే బెంగాల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యల్ని సంకల్పించింది కేంద్రం ఆమధ్య… ఏమైంది..? ఏమీ జరగలేదు… ఏమీ జరగదు… మోడీతో ఏమీ కాదు…!!
Share this Article