.
(గోపు విజయకుమార్ రెడ్డి) …. ఒక క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఎంత ఇంపార్టెంటో, ఒక రాజకీయ పార్టీకి బూత్ లెవల్ ఏజెంట్ అంతే ముఖ్యం… గత 15 ఏళ్లుగా దేశ రాజకీయాలలో, గత 30- 35 ఏళ్లుగా ఉత్తర భారత దేశ రాజకీయాలలో బీజేపీకి ఒక బలమైన పునాదిని నిర్మించటంలో బూత్ లెవెల్ ఏజెంట్లది క్రియా శీలక, నిర్ణయాత్మక పాత్ర…
ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే అదే మోడీ షా బలం కూడా… ఎంతలా అంటే… ఎంతో బిజీ షెడ్యూల్ ఉండే అమిత్ భాయ్ కూడా, ప్రతి ఎలక్షన్స్ ముందు బూత్ లెవెల్ ఏజెంట్స్‌తో ఒక్కసారైనా మీటింగ్ పెట్టి రివ్యూ చేసేంత ఇంపార్టెంట్…
Ads
దేశం మొత్తమ్మీద ఎన్నో వన్ సైడ్ విక్టరీస్ సాధించిన బీజేపీకి ఇప్పటికి ఇంకా లోటు ఉన్న రాష్ట్రాలు రెండు… అవి వెస్ట్ బెంగాల్, తమిళనాడు… ఈ రెండు రాష్ట్రాలు దేశ రాజకీయాలకు కీలకమే… (మొత్తం WB -41+TN-39=80 మొత్తం ఎంపీ స్థానాలు )… ఆర్థికంగా (చెన్నై, కోల్కతా మెట్రో నగరాలు )… విదేశాంగ విధానపరంగా (బెంగాల్- బంగ్లాదేశ్, తమిళనాడు- శ్రీలంక )… బీజేపీకి, దేశానికి అత్యంత కీలక రాష్ట్రాలు…

అంతేగాకుండా బీజేపీకి బలమైన పోటీ పార్టీల అధినేతలు మమత, స్టాలిన్… ఈ రెండు రాష్ట్రాలు వీళ్ల గుప్పిట్లో ఉన్నాయి… ఇండి కూటమిలో పవర్ ఫుల్… బీజేపీ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకునే అంశాలు… ముందు మనం తమిళనాడుకి వద్దాం, తర్వాత బెంగాల్ చూద్దాం..
గత రెండు సంవత్సరాల నుండి మోడీ అత్యధికసార్లు పర్యటించిన సౌత్ స్టేట్ తమిళనాడు… అంటేనే బీజేపీ ఫోకస్ ఏంటో అర్ధమైంది కదా… కొరడాలతో పబ్లిక్‌గా కొట్టుకొని పార్టీ పరువుని టీవీ చానళ్ళ ముందు పెట్టడం, అన్నాడీఎంకే పళని స్వామితో విభేదాలతో అన్నామలైని అధికారిక, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది…
తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్‌ని TN BJP ప్రెసిడెంట్‌గా చేసినా ఉపయోగం లేదనుకొని, ఇక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా నితిన్ నబిన్ ఎంపికలాగా ఇంకో కొత్త లీడర్‌ని నమ్ముకుంది… తన పేరు నైనర్ నాగేంద్రన్…

తిరునల్వేలి MLA, BJP అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, రాష్ట్ర BJP అధ్యక్షుడు… ఇంతకీ ఈయన పనితనం గురించి చెప్పుకోవాలంటే క్రింది ఫోటో చూడండి, ఎన్నో ఏళ్లుగా ద్రావిడ రాజకీయాలని శాసిస్తున్న DMK ,, AIADMK లతో దీటుగా బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లను తీర్చిదిద్దిన విధానం (అధికారిక ఎలక్షన్స్ కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం DMK-65 K, AIADMK- 63 K, BJP- 54 K)…

నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్‌ని బీజేపీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్ధమయ్యిందిగా… వోట్ చోరీ, ఈవీఎం టాంపరింగ్ అని ఏడ్చే పార్టీలు ఒక్కసారైనా బూత్ లెవెల్ ఏజెంట్స్‌పై దృష్టి పెడితే కనీసం పోటీలో ఉండే అవకాశాలు ఉంటాయి… లేదంటే రాబోయే ఎన్నికలు మరో బీహార్ లేదా మహారాష్ట్ర లోకల్ బాడీస్‌లాగే ఉన్నా ఆశ్చర్యపోవద్దు… పార్టీ నిర్మాణం ఎలా ఉండాలో చూడండి ఓసారి…
బీజేపీ బలం బూత్ అండ్ పోల్ మేనేజ్‌మెంట్… అంటే మందు, మాంసాలు, కొనుగోళ్లు గట్రా కాదు… బూత్ లెవల్‌లో పార్టీకి బాధ్యుడిని తీర్చిదిద్దడం… సో, బీజేపీ అధ్యక్షుల ఎంపిక ఎప్పుడూ ఆశ్చర్యమే, అది జాతీయం అయినా, రాష్ట్రీయమైనా, ఎటొచ్చీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పాపం బీజేపీ మందు కనుగొనలేక పోతుంది...
Share this Article