.
నిజంగానే అప్పట్లో సెన్సేషన్… 1981లో… టిక్ టిక్ టిక్ అనే ఓ సినిమా వచ్చింది… అందులో కమలహాసన్ హీరో… అందాల తారలు రాధ, మాధవి, స్వప్నల కీరోల్స్… ఓచోట ముగ్గురూ బికినీలో కనిపించేసరికి యువత వెర్రెత్తిపోయింది అప్పట్లో…
రాధ తెలుసు కదా… రాధ నాయర్… మన తెలుగు ప్రేక్షకులకు ఒక ఎనర్జీ… చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో పోటీపడి మరీ స్టెప్పులేసిన రాధ, తాజాగా సోషల్ మీడియాలో ఒక పాత ఫోటో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది… అదే 1981లో వచ్చిన ఆ ‘టిక్ టిక్ టిక్’ సినిమా నాటి ముచ్చట!
Ads
ఆ ఫోటోలో ఏముంది?
ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో హీరోయిన్లు రాధ, మాధవి, స్వప్న ముగ్గురూ బికినీలు ధరించి స్టైలిష్‌గా ఫోజులివ్వగా… లోకనాయక్ కమల్ హాసన్ వారి ముందు కూర్చొని గంభీరంగా కనిపిస్తున్నాడు…
రాధ ఏమంటుందటే?
ఈ పిక్ వెనుక ఉన్న కష్టాన్ని రాధ తన పోస్ట్‌లో చాలా సున్నితంగా వివరించింది…
-
అదొక పోరాటం..: “బికినీ ధరించి స్క్రీన్ మీద కనిపించడం అప్పట్లో అంత ఈజీ కాదు… ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. పర్ఫెక్ట్ బాడీ షేప్ కోసం, ఆ లుక్ క్యారీ చేయడం కోసం మేం ఎంత స్ట్రగుల్ అయ్యామో, ఎంత ఎఫర్ట్ పెట్టామో అర్థమవుతోంది…”
-
మాధవికి హ్యాట్సాఫ్..: “ముఖ్యంగా ఆ ఫోటోలో మాధవి కాన్ఫిడెన్స్, ఆమె యాటిట్యూడ్ అమేజింగ్… ఆమెకు స్పెషల్ అప్రిషియేషన్ దక్కుతుంది…”
-
కాస్ట్యూమ్ మ్యాజిక్…: ఆ కాలంలోనే అంతటి స్టైలిష్ దుస్తులను డిజైన్ చేసిన వాణీ గణపతి (కమల్ హాసన్ మొదటి భార్య) ని కూడా రాధ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది… (సైలిష్ దుస్తులేమున్నాయి, తలా రెండు బట్టపేలికలే కదా అంటారా..? అది వేరే సంగతి)…
విశ్లేషణ …. అందంగా ఉండటమే కాదు, దాన్ని కాపాడుకోవడం, పాత్ర స్వభావానికి తగినట్టు ధైర్యంగా ప్రదర్శించడం… నిజమే రాధ చెప్పినట్టు అంత ఈజీ కాదు… ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా పీకుతుంటుంది మనసులో… ఎస్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, బట్ నాట్ ఈజీ…
అదనపు ముచ్చట..: “అందం ఉంది కాబట్టే చూపించాం!” – మాధవి బోల్డ్ స్టేట్మెంట్
రాధ ఈ ఫోటో షేర్ చేస్తూ అప్పటి కష్టాన్ని గుర్తు చేసుకుంటే… ఇదే అంశంపై నటి మాధవి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాయి… బికినీ ధరించడం గురించి అప్పట్లో ఆమెను అడిగినప్పుడు, ఆమె చాలా కూల్‌గా ఇలా అన్నదట…
“మేము అందంగా ఉన్నాం, ఆ అందాన్ని ప్రదర్శించే ధైర్యం మాకు ఉంది… అందుకే అలా కనిపించాం! అందులో తప్పేముంది?”
అప్పట్లో ఆ మాటలు ఒక సంచలనం! రాధ తన పోస్ట్‌లో మాధవి ‘యాటిట్యూడ్’ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడానికి కారణం కూడా ఇదే కావచ్చు… గ్లామర్ ను కేవలం గ్లామర్ లాగే కాకుండా, ఒక ఆత్మవిశ్వాసంగా భావించిన నటీమణులు వారు…
రాధ చెప్పిన స్ట్రగుల్ ఒకవైపు... మాధవి కాన్ఫిడెన్స్ మరోవైపు! మొత్తానికి 'టిక్ టిక్ టిక్' భామలు అప్పట్లోనే ట్రెండ్ సెట్టర్స్ అని ఒప్పుకోవాల్సిందే... అందుకేనేమో, ఇప్పటి తరం హీరోయిన్లకు కూడా వీరే రోల్ మోడల్స్!
Share this Article