.
ఫలానా పార్టీ మళ్లీ గెలుస్తుంది అని ధీమా ఉంటేనే… పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలు విరాళాలు ఇస్తాయి… అవీ చాలావరకూ క్విడ్ ప్రో కో (నీకెంత- నాకేమిటి) పద్ధతుల్లోనే… అంటే అధికారంలో ఉంటే, లేదా అధికారంలోకి మళ్లీ వస్తారేమో అనిపిస్తే తప్ప పెద్దగా విరాళాలు రావు…
రాజకీయ పార్టీలు ఏవైనా ఈ విరాళాల మీద ఆధారపడేవే… అంతేతప్ప జనమో, కార్యకర్తలో చందాలు వేసి పోషించరు… ఆరోజులు కావు ఇవి… పైగా ఆ నిధుల వినియోగాల్లోనూ అక్రమాలు… ఎన్నికల బాండ్లు రద్దు చేశాక చాలా నిజాలు బయటకు వస్తున్నాయి…
Ads
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..? ఎలక్టోరల్ బాండ్స్ తరువాత 2024-2025 లో వివిధ పార్టీలకు అందిన డొనేషన్ల వివరాలు బయటికి వచ్చాయి… ఓసారి స్థూలంగా చూస్తే…
బీజేపీకి డొనేషన్ల పరిమాణం 6088 కోట్లకు పెరిగింది… ఈ సాధన సంపత్తితో అది ప్రస్తుతం దేశంలోకెల్లా రిచ్చెస్ట్ పార్టీగా మారింది… ఈ నిధులను ఎలా, దేనికి ఖర్చు చేస్తారనే సంగతి పక్కన పెడితే… ఆమేరకు డొనేషన్లు పెరగడానికి కారణం అది అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉండటం… ఇప్పట్లో ఈ ఆధిపత్యం తగ్గే సీన్ లేదు, దాంతో విరాళాలు పెరిగాయి… (జాబితాలో ఆదానీ, అంబానీ ఎట్సెట్రా లేకపోవడం విశేషమే…)

ఎవరయినా సరే గెలిచే గుర్రం మీద , గెలుస్తుందని నమ్మే గుర్రం మీద పందేలు కాస్తారు … అందుకే కంపెనీలు గెలుపు గుర్రం మీదే కాసులు కురిపిస్తూ, తామూ బాగుపడుతున్నాయి… బహిరంగ రహస్యం… తరువాత కాంగ్రెస్… 522 కోట్లు… మూడు రాష్ట్రాల్లో అధికారం ఉండటం ఒక్కటే దానికి ఆధారం… జాతీయ స్థాయిలో దాని ప్రాబల్యం, ప్రాభవం ప్లస్ భవిష్యత్ అధికార సూచనలు బలహీనం… అదీ దాని విరాళాలు తగ్గడానికి ఓ కారణం…
- డీఎంకే, టీఎంసీ విరాళాలు ఇతర ప్రాంతీయ పార్టీలకన్నా ఎక్కువే… కారణం అవి బలంగా ఉండటం, అధికారంలో ఉండటం, మళ్లీ పవర్‌లోకి వస్తాయని కంపెనీలు నమ్మడం… వైఎస్సార్సీపీకన్నా టీడీపీ విరాళాలు తగ్గడం కొంత విస్మయకరమే… ఏదో మతలబు ఉంది… ఇందులో కూడా జీరో దందా ఉందా..? అంటే లెక్కల్లోకి రానివి..! అంటే… వసూళ్లకు పేరొందిన ఎస్పీ విరాళాలు కోటి లోపే, అందుకే సందేహం…

బీఆర్ఎస్ విషయానికి వద్దాం… ఫార్ములా – ఈ యవ్వారం వెనుక కూడా క్విడ్ ప్రోకో బాపతు విరాళాల దందా ఉందని కదా ఆరోపణ… అనేక కంట్రాక్టులు… అధికారంలో ఉన్నప్పుడు విరాళాల వరద… ఒక దశలో 1000 కోట్లు దాటినట్టు గుర్తు… ఇప్పుడు 15 కోట్లు… అంటే పవర్‌లో ఉన్నప్పటికీ, ఇప్పటికీ తేడా చూడండి… ఓ విషయం గుర్తు చేసుకుందాం…

- ఎన్నికల సమయంలో కొన్ని బెట్టింగ్ నెట్‌వర్క్‌లు కరెక్ట్ రిజల్ట్ ప్రిడిక్షన్ ఇస్తాయి… ఎందుకంటే, అది కోట్ల టర్నోవర్… సరైన సమాచారాన్ని తీసుకుంటాయి, ఆమేరకు బెట్టింగ్ రేట్లు మారుతూ ఉంటాయి… సేమ్,
ఫలానా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకుంటేనే కంపెనీలు చందాలిస్తాయి లేదా దూరం పెడతాయి... బీఆర్ఎస్ విరాళాలు మరీ 15 కోట్లకు పడిపోవడం అంటే... దాని భవిష్యత్తు, మనుగడ మీద పారిశ్రామిక, వ్యాపార వర్గాల్లో ఏ అభిప్రాయం ఉన్నట్టు..?!
Share this Article