.
‘బీజేపీ, బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కు… కలిసి పోటీచేసినా 33 శాతమే వాళ్ల గెలుపు… ఇక భవిష్యత్తులో అవి కలిసి పోటీచేయటానికి ఇది పునాది… ఇదే సంకేతం’ అని రేవంత్ రెడ్డి ఆరోపణ… ఇప్పటిదాకా వేచి చూస్తే… బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్యుల నుంచి అసలు కౌంటర్ లేదు, ఖండన లేదు… మౌనం అంగీకారమేనా..?
నో, మేం ఎవరితోనూ కలవం అని బీజేపీ అనడం లేదు, బీఆర్ఎస్ అనడం లేదు… రేవంత్ విమర్శ కరెక్టేనంటారా..? పొద్దున్నే మరో వార్త… తనను కలిసి బీఆర్ఎస్ ఎంపీలతో మోడీ ‘కేసీయార్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి, నేను ప్రత్యేకంగా ఇది చెప్పమన్నానని కూడా చెప్పండి…’ అని ప్రేమ కురిపించాడు…
Ads
(ఏవో అభివృద్ధి పనుల కోసం మోడీని బీఆర్ఎస్ ఎంపీలు కలిశారనేది పైకి చెప్పే కారణం… రాజకీయాల్లో ప్రతి కదలిక వెనుక బయటికి చెప్పబడని కారణాలుంటాయి… రాయబారమో, దౌత్యమో, ఏదైనా సందేశం చేరవేతో, సంసిద్ధత ప్రకటనో, ఒప్పుకోలో…)
‘‘అరె.., కేసీయార్ ఇదే మోడీని ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా దెప్పిపొడిచాడో, ఓ పిచ్చి వీడియోలతో బీజేపీని బదనాం చేసి, ఏకంగా పార్టీ జాతీయ కార్యదర్శినే అరెస్టు చేయడానికి పూనుకున్నాడో మోడీకి తెలియదా..? నాన్ బీజేపీ పార్టీలకు తనే మొత్తం ఎన్నికల ఖర్చు పెట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాడని తెలియదా..?
కొన్నేళ్లు ప్రధానిని పూర్తిగా అవాయిడ్ చేసి… చివరకు ఏదో ’మిస్టీరియస్ కారణం’తో బీజేపీపై దాడి చేసి… చివరకు ఆ కోపాన్ని శూర్పణఖ జన్మభూమి, రావణుడి జన్మభూమి అనీ వెక్కిరించిన తీరు గుర్తులేదా..? నాన్-బీజేపీ పార్టీలకు నిధులిచ్చాడని తెలియదా..? ఏమాత్రం నమ్మలేని కేసీయార్‌తో మళ్లీ ఈ ప్రేమలేంటి..? చేసుకుంటే విలీనం చేసుకో, అంతేతప్ప మళ్లీ పొత్తు, అవగాహన అంటే బీఆర్ఎస్‌కు ప్రాణం పోయడమే…
బీఆర్ఎస్‌ను శూన్యంవైపు నెట్టేస్తే, ఆ గ్యాపులోకి బీజేపీకి ప్రవేశం కదా… ఇంకా పదే పదే తెలంగాణ పార్టీని ఏదో ఓ పార్టీకి తోకగానే ఉంచేస్తారా..? అన్నింటికీ మించి ఏపీలో ఇదే కేసీయార్ బద్దవ్యతిరేకి చంద్రబాబుతో కలిసి, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ… తెలంగాణలో బీఆర్ఎస్‌తో ఓ వింత మైత్రి దేనికి..? సొంతంగా బీజేపీ ఇక ఎదగొద్దా..? వదిలేస్తున్నట్టేనా..?’’
….. ఇదుగో సగటు తెలంగాణ బీజేపీ అభిమాని అభిప్రాయం ఇదే దాదాపుగా… ఒకవైపు తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బలపడాలని ఆలోచిస్తూ, దానికి పూర్తి కంట్రాస్టుగా బీఆర్ఎస్‌తో ఈ దోస్తీ ఏమిటి..? (ఎన్‌డీయేలో చేరతానని కేసీయార్ అడిగితే నేనే వద్దన్నాను అన్నాడు మోడీ ఓసారి… ఇప్పుడు మారిన ఈక్వేషన్లు ఏమిటి మరి..?)

సరే, గతంలో చంద్రబాబు కూడా మోడీ మీద అనేకానేక చవకబారు విమర్శలు కూడా చేశాడు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు, మోడీ- చంద్రబాబుల ఆలింగనాలు, ఆప్యాయతా ప్రదర్శనలు చూశాం, కేసీయార్ పట్ల కూడా అవసరమొస్తే అలాగే ఉంటారు… కానీ తన లైన్ బీఆర్ఎస్సా..? టీడీపీ కూటమా..?
మొన్నటికిమొన్న జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలోనూ…. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ గెలిచేలా బీజేపీ సైలెంటుగా ఉండిపోలేదా..? అర్బన్ వోటర్ మరీ బీజేపీని డిపాజిట్ పోగొట్టేంత విముఖంగా ఉన్నాడా..? లేదు, అది ఉద్దేశపూర్వక నిష్క్రియ…! చివరలో బండి సంజయ్ తన స్టయిల్‌లో మెరవకపోతే ఆ వోట్లు కూడా రాకపోయేవి, కాదు, రానివ్వకపోయేవాళ్లు..!!
సో, బీఆర్ఎస్ కోసమే బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పించిన అదే ‘కేసీయార్ పట్ల సానుకూల ధోరణి’ ఇంకా కొనసాగుతూ… మరింత బలపడుతోందా..? కనిపిస్తున్న సంకేతాలన్నీ అవేనా..? సాక్షాత్తూ పెద్ద దొరవారి బిడ్డే చెబుతోంది కదా, చాన్నాళ్లుగా బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు సాగాయని… ఆ ప్రయత్నాలు ఇప్పుడు మరింత జోరుగా సాగనున్నాయా..? ఎన్డీయేలోకి బీఆర్ఎస్ ప్రవేశిస్తుందా..?
లేక మొత్తంగానే బీజేపీ తనను నిమజ్జనం చేసుకుంటుందా… (అప్పుడు కేటీయార్, హరీష్‌రావుల న్యాయం ఎలా చేస్తారు..?) ఇవీ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతున్న చర్చలు… అందుకేనా రేవంత్ రెడ్డి చేసిన విమర్శకు సూటిగా ఖండన లేకుండా పోయింది… బీజేపీ లైన్‌లోనే ఇంత గందరగోళం ఉన్నప్పుడు… ఎంపీలను మోడీ ఆక్షేపించడం దేనికి..? అసలు హైకమాండ్ నుంచే సరైన డైరెక్షన్ ఏముంది..?
రేవంత్ రెడ్డి తెలివిగా కొట్టాడు ఇద్దరినీ కలిపి… ‘రూరల్ 94 నియోజకవర్గాలకు గాను 87 స్థానాల పరిధుల్లో కాంగ్రెస్ సర్పంచులదే ఆధిపత్యం… కలిసి పోటీచేసినా ఆ రెండు కుమ్మక్కు పార్టీలకు 33 శాతం పంచాయతీలు కూడా దక్కలేదు…’ అని రాజకీయంగా కార్నర్ చేస్తే, ఎదుటి నుంచి కౌంటర్ లేదు…
ఎలాగూ మజ్లిస్ బీఆర్ఎస్ జాన్‌జిగ్రీ దోస్తీని వదిలేసింది... దానికి అధికారంలో ఎవరుంటే వాళ్లే దోస్తులు... దీనికితోడు బీఆర్ఎస్‌తో బీజేపీ దోస్తీ... అంటే, ఇక మైనారిటీలు బీఆర్ఎస్ నుంచి పూర్తిగా బయటపడినట్టేనా..? ఇక బాట కాషాయమార్గమేనా..!!
Revanth Reddy, BRS joining NDA, Revanth Reddy vs BRS, Telangana Politics, BRS BJP Alliance, Pink to Saffron, Muchata, KCR NDA, KTR Counter, Telangana Political News, BRS Saffron Path, Modi KCR relation, Panchayat elections nexus, Revanth Reddy vs KCR, BRS merger with BJP news, Telangana BJP fans reaction, Bandi Sanjay removal reason, Muchata Analysis
Share this Article