.
నో… రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు తనపై చేసే విమర్శలు పదే పదే వీగిపోతూనే ఉన్నాయి… పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుపై ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయమే తాజా ఉదాహరణ… వివరాల్లోకి వెళ్తే…
కేసీయార్‌కు కాళేశ్వరం ఎలా ‘ఏటీఎం’గా మారి, కోట్లకుకోట్లు సంపాదించి పెట్టీ పెట్టీ చివరకు ఎలా తస్కిపోయిందో చూశాం కదా… అచ్చంగా చంద్రబాబుకు అలాంటి ప్రాజెక్టు కావాలట… అసలే కేంద్రంలో తన మద్దతు మీద ఆధారపడిన బలహీన ప్రభుత్వం ఉంది కదా, ఏ అడ్డంకులూ లేకుండా తను అనుకున్నట్టు ప్రాజెక్టు చేపట్టవచ్చునని అనుకున్నాడేమో…
Ads
అసలు ఆ పోలవరం ప్రాజెక్టునే సరిగ్గా పట్టించుకోడు, పైగా ఎత్తు తగ్గించేసి, జస్ట్ ఓ బ్యారేజీ తరహా నిర్మాణంగా పరిమితం చేస్తున్నారు… అదీ పూర్తి కాదు, ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టు మీద ఆధారపడే బనకచర్ల అనే ప్రాజెక్టును మొదట ప్రతిపాదించాడు… అదీ కాళేశ్వరం బాపతే… లక్ష కోట్లు… పైపైన చూస్తే గోదావరి నుంచి పెన్నా బేసిన్ జలమళ్లింపు… అనుసంధానం, లక్షల ఎకరాల ఆయకట్టు, తాగునీరు, ఇండస్ట్రియల్ అవసరాలు అని చూపిస్తాడు…
(నదుల అనుసంధానం, లక్షల మందికి తాగునీరు అనగానే ఇక కేంద్ర జలవిధానం మేరకు ఎవరూ వ్యతిరేకించరు అనే భావనతో అవే లక్ష్యాలను చూపిస్తారు ప్రాజెక్టు ప్రతిపాదనల్లో…)
తీరా ఈ ప్రాజెక్టుకు సొంత క్యాంపు నుంచే బోలెడు విమర్శలు వచ్చాయి… తెలంగాణ ప్రభుత్వం అయితే ఆది నుంచీ అనేక అభ్యంతరాలతో, తన హక్కులు దెబ్బతింటాయని ఎదురుదాడి స్టార్ట్ చేసింది… ‘వ్యర్థ జలాలు’ అనే పదమే ఉండదు సాగునీటి పరిభాషలో… కానీ చంద్రబాబు ఆ పదం వాడుతూ… ఎలాంటి అనుమతులూ లేకుండా, కొత్త వివాదానికి తెరతీశాడు…
కేంద్ర జలసంస్థలు చంద్రబాబు అడగ్గానే ఒప్పుకోలేదు, సాధ్యం కాదన్నాయి… దీంతో చంద్రబాబు మరో పాట ఎత్తుకున్నాడు… ఇప్పుడు దాని పేరు ‘‘పోలవరం- నల్లమలసాగర్‘‘… ఉద్దేశాలు సేమ్… అంచనా వ్యయం… సుమారు ₹58,700 కోట్లు (ఇది పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అంచనా వ్యయం ₹90,000 కోట్లతో పోలిస్తే తక్కువ…) ఒకసారి చేపడితే అది ఎంతకు పెరుగుతుందో ఎవరూ చెప్పలేరు…
అసలు ఏమిటీ ప్రతిపాదన
-
-
పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వరద నీటిని ఇబ్రహీంపట్నం వరకు తరలిస్తారు…
-
ఇబ్రహీంపట్నం వద్ద నిర్మించే అక్విడెక్టు ద్వారా నీటిని నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోస్తారు…
-
అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తీసుకెళ్తారు…
-
తుది దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమలసాగర్‌కు (వెలిగొండ ప్రాజెక్టులో భాగం) నీటిని తరలించాలని ప్రణాళిక…
-
కుడికాల్వ సామర్థ్యాన్ని పెంచుతారు… ఇక అసలు విషయానికి వస్తే… పదే పదే రేవంత్ ప్రత్యర్థులు చేసే ఆరోపణ ఏమిటి..? ‘‘రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, తనకు గురుదక్షిణగా ఈ ప్రాజెక్టుకు వోకే చెబుతున్నాడు… సహకరిస్తున్నాడు…’’
నిజానికి ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు… జాతీయ స్థాయిలో వేర్వేరు కూటములు… రెండు రాష్ట్రాల నడుమ బోలెడు వివాదాలు అపరిష్కృతంగా ఉన్నాయి… ఎవరి రాజకీయ అవసరాలు వాళ్లవి… ఇక గురుశిష్య సంబధాలు, దక్షిణలు ఏముంటాయి..? చంద్రబాబు అడుగులకు మడుగులొత్తితే ఇక్కడ రేవంత్ రెడ్డి రాజకీయ పునాదులకే ఎసరు… సో, ఎవరైనా ఈ స్థితిలో తనకు మాలిన ధర్మం జోలికి ఎందుకు వెళ్తారు..?

అందుకే బనకచర్లకు సక్సెస్‌ఫుల్‌గా బ్రేకులు వేసింది రేవంత్ రెడ్డే… ఇప్పుడు తనలోనే ఓ సందేహం… కేంద్రంలో ఉన్నది ఎన్‌డీయే, ఏపీలోనూ ఎన్‌డీయే… పైగా తెలుగుదేశం మద్దతు మీద బతికే బీజేపీ… సో, చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తే మరెలా..? సో, అందుకని ఇక నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలనేది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం… గుడ్ డెసిషన్…
అంతేకాదు, బనకచర్ల మీద చేసినట్టే అన్ని జలసంస్థలు, పర్యావరణ (ఇది కీలకం) సంస్థల దగ్గర అభ్యంతరాలు నమోదు చేయబోతోంది… (CWC, కేంద్ర జల శాఖ, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, పర్యావరణ కేంద్ర బోర్డు, పోలవరం అథారిటీ… ఇలా)… ఎస్, ఢిల్లీలోనే బెటర్… పోలవరం ముంపు, అనుసంధానంతో ఎగువ రాష్ట్రాలకు రావల్సిన కృష్ణా జలాల వాటాలు, నదీజలాల పునఃకేటాయింపు వంటి అన్ని అంశాలూ చర్చకు వస్తాయి… రావాలి… శుభం…
ఇక ఇక్కడ చంద్రబాబుకు దాసోహం ఏముంది..? గురుదక్షిణ ఏముంది..? అబ్సర్డ్ అలిగేషన్స్... అన్నట్టు, బీఆర్ఎస్ కూడా సుప్రీంకోర్టులో వేయబోయే కేసులో ఇన్‌ప్లీడ్ కావచ్చు... ఖర్చులదేముంది..? కాళేశ్వరం డబ్బుల్లో కాసిన్ని..!!
Share this Article